అమరావతిలో సీఆర్డీయే భవన ప్రారంభం

Publish Date:Oct 13, 2025

Advertisement

రైతులతో కలిసి రిబ్బన్ కట్ చేసిన చంద్రబాబు

రాజధాని అమరావతి ప్రాంతంలో మరో అధునాతన కట్టడం ప్రారంభమైంది. రాజధాని అమరావతికి గుండెకాయ వంటి సీఆర్డీయే భవనాన్ని  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం (అక్టోబర్  13)  ప్రారంభించారు.   ఏడు ఫ్లోర్లతో , రెండున్నర  లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మించిన భవనం ప్రారంభం కావడం రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత కీలక ముందడుగుగా చెప్పవచ్చు. కాగా ఈ భవన ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు... రాజధాని కోసం భూములిచ్చిన రైతులను కూడా భాగస్వాములను చేశారు 

ఈరోజు ఉదయం 9.54 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. సీఆర్డీయే భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన చంద్రబాబుకు   పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రైతులతో కలిసి సీఎం చంద్రబాబు రిబ్బన్ కట్ చేసి నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన భవనమంతా తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఉన్న మంత్రి నారాయణ.. భవన నిర్మాణ శైలి, సౌకర్యాలను సీఎంకు వివరించారు. వాస్తవానికి సీఆర్డీయే భవన నిర్మాణం 2019లోనే  పూర్తైనప్పటికీ, అప్పట్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ తాను అధికారంలో ఉన్న ఐదేళ్లూ కూడా భవన ఎలివేషన్ పనులను నిలిపివేసింది. తిరిగి 2024లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే మిగిలిన పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చింది.  సీఎం చంద్రబాబు ఆదేశాలు, సూచనల మేరకు  సీఆర్డీఏ కార్యాలయాన్ని  అత్యాధునిక  హంగులతో రూపొందించారు. పూర్తి సౌండ్ ప్రూఫ్ విధానంతో ఈ నిర్మాణా లు జరిగాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అమరావతి  నగరవ్యాప్తంగా పనులు జరిగే ప్రాంతాల్లో,  సీసీ కెమెరాలును ఏర్పాటు చేసి..  వాటి ద్వారా వచ్చే ఫీడ్ ను ఈ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేస్తారు. వీటితోపాటు డ్రోన్ ద్వారా చిత్రీకరించే దృశ్యాలను కూడా ఇక్కడ నుంచి పర్యవేక్షించే విధంగా అత్యాధునిక టెక్నాలజీని కమాండ్ కంట్రోల్ రూమ్  లో ఏర్పాటు చేశారు.

 రాజధాని నగరంలోని కీలక ప్రాంతాలు ,భవనాలకు సంబంధించిన మైక్రో లెవల్  డిజైన్ ఎక్స్పీరియన్స్  ను ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రదర్శనకు ఉంచుతారు. అమరావతి బృహత్ ప్రణాళిక ను ఈ కేంద్రంలోని నమునాల ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం ఉంటుంది.  అదేవిధంగా సచివాలయం ,హైకోర్టు, అసెంబ్లీ, రాజభవన్, సీఎం నివాసం తో పాటు క్వాంటం వ్యాలీ  ఉద్యానవనాలు, రహదారులు తదితర డిజైన్లను ఈ కార్యాలయం నుండి అత్యాధునిక టెక్నాలజీ ద్వారా వీక్షించే వీలు ఉంటుంది. 

ఈ భవనం  మొదటి అంతస్తులో  కమాండ్ కంట్రోల్ సెంటర్   ఏర్పాటు చేశారు. అదేవిధంగా క్యాంటీన్లు ,ఇతర ఎక్స్పీరియన్స్ సెంటర్లను నిర్మించారు.  కాన్ఫరెన్స్ హాల్స్ కూడా మొదటి అంతస్తులోనే ఉన్నాయి. ఇక పోతే..    రెండు, మూడు, ఐదు అంతస్తులు సిఆర్డిఏ వర్క్ స్టేషన్లు,  నాలుగో అంతస్తులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాలకు కేటాయించారు. ఇక ఆరో అంతస్తులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయం ,ఏడో అంతస్తులో మున్సిపల్  శాఖ మంత్రి పేషీ , ప్రజా ఆరోగ్య శాఖ తదితర కార్యాలయాల కు కేటాయించారు ..మొత్తం 4.23 ఎకరాలలో నిర్మించిన ఈ భవనంలో, మొత్తం 2.42 లక్షల చదరపు అడుగులు బిల్ట్  ఏరియా ఉంది.... ప్రతి అంతస్తులో 33 వేల చదరపు అడుగులు అందుబాటులో ఉంటుంది. 

By
en-us Political News

  
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.