చంద్రబాబు చాణక్యం!

Publish Date:Mar 8, 2025

Advertisement

గోదావరి జలాలపై ఏపీ సీఎం సంచలన ప్రకటనతో బీఆర్ఎస్ గప్ చుప్!
తెలంగాణలో చంద్రబాబు రాజకీయంపై ఆసక్తికర చర్చ

పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీలో ఎంత చర్చ జరుగుతోందో ఏమో కానీ.. తెలంగాణ రాజకీయ వర్గాల్లో మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపీలో కట్టబోతోన్న ఇరిగేషన్ ప్రాజక్టు మీద తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరగడానికి కారణం చంద్రబాబు చేసిన కామెంట్లే. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నేతలు చేద్దామనుకున్న సెంటిమెంట్ రాజకీయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు మొగ్గలోనే తుంచేశారు. తెలంగాణలో ఉన్న రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పినా.. అది మరింత ముదరకుండా చంద్రబాబు తన కామెంట్లతో కామ్ చేసేశారనే ప్రచారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీంతో భగ్గున మండుతుందనుకున్న సెంటిమెంట్ రాజకీయ మంటలు రేగకుండా చప్పున చల్లారేలా చంద్రబాబు చేశారనేది ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్సులో జరుగుతున్న చర్చ.

 ఒక్క టీఎంసీ నీటి కోసం.. రాష్ట్రాల మధ్య పెద్ద ఎత్తున గొడవలు.. ఆందోళనలు.. పోలీసుల మొహరింపు వంటి సంఘటనలు చోటు చేసుకున్న రోజులున్నాయి. అలాంటింది, ఏపీ సీఎం హోదాలో చంద్రబాబు చేసిన కామెంట్ ఆయనలోని రాజకీయ పరిపక్వతకు, దార్శనికతకు నిదర్శనంగా నిలిచిందని అంటున్నారు. 

పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అడ్డంకులు రాకుండా చేసుకోవడంతో పాటు తెలంగాణలో కూడా ఎలాంటి సెంటిమెంట్ రాజుకోకుండా చూడడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని అంటున్నారు. తెలంగాణ అభివృద్ధి కూడా తనకు ముఖ్యమని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నా.. తామేం అభ్యంతరం చెప్పలేదని,  ఇప్పుడు కూడా తెలంగాణ నీటి అవసరాల కోసం కావాలనుకుంటే మరిన్ని ప్రాజెక్టులు గోదావరి నదిపై కట్టుకోవచ్చంటూ బంపరాఫర్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. సహజంగా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తులు ఈ తరహా కామెంట్లు చేయడం దాదాపు ఉండదు. మరీ ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు.. నదీ జలాల విషయంలో సీఎం స్థాయి వ్యక్తులు అన్ని కోణాల్లో ఆలోచన చేస్తారు. కానీ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రయోజనాలు కూడా తమకు ముఖ్యమని చెబుతూనే.. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవద్దని స్పష్టంగా చెప్పేశారు. ఈ విధంగా ఏపీకి అతి ముఖ్యమైన ప్రాజెక్టుకు అడ్డంకులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారనే భావన తెలంగాణ సర్కిల్సులో వ్యక్తమవుతోంది. పైగా తాము నికర జలాలను వాడుకోవడం లేదని.. వరద జలాలను మాత్రమే తరలిస్తామని చెప్పడం ద్వారా సాంకేతిక పరమైన అడ్డంకులు లేకుండా చూసుకున్నారు చంద్రబాబు.

 గోదావరి జలాల గురించి చంద్రబాబు అంత విశాల హృదయంతో స్పందిస్తారని తామెవ్వరంఊహించలేకపోయామనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో కూడా జరుగుతోందట. చంద్రబాబు చాణక్యంతో తాము చేద్దామనుకున్న రాజకీయానికి చెక్ చెప్పేశారని బీఆర్ఎస్ నేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. గతంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతాన్ని తాము ఎద్దేవా చేశామనీ, ఇప్పుడూ  చంద్రబాబు అదే సిద్దాంతాన్ని   చెప్పడం ద్వారా తమ ప్రణాళికలు చెక్ పెట్టేశారన్న ప్రశంసాపూర్వక వ్యాఖ్యలు ప్రైవేటు సంభాషణల్లో బీఆర్ఎస్ నేతల నుంచే వస్తున్నాయి. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకునేందుకు తాము ఏపీ ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తే.. తమ రాష్ట్రంలో ప్రాజెక్టుకు ఇబ్బందుల్లేకుండా చూసుకోవడానికి ఏపీ సీఎం హోదాలో చంద్రబాబు చేసిన కామెంట్లతో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకోవడం కుదరడం లేదంటూ నిట్టూరుస్తున్నారట బీఆర్ఎస్ నేతలు.

By
en-us Political News

  
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.