Publish Date:Nov 16, 2024
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తినాయుడు కన్నుమూశారు. దీర్ఘకాల అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఉదయం ఆయన పరిస్థితి విషమించి కార్డియాక్ అరెస్ట్‌తో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు నారా రోహిత్ పీఆర్వో అధికారికంగా మీడియాకు తెలిపారు. కాగా సోదరుడి మరణ వార్త తెలియగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. తన చిన్నాన్న తీవ్ర అస్వస్థతతో ఉన్నారన్న సమాచారంతో మంత్రి లోకేష్ తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. నారా, నందమూరి కుటుంబసభ్యులు ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. నందమూరి రామకృష్ణ, దగ్గుబాటి పురందేశ్వరి వద్దకు వచ్చారు. మరి కొద్ది సేపటిలో చంద్రబాబు కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు.
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే అయిన రామ్మూర్తి నాయుడు అనారోగ్యం కారణం చాలా కాలంగా యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నారా రామ్మూర్తి నాయుడుకు ఇరువురు కుమారుడు ఉన్నారు. వారిలో ఒకరు నారా రోహిత్ సినిమా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. చంద్రబాబునాయుడు దంపతులు దగ్గరుండి ఈ నిశ్చితార్థం నిర్వహించారు. రామ్మూర్తినాయుడి అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన నారావారి పల్లెలో ఆదివారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbn-brother-nara-rammurthy-naid-no-more-25-188470.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.