నాడు చంద్ర‌బాబు.. నేడు లోకేశ్‌.. అడుగులు ప్రగతి దారులు

Publish Date:Nov 7, 2024

Advertisement

ఏపీ అన్ని రంగాల్లో ముందుండాలి.. దేశంలోనే కాదు.. ప్ర‌పంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాల‌తో పోటీప‌డాలి.. ప్ర‌పంచంలోని ప్ర‌ముఖ కంపెనీలు  ఏపీలో పెట్టుబ‌డులు పెట్టాలి.  ఆంధ్రప్రదేశ్ యువ‌త‌కు మెరుగైన ఉద్యోగ అవ‌కాశాలు ద‌క్కాలి.. ప్రతి కుటుంబంలో ఒక ఎంట్రపెన్యూర్ ఉండాలి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్  ఆర్థికంగా బ‌లోపేతం అవ్వాలి. పేదరికం లేని రాష్ట్రంలో నిలవాలి.  అందుకోసం నేను ఎంతైనా  క‌ష్ట‌ప‌డ‌తా.. ఇదీ సీఎం చంద్రబాబు నాయుడు మైండ్ సెట్. ఆయ‌న కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమితం కాలేదు.. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ఐటీకి కేంద్రంగా మార్చిన ఘ‌న‌త చంద్ర‌బాబుది. దేశంలోనే ప్ర‌ముఖ న‌గ‌రాల్లో హైద‌రాబాద్ ఒక‌ట‌ని ఈనాడు చెప్పుకుంటున్నామంటే అది చంద్ర‌బాబు వ‌ల్ల‌నే సాధ్య‌మైంది. ఈ విషయాన్ని ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు.  జనం కూడా అదే చెబుతారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం విడిపోయిన త‌రువాత.. ఏపీలో చంద్ర‌బాబు సీఎం అయ్యారు. అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించి.. ప్ర‌పంచంలోనే బెస్ట్ సిటీగా అమ‌రావ‌తిని తీర్చిదిద్దేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలో అమ‌రావ‌తి కేంద్రంగా ప్ర‌ముఖ ఐటీ కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టేలా ప్ర‌య‌త్నాలు చేశారు.  అమెరికా వెళ్లి అక్క‌డి వీధుల్లో తిరుగుతూ ప్ర‌పంచంలో పేరుపొందిన ప్ర‌తీ కంపెనీ గ‌డ‌పా తొక్కారు. ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేలా వారిని ఒప్పించారు. అయితే, 2019 త‌రువాత వైసీపీ అధికారంలోకి రావ‌డంతో సీన్ మొత్తం మారిపోయింది.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అమ‌రావ‌తి రాజ‌ధానిని నిర్వీర్యం చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఆ ప్రాంతాన్ని స్మ‌శానం అంటూ వైసీపీ నేత‌లు వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు  హ‌యాంలో ప‌లు ప్ర‌ముఖ కంపెనీల‌తో చేసుకున్న ఒప్పందాల‌ను ర‌ద్దు చేశారు. రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టిన ప‌లు కంపెనీలు ఏపీని వ‌దిలి వెళ్లిపోయేలా జ‌గ‌న్ స‌ర్కార్ వ్య‌వ‌హ‌రించింది. మ‌రోవైపు అమ‌రావ‌తి కాదు.. ఏపీకి మూడు రాజ‌ధానులు అంటూ ప్ర‌క‌టించిన జ‌గ‌న్ తన ఐదేళ్ల హయాంలో ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు. కానీ ఆ పేరు చెప్పి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోనూ అభివృద్ధి ఆనవాలు లేకుండా చేశారు.  దీంతో జనం జగన్ పాలనను ఛీకొట్టి 2024లో మ‌ళ్లీ తెలుగుదేశం  కూట‌మికి పట్టం గట్టారు. వైసీపీని ఛీ కొట్టారు. జగన్ పాలన పట్ల ప్రజలలో ఎంతగా వ్యతిరేకత వ్యక్తం అయ్యిందనడానికి ఆ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడమే తార్కానం. రాష్ట్రంలో చంద్రబాబు  ప్ర‌భుత్వం పగ్గాలు చేపట్టడంతోనే  ఏపీ  మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వం దిశగా పరుగులు పెడుతోంది. ఐదేళ్లు ముళ్ల కంప‌తో నిండిపోయిన అమ‌రావ‌తి ప్రాంతంలో  ప‌నులు జోరందుకున్నాయి.  కేంద్రం కూడా ఇతోధికంగా  స‌హ‌కారం అందిస్తుండ‌టంతో రాబోయే కాలంలో అమ‌రావ‌తి రాజ‌ధానిని అద్భుతంగా త‌యారు చేసేలా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు.  అయితే అప్ప‌ట్లో ప్ర‌ముఖ కంపెనీలు ఏపీలో పెట్టుబుడులు పెట్టేలా అమెరికా వెళ్లి ప్ర‌య‌త్నాలు చేసిన చంద్ర‌బాబు,  ఇప్పుడు ఆ బాధ్య‌త‌ను ఐటీ మంత్రి లోకేశ్ కు అప్ప‌గించారు.  

ఆ బాధ్యతను చిత్తశుద్ధితో చేపట్టిన మంత్రి నారా లోకేశ్ ఇటీవ‌ల అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా వారంరోజుల పాటు లోకేశ్‌ అమెరికాలో పర్యటించారు. ఈ క్రమంలోనే అక్క‌డ జ‌రిగిన ఐటీ సమ్మిట్-2024 లో పాల్గొన్న లోకేశ్‌.. పలు దిగ్గజ సంస్థల సీఈవోలతో భేటీ  అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఓవరాల్ గా అమెరికా పర్యటనలో 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో లోకేశ్‌ భేటీ అయ్యి ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. ఏపీలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉందని పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించడంలో లోకేశ్‌ వంద శాతం సక్సెస్ అయ్యారు. దీంతోపాటు చంద్రబాబు విజన్ ను కంపెనీల సీఈవోల‌కు వివ‌రించి వారు ఇప్ర‌స్ అయ్యేలా చేశారు. బ్రాండ్ ఏపీ లక్ష్యంగా సాగిన ఆయ‌న టూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. లోకేశ్‌ ప్రతిపాదనలపై పలు దిగ్గజ కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. లోకేశ్‌ పర్యటన విజయవంతం కావడంపై ఏపీ పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఐదు సంవత్సరాల అరాచక పాలనలో శిథిలావస్థకు చేరిన ఏపీ పారిశ్రామిక రంగానికి లోకేశ్ ఊపిరిపోశారని అంటున్నాయి. ప్ర‌పంచంలో పేరున్న కంపెనీలు ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేలా నాడు చంద్ర‌బాబు అమెరికా వీధుల్లో న‌డిస్తే.. నేడు లోకేశ్  అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన స‌మ‌యంలో కాలిన‌డ‌క‌న న‌డుకుంటూ వెళ్లి ప్ర‌ముఖ కంపెనీల ప్ర‌తినిధుల‌తో భేటీ అయ్యారు. దీంతో తండ్రికి త‌గ్గ త‌న‌యుడు.. ఏపీ అభివృద్ధే వారి ల‌క్ష్యం అంటూ ఏపీ ప్ర‌జ‌లు హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేస్తున్నారు. 

వైసీపీ హ‌యాంలో ఏపీ అన్నిరంగాల్లో వెనుక‌బ‌డి పోయింది. కొత్త‌గా ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఎవ‌రూ మొగ్గుచూప‌క పోగా.. చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీలో ఏర్పాటైన కంపెనీలు వెన‌క్కు వెళ్లిపోయేలా జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించింది. దీంతో నిరుద్యోగుల‌కు ఉద్యోగావ‌కాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగంకోసం హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్లిపోయారు. జ‌గ‌న్ ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌లో తీవ్రంగా న‌ష్ట‌పోయిన ఏపీని.. మ‌ళ్లీ గాడిలో పెట్టేందుకు చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంది. త‌ద్వారా రాబోయేకాలంలో అమ‌రావ‌తి కేంద్రంగా పెద్ద మొత్తంలో ప్ర‌ముఖ కంపెనీలు పె్ట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌గా.. కంపెనీల‌కు కావాల్సిన వ‌స‌తి సౌక‌ర్యాలు, ఇత‌ర బెనిఫిట్స్  క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌డుతోంది. మొత్తానికి మ‌రికొద్దిరోజుల్లో ఏపీ రూపురేఖ‌లు మారిపోతాయ‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.

By
en-us Political News

  
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.