మూడు దశాబ్దాల తరువాత.. ఒకే వేదికపైకి చంద్రబాబు, దగ్గుబాటి
Publish Date:Mar 6, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావులు గురువారం (మార్చి 6) ఒకే వేదికపై కనిపించనున్నారు. వీరిరువురూ తోడళ్లుళ్లన్న సంగతి తెలిసిందే. వీరిరువురూ ఒకే వేదికపై కనిపించి మూడు దశాబ్దాలు దాటింది. అటువంటి వీరిరువురూ గురువారం(మార్చి 6) గీతం యూనివర్శిటీలో ఒకే వేదికపై కనిపించనున్నారు. డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ గురువారం (మార్చి 6) విశాఖ గీతం యూనివర్శిటీలో జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ పర్యటన నుంచి చంద్రబాబు నేరుగా విశాఖకు రానున్నారు. ఈ ఇరువురూ ఒకే వేదికను పంచుకోవడం మూడు దశాబ్దాల తరువాత ఇదే మొదటి సారి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి ఎంవెకయ్యనాయుడు కూడా హాజరు కానున్నారు. కాగా చంద్రబాబు దగ్గుబాటి వెంకటేశ్వరరావులు ఇటీవలి కాలంలో కుటుంబ కార్యక్రమాలలో కలిసినప్పటికీ.. వేదిక పంచుకోవడం మాత్రం మూడు దశాబ్దాల తరువాత ఇదే తొలిసారి. ఇటీవలే ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన దగ్గుబాటి.. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రావాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత చంద్రబాబు మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు.
http://www.teluguone.com/news/content/cbn-and-daggubati-on-one-dias-after-three-decades-39-193928.html





