సీబీఐపై కేసులు వేయిస్తోంది ఎవరు?

Publish Date:Mar 21, 2022

Advertisement

‘ప్రత్యర్థిని నేరుగా ఢీకొట్ట లేనప్పుడు.. ఆ వ్యక్తికి మద్దతిస్తున్న వారిని బెదిరించు’ ఇది పూర్వీకులు చెప్పిన మాట. అంటే మన శత్రువును ఓడించాలంటే.. ఆ శత్రువుకు ఎవరి మద్దతు ఉందో, ఎవరి తోడ్పాటుతో మన మీదకు కాలుదువ్వుతున్నాడో గ్రహించాలన్నమాట. అలా మద్దతిచ్చే వ్యక్తిని మన ప్రత్యర్థికి దూరం చేస్తే.. సగం విజయం సాధించినట్లే అనేది వారు చెప్పిన మాట. ఏపీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఒక్కొక్క రహస్యాన్ని ఛేదిస్తున్న సీబీఐ అధికారుల మీద కేసులు పడుతున్నవైనం పూర్వీకుల మాటను అక్షరాలా పాటిస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.

వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రామ్ సింగ్ పై పులివెందుల బాకరాపురానికి చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి ఫిబ్రవరి 15న ఏఆర్ అడిషినల్ ఎస్పీ మహేశ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. వివేకా మర్డర్ కేసుకు సంబంధించి తనకు తెలిసిన విషయాన్నీ చెప్పినా సీబీఐ అధికారులు పట్టించుకోలేదని, తాము చెప్పినట్లు వినాలని తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించడమే కాకుండా కడప కోర్టులో పిటిషన్ వేశాడు. ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతో సీబీఐ అధికారి రామ్ సింగ్ పై కేసు నమోదు చేయాలని ఫిబ్రవరి 18న కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఐపీసీ 195ఏ, 323, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద రిమ్స్ సీఐ సదాశివయ్య కేసు నమోదు చేశారు.

అంతకు ముందు.. వివేకా హత్య కేసులో సీబీఐ తనకు 10 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందంటూ అనంతపురం జిల్లా యాడికికి చెందిన గంగాధర్ రెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం గమనార్హం. వివేకా హత్య కేసును తాను ఒప్పుకోవాలని సీబీఐ ఈ ఆఫర్ చేసిందని, వివేకా అనుచరుల నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఎస్పీకి గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి పాత్ర ఉందని సాక్ష్యం చెప్పాలని, లేదంటే ఆ హత్య తానే చేసినట్లు ఒప్పుకోవాలని సీబీఐ తనపై ఒత్తిడి చేసిందని గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేయడం విశేషం.

గంగాధర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి తమ డిపార్ట్ మెంట్ పైనే కేసులు వేయడం వెనుక ఎవరి హస్తమో ఉండి ఉంటుందని సీబీఐ అధికారుకు అనుమానం వచ్చినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే వారు చాప కింద నీరులా ఫిర్యాదు చేసిన వెనక ఉన్నది ఎవరనేది కూపీ లాగినట్లు తాజాగా అందుతున్న సమాచారం. వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి, వివేకా కుమార్తె సునీత, వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, అప్పటి పులివెందుల సీఐ శంకరయ్య, ఇంటి పనిమనిషి రంగయ్య తదితరులు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులే వారి చేత సీబీఐ అధికారుల మీద కేసులు వేయించినట్లు తెలుసుకున్నారట.

వివేకా హత్యకు స్కెచ్ వేసిన వారు, హత్యలో స్వయంగా పాల్గొన్నవారు, హత్యానంతరం ఆధారాలను తుడిపించి, ఆనవాళ్లు లేకుండా చేయించిన వారు, గుండెపోటుతో వివేకా మరణించారంటూ మీడియా ద్వారా లీకులు ఇచ్చి ప్రచారం చేసిన వ్యక్తులే ఇలా గంగాధర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి చేత కేసులు వేయించినట్లు సీబీఐ కూపీ లాగారని తెలుస్తోంది. దాంతో పాటుగా వైఎస్ వివేకా రాజకీయంగా తన ఎదుగుదలకు అడ్డొస్తున్నారనే అక్కసుతో ఆయన మర్డర్ కు స్కెచ్ వేసిన వ్యక్తే వీరిని ఉసిగొలిపి ఎదురు కేసులు వేయించినట్లు సీబీఐ విచారణలో తెలుసుకున్నట్లు సమాచారం. అలా ఉల్టా తమపైనే కేసులు వేయించడం వెనుక ఉద్దేశం సుస్పష్టం అని సీబిఐ భావిస్తోందట. కేసులు వేయించడం ద్వారా సీబీఐ అధికారులను తప్పుదోవ పట్టించడమే కాకుండా, కేసు దర్యాప్తు వేగాన్ని తగ్గించడం, విచారణ మరి కొంతకాలం ఆలస్యం చేయించడమే నిందితుల ఉద్దేశం అని సీబీఐ గుర్తించిందని సమాచారం. సీబీఐ అధికారుల మీదే కేసులు పెట్టించడం అంటే.. వివేకా హత్య కేసులో వారు వేగం పెంచకుండా నిరోధించడమే లక్ష్యంగా గంగాధర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి చేత నిందితులు కేసులు వేయించినట్లు చెబుతున్నారు.

ఏదేమైనా వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తుది దశకు చేరిందని తెలుస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నిస్తే.. వాటిని తీసుకునేందుకు తిరస్కరించారు. దీంతో సీబీఐ అధికారులు కడప కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎంపీ కనుక ఆయన అరెస్ట్ కోసం సీబీఐ అధికారులు లోక్ సభ స్పీకర్ కు సమాచారం ఇచ్చారని, త్వరలోనే సీబీఐ ఉన్నతాధికారులు ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ మీడియాలో వార్తలు వస్తుండడం గమనార్హం.

By
en-us Political News

  
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.