పంజ‌రంలో చిల‌క సిబిఐ, రంగు కాషాయం.. సిబ‌ల్‌

Publish Date:Aug 20, 2022

Advertisement

ఒక జాన‌ప‌ద క‌థ‌.. ఒక కోడి పొర‌పాటున రంగునీళ్లున్న తొట్టిలో ప‌డి క్ష‌ణం త‌ర్వాత బ‌య‌ట‌ప‌డింది. త‌ర్వాత ఈక‌ల రంగు మారింద‌ని గ్రహించి ముందు భ‌య‌ప‌డుతుంది. ఆన‌క ఆ రంగుల ఈక‌ల కోడి అన్ని ప‌క్ష‌ల మీదా అజ‌మాయిషీ చేస్తుంది.   ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాల నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ఘాటుగా స్పందించారు. ‘పంజరంలో చిలుక’ సీబీఐ ఇప్పుడు బయటకు వచ్చిందని, దాని ఈకలు కాషాయ రంగు లో ఉన్నాయని అన్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సయిజ్ విధానం అమలు లో అక్రమాలు జరిగినట్లు ఆరో పిస్తూ సీబీఐ శుక్రవారం 20 చోట్ల సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.  ఈ అంశంపై కపిల్ సిబల్  స్పందిస్తూ శనివారం ఓ ట్వీట్ చేశారు. సీబీఐ పంజరంలో చిలుక వంటిదని సుప్రీంకోర్టు 2013లో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.  సీబీఐ, ఒకప్పుడు ‘పంజరంలో చిలుక’ఇప్పుడు పంజరం నుంచి బయటపడింది.ఇప్పుడు దాని ఈకలు కాషాయ రంగులో ఉన్నాయి. దాని రెక్కలు ఈడీ అది తన యజమాని చెప్పిన మాటలను పలుకుతుంది! అని  కపిల్ సిబల్ ట్వీట్ చేశారు. 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  ఎదుగుతున్నారని, అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ ని అస్థిరపరచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోం దని కపిల్ ఆరోపించారు. 
ఇదిలావుండగా, మనీశ్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలపై కాంగ్రెస్  స్పందిస్తూ, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిం ది. ఢిల్లీ రాష్ట్ర ఎక్సయిజ్ విధానం  అమలులో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సిసోడియా ఇంట్లో సీబీఐ  శుక్రవారం(ఆగ‌ష్టు 19) దాదాపు 15 గంటల పాటు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమ మహమ్మద్ శనివారం మాట్లాడుతూ, ఎక్సయిజ్ విధానం అమలులో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు అల్కా లాంబా , అభిషేక్ దత్ కూడా ఇదే డిమాండ్ చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అనిల్ కుమార్  అంతకుముందు మాట్లా డుతూ, బూటకపు కంపెనీలకు లిక్కర్ లైసెన్స్‌లను చట్టవిరుద్ధంగా పంపిణీ చేస్తున్నారని, కోట్లాది రూపాయల కుంభకోణం జరు గుతోందని జూన్ నెలలో అప్పటి ఢిల్లీ  పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్థానా కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందన్నారు. 

ఇదిలా వుండగా, తన వద్ద నుంచి తన కంప్యూటర్, ఫోన్, కొన్ని దస్తావేజులను సీబీఐ తీసుకెళ్లిందని మనీశ్ సిసోడియా చెప్పారు. తాము ఎటువంటి తప్పు చేయలేదన్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఆపేందుకు ప్రయత్నాలు జరుగుతు న్నాయని ఆరోపించారు. తదుపరి ప్రశ్నించేందుకు తనను సీబీఐ పిలవలేదన్నారు.  లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలతోనే...ఢిల్లీ ఎక్సయిజ్ విధానం 2021-22ను అమలు చేయడంలో అక్రమాలు జరిగాయని, దీనిపై దర్యాప్తు చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవ ర్నర్ వీకే జక్సేనా ఆదేశించడంతో సీబీఐ దాదాపు 20 చోట్ల సోదాలు నిర్వహించింది. మనీశ్ సిసోడియా ఇంట్లో దాదాపు 15 గంటలపాటు సోదాలు జరిగాయి.

By
en-us Political News

  
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.