మరో సారి అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసు.. ఇక అరెస్టే?

Publish Date:Apr 16, 2023

Advertisement

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ముగింపు దశకు వచ్చేసినట్లేనా అంటే ఔననే సమాధానం వస్తున్నది. ఇప్పటికే ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ.. క్షణం ఆలస్యం చేయకుండా అవినాష్ రెడ్డికి మరో సారి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపింది.

ఆ నోటీసులు కూడా ఎలాంటి జాప్యం లేకుండా సోమవారం (ఏప్రిల్ 17) నాడే విచారణకు రావాలని పేర్కొంటూ ఆదివారం (ఏప్రిల్ 16) ఆయనకు నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి అరెస్టుకు కూడా ముహుర్తం ఖరారైనట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సీబీఐ అధికారులు ఆదివారం పులివెందులలోని అవినాష్ రెడ్డి నివాసానికి వెళ్లిన సమయంలో అవినాష్ లేరు. ఆయన తండ్రి భాస్కరరెడ్డి మాత్రమే ఉన్నారు.

దీంతో  ఆయన ఒక్కరినే సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఒక వేళ అవినాష్ రెడ్డి ఆ సమయంలో ఇంట్లో ఉండి ఉంటే ఆయనను కూడా అరెస్టు చేసి ఉండేవారని పరిశీలకులు అంటున్నారు. అంతే కాకుండా హైదరాబాద్ లోని అవినాష్ నివాసానికి కూడా సీబీఐ అధికారులు ఆదివారం వెళ్లారు. అయితే ఆయన అప్పటికే తన తండ్రి అరెస్టు వార్త తెలుసుకుని పులివెందులకు బయలు దేరడంతో హైదరాబాద్ నివాసంలో కూడా సీబీఐ అధికారులకు ఆయన దొరకలేదని అంటున్నారు.దీంతో ఆదివారం సాయంత్రం (ఏప్రిల్ 16)  సాయంత్రం అనివాష్ రెడ్డికి సీబీఐ సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చింది.  అసలు ఇప్పటికే నాలుగు సార్లు అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ ఆయనను అరెస్టు చేయనున్నట్లు కూడా కోర్టుకు తెలిపింది.

ఈ నేపథ్యంలో గతంలో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన అవినాష్ రెడ్డి ఆ తరువాత కారణాలేమైతేనేం దానిని ఉపసంహరించుకున్నారు.అంతకు ముందే సీబీఐ తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో సోమవారం విచారణ అనంతరం అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నెలాఖరులోపు .. వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేస్తామని సుప్రీం కోర్టుకు సీబీఐ తెలియజేసిన సంగతి విదితమే. అందుకే వేగం పెంచి అరెస్టుల పర్వానికి తెరలేపింది.

ఇప్పటికే ఈ కేసులో వరుస అరెస్టులు చేసింది. అవినాష్ సన్నిహితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాష్ తండ్రి భాస్కరరెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ తరువాతి టార్గెట్ అవినాష్ రెడ్డే అంటున్నారు.  తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేయడంతో అవినాష్ రెడ్డిలో కూడా ఆందోళన ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆయన పులివెందులలోని సీఎం కార్యాలయం వద్ద ఆదివారం (ఏప్రిల్ 16) విలేకరులతో మాట్లాడుతూ మళ్లీ పాతకథనే వినిపించారు. సీబీఐ దర్యాప్తు సవ్యదిశలో సాగడం లేదని ఆరోపణలు గుప్పించారు. తాము లేవనెత్తిన అభ్యంతరాలను సీబీఐ పట్టించుకోవడం లేదంటూ విమర్శలు కురిపించారు. దీనిపై న్యాయనిపుణులు నిందితుల ఆరోపణలు, అభ్యంతరాలను దర్యాప్తు సంస్థలు పట్టించుకోవలసిన అవసరం లేదని చెబుతున్నారు.  

By
en-us Political News

  
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.