వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు జగన్?

Publish Date:Jun 10, 2023

Advertisement

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.  ఆయనను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇక ఆయన బెయిలు కోసం తన కుమారుడు అవినాష్ రెడ్డిలా తెలంగాణ హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించక తప్పదు.

ఆయన ఏ హెల్త్ గ్రౌండ్స్ లో అయితే సీబీఐ కోర్టులో బెయిలు పిటిషన్  వేశారో.. వాటిని కోర్టు పరిగణనలోనికి తీసుకోలేదు. అయితే తన కుమాడురు అవినాష్ రెడ్డికి మాత్రం హైకోర్టు తల్లి అనారోగ్య కారణంగా బెయిలు ఇచ్చింది. దీంతో భాస్కరరెడ్డి కూడా తన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక భాస్కరరెడ్డి బెయిల్ పిటిషన్ పై సీబీఐ వేసిన కౌంటర్ అఫిడవిట్ లో భాస్కరరెడ్డి అత్యంత ప్రభావమంతమైన వ్యక్తి అనీ బెయిలు ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారనీ పేర్కొంది. అంతే కాకుండా సాక్షులను బెదరించే అవకాశాలు ఉన్నాయనీ పేర్కొంది.

అలాగే ఈ కేసులో సునీత తరఫు న్యాయవాదులు సైతం తమ వాదనలు వినిపించారు. వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకున్న సీబీఐ కోర్టు బెయిలు నిరాకరించింది. కాగా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్  వాదనల సమయంలో కూడా సీబీఐ, సునీత ఇవే వాదనలు వినిపించారు. అయినా అక్కడ అవినాష్ కు ఊరట లభించింది. దీంతో భాస్కరరెడ్డి  బెయిలు కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తారని పరిశీలకులు అంటున్నారు. కాగా అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సునీత సుప్రీంను ఆశ్రయించారు. సునీత పిటిషన్ సుప్రీంలో మంగళవారం (జూన్ 13)న విచారణకు రానుంది. దీంతో అవినాష్ విషయంలో  సుప్రీం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ, ఆసక్తి నెలకొని ఉంది. ఆరోగ్య కారణాలు, అయితే  ఢిల్లీ మద్యం కుంభకోణంలో  వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ కూడా వివేకా హత్య కేసులో అవినాష్ ఏ గ్రౌండ్ మీద అయితే యాంటిసిపేటరీ బెయిలు సంపాదించారో  అవే గ్రౌండ్స్ పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నుంచి మధ్యంతర బెయిలు పొందారు. అయితే ఈడీ రాఘవ బెయిలును సవాల్ చేయడంతో పై కోర్టు మధ్యంతర బెయిలు రద్దు చేసి రాఘవను లొంగిపోవాల్సిందిగా ఆదేశించింది. దీంతో సర్వోన్నత న్యాయస్థానంలో అవినాష్ కు కూడా అదే పరిస్థితి ఎదురౌతుందని, ఆయన బెయిలు రద్దయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయనీ న్యాయ నిపుణులు అంటున్నారు.

అదలా ఉంచితే.. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు సందర్భంగా తెలంగాణ హైకోర్టులోనూ, ఆ తరువాత భాస్కరరెడ్డి బెయిలు పిటిషన్ సందర్భంగా సీబీఐ కోర్టులోనూ  సీబీఐ తన అఫిడవిట్లలో ఏపీ ముఖ్యమంత్రి  జగన్ పేరును ప్రస్తావించింది.  వివేకానందరెడ్డి హత్య విషయం సీఎం జగన్మోహన్ రెడ్డికి  ఉదయం 6.15 గంటలకు ముందే తెలుసని సీబీఐ రెండు సందర్భాలలోనూవివేకా పీఏ బయటికి చెప్పకముందే జగన్‌కు తెలుసని దర్యాప్తులో గుర్తించామని పేర్కొంది. దీంతో వివేకా హత్య కేసు దర్యాప్తును అడుగడుగునా అడ్డుకోవడానికి  అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన ప్రయత్నాలన్నిటినీ వివేకా కుమార్తె వైఎస్ సునీత తన అసమాన న్యాయపోరాటంతో అడ్డుకున్నారని చెప్పాలి. ఈ విషయంలో ఆమె తన సోదరుడు జగన్ పై పై చేయి సాధించారని పరిశీలకులు అంటున్నారు.

ఇక ఇప్పుడు వివేకా హత్య కేసు విషయంలో జగన్ నోరు విప్పక తప్పని పరిస్థితి ఏర్పడిందనీ, సీబీఐ తన అఫిడవిట్లలో జగన్ పేరు ప్రస్తావించడమంటే ఆయనను విచారిస్తామని చెప్పడమేనని న్యాయనిపుణులు కూడా అంటున్నారు. ఏది ఏమైనా వివేకా హత్య కేసులో ఇక అవినాష్ అరెస్టు అనివార్యమని చెబుతున్నారు. అలాగే  ఆయన తండ్రి భాస్కరరెడ్డి బెయిలు కోసం  హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించినా  పెద్దగా ఫలితం ఉండదని అంటున్నారు. 

By
en-us Political News

  
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.