Publish Date:Aug 16, 2022
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైసీపీ ఎంపీ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై దర్యాప్తునకు సీబీఐ రంగంలోనికి దిగనుందా? జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అలాగే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. గోరంట్ల న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై జాతీయ రాజకీయాలలో కూడా దుమారం రేగుతోంది. గోరంట్ల మాధవ్ ఆ వీడియోలో ఉన్నది తాను కాదని అంటున్నారు.
అది ఫేక్ వీడియో అనీ, తనను బదనాం చేయడానికి కుట్ర పూరితంగా ఫేక్ వీడియోను సృష్టించారనీ ఆరోపిస్తున్నారు. బీసీ కార్డును వాడుకుంటూ.. ఇక బీసీనీ అయిన తనను రాజకీయంగా సమాధి చేయాలన్న తెలుగుదేశం కుట్రలో భాగమే ఈ వీడియో అని ఆరోపిస్తున్నారు. మరో వైపు అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఎటువంటి పోరెన్సిక్ పరీక్షలూ లేకుండానే గోరంట్ల న్యూడ్ వీడియో ఫేక్ అని సర్టిఫికేట్ (తీర్పు) ఇచ్చేశారు. అదే సమయంలో
ఏపీలో రచ్చగా ఉన్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో రాజకీయాల్లో దుమారమే రేపుతోంది. ఈ న్యూడ్ వీడియో తనది కాదు ఇది ఫేక్ అని ఎంపీ గారు అంటున్నారు.తనను బదనాం చేస్తున్నారు అని ఆయన ఆరోపిస్తున్నారు. కొందరు కలసి బీసీనైన తనను రాజకీయంగా హత్య చేయాలని చూస్తున్నారు అని ఆయన మండిపడ్డారు.
ఇలా ఉండగా తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభి అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్ లో చేసిన టెస్టులలో ఈ వీడియో ఒరిజినల్ అని తేలింది అంటూ మాధవ్ పై చర్యకు డిమాండ్ చేశారు. కాగా ఈ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై జాతీయ స్థాయిలో చర్చ సాగుతోంది. పంజాబ్ కి చెందిన కాంగ్రెస్ ఎంపీ లోక్ సభ స్పీకర్ కి లేఖ రాసి ఎంపీ మీద చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంకో వైపు జాతీయ మహిళా కమిషన్ కూడా దీని మీద పూర్తి విచారణ చేయాలని ఏపీ డీజీపీని కోరింది.
తాజాగా ఏపీ హై కోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ మాధవ్ ది అని భావిస్తున్న వీడియోపై సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ వీడియో మీద దర్యాప్తు జరపాలని ఆ లేఖలో కోరారు. అలాగే మాధవ్ మీడియా ముందు చేసిన కామెంట్స్ వల్ల కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందంటూ ఆ వీడియో బైట్స్ ని కూడా సీబీఐకి పంపించారు.ఆయన తన ఫిర్యాదుని ఈ మెయిల్ ద్వారా చెన్నై లో ఉన్న సీబీఐ అఫీసుకు పంపించారు. మరి సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేపడుతుందా అన్నది వేచి చూడాల్సిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbi-inquiry-on-godantla-nude-video-25-142056.html
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.