వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు విచారణ

Publish Date:Jun 8, 2026

Advertisement

 

మాజీ మంత్రి, వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు  చేపట్టాలంటూ ఆయన కుమార్తె సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా నిందితుల తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేస్తూ, ఈ కేసులో సీబీఐ ఇప్పటికే విస్తృతంగా దర్యాప్తు నిర్వహించి ఛార్జ్‌ షీట్లు దాఖలు చేసిందని, అందువల్ల మరోసారి తదుపరి దర్యాప్తు అవసరం లేదని కోర్టుకు తెలిపారు. కేసులో అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగానే విచారణ కొనసాగించాలని వారు వాదించారు. మరోవైపు, సునీత తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, గతంలో జరిగిన దర్యాప్తులో కొన్ని కీలక అంశాలు పూర్తిస్థాయిలో పరిశీలించబడలేదని పేర్కొన్నారు. 

ఇటీవల సీబీఐ దాఖలు చేసిన అదనపు ఛార్జ్‌షీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకోకుండా, కేసులో మిగిలిన అంశాలపై మరింత లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని వాదించారు.ఇటీవల సీబీఐ, కిరణ్ యాదవ్ మరియు చైతన్య రెడ్డి పాత్రపై విచారణ జరిపిన అనంతరం, వారి ప్రమేయానికి తగిన ఆధారాలు లభించలేదని కోర్టుకు నివేదించిన విషయం కూడా విచారణలో ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో సునీత తరఫు న్యాయవాదులు మరిన్ని కోణాల్లో దర్యాప్తు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇరు పక్షాల వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు, తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున తదుపరి దర్యాప్తు అవసరమా కాదా అనే అంశంపై మరిన్ని వాదనలు జరిగే అవకాశం ఉంది.ఈ కేసు ఇప్పటికే అనేక మలుపులు తిరిగిన నేపథ్యంలో, కోర్టు తీసుకునే తదుపరి నిర్ణయం కేసు విచారణపై కీలక ప్రభావం చూపే అవకాశముంది.

By
en-us Political News

  
అదనపు కట్నం కోసం వేధించి, చంపేందుకు చూశారు.. సంచలన ఫిర్యాదు..!
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నిఘా నిర్వహిస్తున్న పోలీసులపై ఓ యువకుడు కారుతోనే దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం
మానవ మెదడు తరంగాలు Brain Waves ఫిజికల్ ఏఐ రంగంలో సరికొత్త విప్లవాన్ని తీసుకొస్తున్నాయి. ఆలోచనల ద్వారా రోబోలను నియంత్రించే అధునాతన సాంకేతికత మరియు దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
బ్లూటూత్ సెక్యూరిటీ లోపాల వల్ల ఏకంగా 22 లక్షల కార్లు హ్యాక్ అయ్యే ప్రమాదంలో ఉన్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. KARR యాంటీ థెఫ్ట్ సిస్టమ్ ద్వారా కారు డోర్లు అన్‌లాక్ చేసే ముప్పుపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆనంద్ రాఠీ వెల్త్ Q1 FY27 ఆర్థిక ఫలితాలలో 24% లాభాల వృద్ధితో రూ. 116 కోట్ల నికర లాభాన్ని మరియు రూ. 1.06 లక్షల కోట్ల AUM మైలురాయిని సాధించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఎంఆర్‌ఎఫ్ MRF కంపెనీలో ప్రమోటర్ కుటుంబం ఎంత వాటా కలిగి ఉందో తెలుసుకోండి. మామ్మన్ ఫ్యామిలీ, రిటైల్ ఇన్వెస్టర్లు మరియు FIIల షేర్‌హోల్డింగ్ వివరాలతో కూడిన సమగ్ర కథనం!
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షపాతం లోటు కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్‌నినో పరిస్థితులను నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తూ రైతుల పంటలను రక్షించేందుకు సమగ్ర కార్యాచరణ
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే శాకంబరీ మహోత్సవాలు జూలై 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా జరగనున్నాయి
టీ20 ఫార్మాట్‌లో ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు మెరుపు ఆరంభం ఇవ్వడమే తన లక్ష్యమని సూర్యవంశీ చెప్పాడు. ఈ సిరీస్ లో సూర్యవంశీ రెండు హాఫ్ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే.
భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గత నాలుగేళ్లుగా సరికొత్త రికార్డులు సృష్టించిన ఆపిల్ ఐఫోన్ సేల్స్ 3% క్షీణించాయి. ఐఫోన్ 17 స్టాక్ కొరత, మార్కెట్ సవాళ్లు మరియు భారతదేశంలో ఆపిల్ సాధిస్తున్న బిలియన్ డాలర్ల ప్రయాణంపై సమగ్ర కథనం ఇక్కడ చదవండి.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 2 పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్, యువ సంచలనం, బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ ఆట స్వరూపాన్నే మార్చివేశాడు. వైభవ్ మైదానం నలుమూలలా విరుచుకుపడుతూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 49 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు సాధించాడు.
నిఫ్టీ 50 సూచీ ప్రస్తుతం ఓవర్‌సోల్డ్ జోన్‌లో ఉంది. 23,600 మద్దతు నిలిస్తే 24,000 వరకు పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అగ్ర శ్రేణి విశ్లేషకులు సూచించిన ఆప్షన్ స్ట్రాటజీలు మరియు లాభదాయకమైన 6 స్టాక్ రికమండేషన్లు ఇక్కడ చూడండి.
546 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లపై ఎకనామిక్ టైమ్స్ చేసిన సమగ్ర విశ్లేషణలో SIP రాబడుల్లో ఫార్మా మరియు హెల్త్‌కేర్ సెక్టోరల్ ఫండ్లు అగ్రస్థానంలో నిలిచాయి. లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, ఈఎల్ఎస్ఎస్ ఫండ్లను మించి ఇవి ఏ విధంగా మెరుగైన ఫలితాలు ఇచ్చాయో పూర్తి వివరాలు తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.