వివేకా హత్య కేసు.. గుట్టు రట్టైపోతోందా?.. సీబీఐ అఫిడవిట్ లో సంచలన విషయాలు!

Publish Date:Feb 23, 2023

Advertisement

సీబీఐ అధికారులు వివేకా హత్య కేసును దాదాపు ఛేదించేసింది. ఆ దర్యాప్తు సంస్థ తెలంగాణ హై కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో హత్యకు ముందు.. తరువాత ఏం జరిగిందన్న విషయాలను పూసగుచ్చినట్లు వివరించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ బెయిలు పిటిషన్ పై సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో హత్య జరిగిన తీరు, హత్య వెనుక ఎవరు ఉన్నారు. హత్య అనంతరం సాక్ష్యాల తారుమారులో అవినాష్ రెడ్డి పాత్ర..ఆయన తండ్రి భాస్కరరెడ్డి ప్రమేయం ఇలా పలు అంశాలను వెల్లడించింది.

దీంతో ఇంత కాలంగా వివేకా హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులపై ఉన్న అనుమానాలన్నీ వాస్తవమేనని సీబీఐ పేర్కొన్నట్లయ్యింది.    వైఎస్ హత్య పకడ్బందీ ప్రణాళిక ప్రకారం జరిగిందనీ, వివేకా గుండెపోటుతో మరణించారని నమ్మించేందుకు జరిగిన ప్రయత్నం కూడా ఆ ప్రణాళికలో భాగమేనన్న అనుమానాలు ముందునుంచీ ఉన్నాయి. సీబీఐ తాజా అఫిడవిట్ లో ఇలా చేసిందెవరన్న క్లారిటీ వచ్చేసింది.   హత్య జరిగిన సమయంలో జరిగిన ఫోన్ కాల్స్ గుట్టు బయటపడే సమయం దగ్గరకొచ్చేసిందని తాజా పరిణామాలను బట్టి అర్దమౌతోంది.  ప్రస్తుతం సునీల్ యాదవ్ కోణంలోనే సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ.. ఆ అఫిడవిట్ లో కూడా హత్యలో అవినాష్ రెడ్డి పాత్ర, ప్రమేయం గురించి ప్రస్తావించింది.

ఈ నెల 28న న అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించనున్న సంగతి విదితమే. ఆ విచారణకు ముందే సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో సాక్ష్యాలను మాయం చేసేందుకు అవినాష్ రెడ్డి ప్రయత్నించారని పేర్కొనడమంటే.. అవినాష్ రెడ్డి అరెస్టుకు సీబీఐ సిద్ధం అవుతోందనే అర్ధమని న్యాయ నిపుణులు అంటున్నారు.

అదే జరిగితే వివేకా హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు వెల్లడి అయ్యే అవకాశాలున్నాయని కూడా చెబుతున్నారు.  అవినాష్ ను ఈ నెల 28న విచారించిన తరువాత వివేకా హత్య జరిగిన తరువాత అవినాష్ రెడ్డి నుంచి తాడెపల్లి ప్యాలెస్ కు వెళ్లిన ఫోన్ కాల్ వివరాలను కూడా సీబీఐ బయట పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.  అదే జరిగితే కింగ్ పిన్‌లు బయటకు రావడం ఖాయమని  అంటున్నారు.  

By
en-us Political News

  
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
పండుగకు చెల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు.. కుటుంబమంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశపడ్డాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆ కళాశాలలో నవ్వులు విరిశాయి.. స్నేహితుల సందడి, దాండియా నృత్యాలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల తాకిడి ఒక్కసారిగా భారీగా పెరిగింది.
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కీలకమైన ముసాయిదా నిబంధనను తెరపైకి తెచ్చింది.
భారతీయ సైన్యంలో అత్యున్నత ప్రమాణాలుగా భావించే క్రమశిక్షణను ఉల్లంఘించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు దర్శించుకున్నారు
ఢిల్లీలో తీవ్ర సంచలనం సృష్టించిన పరిణామాల మధ్య కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు న్యాయస్థానం ఊరటనిచ్చింది.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయాననే అసంతృప్తి.. కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భర్తపై ద్వేషంగా మారిందా? కాపురం ప్రారంభమై నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు తీసుకున్న నిర్ణయం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.