వివేకా హత్య కేసులో భాస్కరరెడ్డి అరెస్టు.. అవినాష్ రెడ్డి కూడా?

Publish Date:Apr 15, 2023

Advertisement

వైఎస్ వివేకా హత్యకేసు విచారణలో సీబీఐ అధికారులు  వేగం పెంచారు. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని ఆదివారం (ఏప్రిల్ 16)  పులివెందులలో అరెస్టు చేశారు.  అంతకు ముందు తెల్లవారు జామునే రెండు వాహనాలలో పులివెందులలోని అవినాష్ రెడ్డి నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు అక్కడ భాస్కరరెడ్డిని విచారించారు. అనంతరం ఆయనను అదుపులోనికి తీసుకుని హైవదరాబాద్ తరలించారు.

ఈ కేసులో రెండు రోజుల కిందట అరెస్టైన అవినాష్ రెడ్డి సన్నిహితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి విచారణలో వెల్లడించిన వివరాల ఆధారంగా భాస్కరరెడ్డిని విచారించిన పోలీసులు భాస్కరరెడ్డిని అదుపులోనికి తీసుకున్నారు. భాస్కరరెడ్డి అరెస్టు విషయం  తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో భాస్కరరెడ్డి నివాసానికి చేరుకున్నారు. పటిష్ట బందోబస్తు మధ్య భాస్కరరెడ్డిని సీబీఐ అధికారులు మైదరాబాద్ తరలించారు. వివేకా హత్య కేసులో వరుస అరెస్టులతో సీబీఐ దూకుడు పెంచింది. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు భాస్కరరెడ్డి తరువాతి వంతు వైసీపీ ఎంపి అవినాష్ రెడ్డే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలు సరైనవేనని అనిపించే విధంగానే పరిణామాలు సంభవిస్తున్నాయి. పులివెందులలో భాస్కరరెడ్డి అరెస్టు కాగానే.. హైదరాబాద్ లోని వైఎస్ అవినాష్ రెడ్డి నివాసానికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఇప్పటికే నాలుగుసార్లు విచారించిన సీబీఐ, ఇప్పుడు మరోసారి ఆయన నివాసానికి వెళ్లడంతో ఇహనో, ఇప్పుడో ఆయన అరెస్టు కూడా అనివార్యమన్న భావన వ్యక్తమౌతోంది.

కాగా అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తామని గతంలోనే సీబీఐ హైకోర్టుకు తెలిపింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని అరెస్టు చేయడం, హైదరాబాద్ లోని అవినాష్ రెడ్డి నివాసానికి సీబీఐ అధికారులు చేరుకోవడం చూస్తుంటే ఆయనను కూడా అదుపులోనికి తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావించడం, అలాగే వివేకా హత్య కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని సీబీఐ పేర్కొనడం.. అందుకు తగ్గట్టుగానే ఆదివారం (ఏప్రిల్ 16) ఉదయమే భాస్కరరెడ్డిని పులివెందులలో అదుపులోనికి తీసుకోవడం, అలాగే హైదరాబాద్ లోని అవినాష్ రెడ్డి నివాసానికి సీబీఐ అధికారులు చేరుకోవడం చూస్తుంటే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

వరుస అరెస్టుల నేపథ్యంలో వివేకా హత్య కేసు కొలిక్కి వస్తున్నట్లే అనిపిస్తోంది. గజ్జట ఉదయ్ కుమార్ ను అరెస్టు చేసిన  సీబీఐ అతడి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను పేర్కొన్న సంగతి తెలిసిందే. వివేకా హత్య జరిగిన నిముషాల వ్యవధిలో ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలు ఘటనాస్థలానికి చేరుకున్నారనీ, సాక్ష్యాలను మాయం చేసి గొడ్డలి పోటును గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారనీ రిమాండ్ రిపోర్టులో పేర్కొనడమే కాకుండా అందుకు సంబంధించి గూగుల్ లుకౌట్ ఆధారాలు కూడా సమర్పించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే వివేకా హత్య కేసు తార్కిర ముగింపునకు వస్తోందని న్యాయ నిపుణులు అంటున్నారు. 

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.