ఏసీబీ వలలో పెద్దపల్లి మున్సిపల్ ఏఈ..!
Publish Date:Jul 14, 2026
Advertisement
రూ.2 లక్షల లంచంతో ఏఈ దొరికేశాడు.. మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారుల వలలో చిక్కి కటకటాల పాలయ్యాడు. పెద్దపల్లి మున్సి పల్ కార్యాలయంలో పనిచే స్తున్న ఏఈ లంచం తీసు కుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాం డెడ్‌గా చిక్కాడు. కల్లేపల్లి సతీష్ కుమార్(33)... పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అయితే పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని తెనుగువాడ హిందూ స్మశానవా టిక అభివృద్ధి మరియు కునారం రోడ్డులోని స్మశాన వాటిక అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.12,28,748 విలువైన తుది బిల్లును ప్రాసెస్ చేసి, ఆమోదం కోసం తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్ర క్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TUFIDC) హైదరా బాద్‌కు పంపించేందుకు అధికారిక అనుకూలం చేస్తానని చెప్పి సతీష్ కుమార్ కాంట్రాక్టర్ నుంచి రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. అంత పెద్ద మొత్తాన్ని ఇవ్వలేనని కాంట్రాక్టర్ పలుమార్లు వేడుకున్నప్పటికీ, "డబ్బులు ఇస్తేనే బిల్లు ముందుకు వెళ్తుంది" అంటూ అసిస్టెంట్ ఇంజనీర్ తేల్చిచెప్పాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పక్కా స్కెచ్ వేశారు. ఈ క్రమంలోనే బాధితుడు ఈరోజు ఉదయం సతీష్ కుమార్ నివాసానికి వెళ్లాడు రూ.2 లక్షల రూపాయలను లంచంగా స్వీకరి స్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత అతని ఇంట్లో నిర్వహించిన సోదాల్లో లెక్కల్లో చూపని రూ.32,31,900 నగదు లభించడంతో అధికారులు దానిని స్వాధీనం చేసుకు న్నారు. నిందితుడిని అరెస్టు చేసి కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం లో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లంచగొండి అధికారిగా ముద్రపడిన సతీష్.. స్థానికంగా కాంట్రాక్టర్లను బిల్లుల కోసం వచ్చేవారిని కమీషన్ల కోసవేధించేవాడు..పైఅధికారులకు ఇవ్వాల్సి ఉంటుందంటూ భారీగా లంచం డిమాండ్ చేసేవాడు..ఏసీబీకి సతీష్ పట్టుబడడంతో అతని బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.పై అధికారుల లంచగొండి వ్యవహారాలపైన కూడా దృష్టిపెట్టాలని ఏసీబీ అధికారు లకు స్థానికులు విజ్ఞప్తి చేశారు.
http://www.teluguone.com/news/content/cb-raids-telangana-36-225969.html





