ఏపీకి వెళ్ళండి.. ఐఏఎస్‌లపై ‘క్యాట్’ గర్జన!

Publish Date:Oct 15, 2024

Advertisement

ఆంధ్రా కేడర్ ఐఏఎస్‌లు తెగేదాకా లాగారు.. చివరికి తెగిపోయింది. వెళ్ళమన్న రాష్ట్రానికి గౌరవంగా వెళ్తే బాగుండేది... ఇప్పుడు సుద్దులు చెప్పించుకుని మరీ వెళ్ళాల్సి వస్తోంది. తమను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళాలని ఈనెల 9న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీఓపీటీ ఆదేశించిందని, ఆ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, కాటా ఆమ్రపాలి, ఎ.వాణీప్రసాద్, రొనాల్డ్ రాస్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)ని ఆశ్రయించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావలసి వున్న జి.సృజన తనను ఆంధ్రలోనే వుంచాలని కోరుతూ క్యాట్‌ని ఆశ్రయించారు. అయితే వీరందరూ ప్రభుత్వం చెప్పినట్టు చేయాల్సిందేనని క్యాట్ స్పష్టం చేసింది. వీళ్ళ పిటిషన్‌ని విచారణ జరుపుతున్న సమయంలో క్యాట్ కీలకమైన వ్యాఖ్యలు చేసింది. "ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్నారు. అక్కడకి వెళ్ళి, వారికి సేవ చేయాలని మీకు లేదా? ఐఏఎస్‌ల కేడర్ కేటాయింపుల విషయంలో డీఓపీటీకి పూర్తి అధికారాలు ఉన్నాయి’’ అని క్యాట్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న వాకాటి కరుణ, కాటా ఆమ్రపాలి, వాణీప్రసాద్, రోనాల్డ్ రాస్ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లాల్సివుంది. ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న సృజన తెలంగాణకు రావాల్సి వుంటుంది. ఐఏఎస్‌లు, డీఓపీటీ వాదనల తర్వాత డీవోపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ‘క్యాట్’ నిరాకరించింది. ఎవరికి కేటాయించిన రాష్ట్రానికి వాళ్ళు వెళ్లాల్సిందేనని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

By
en-us Political News

  
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
పండుగకు చెల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు.. కుటుంబమంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశపడ్డాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆ కళాశాలలో నవ్వులు విరిశాయి.. స్నేహితుల సందడి, దాండియా నృత్యాలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల తాకిడి ఒక్కసారిగా భారీగా పెరిగింది.
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.