ఎన్నికల ఫలితాలను కులాలే నిర్ణయిస్తాయి!

Publish Date:Jun 22, 2022

Advertisement

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారి పోయిందా?  రాష్ట్ర రాజకీయ స్వభావం వర్గ దృక్పథం నుంచి, కుల సమీకరణ వైపుగా సాగుతోందా? అంటే ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్. రాజకీయ విశ్లేషకులు తిరుమల,అవుననే అంటున్నారు. రాష్ట్ర విభజన అంతరం తెలంగాణా ప్రాంత రాజకీయాలో వచియన్ మార్పులను ఆయన లోతుగ అధ్యయనం చేశారు. విపులంగా విశ్లేషించారు. 

తెలంగాణ సెంటిమెంట్’ను సిద్దాంతంగా మలచు కోవడంలో తెరాస విఫలమైంది. అందుకే, ఒక బలమైన రాజకీయ శక్తిగా నిలవలేక పోయిందని ప్రొఫెసర్ తిరుమల పేర్కొన్నారు. అలాగే, గడచిన ఎనిమిది సంవత్సరాలలో తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక పోయింది. ఫలితంగా  పార్టీ  ప్రతిష్ట దిగజారింది. ప్రజలకు పార్టీకి మధ్య దూరం పెరిగి పోయింది.  ఈ నేపధ్యంలో తెలంగాణ సమాజం కులాల వారీగా విడి పోయింది, ముఖ్యంగా ఓబీసీ, ఎస్సీ’ఎస్టీ సామాజిక వర్గాల్లో కుల ప్రాతిపదికన ఓటు వేసే పరిస్థితి స్పష్టమైంది. ఈ మూడు ప్రధాన సామాజిక  వర్గాలు తెరాసకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని ప్రొఫెసర్ విశ్లేషించారు. 
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాజకీయ నైజం,  స్వభావం మారిపోతున్న నేపధ్యంలో, రానున్న  ఎన్నికలలో ఓటింగ్ సరళి కూడా మారి పోతుందని ఆయన విశ్లేషిస్తున్నారు. అంతేకాదు, తెలంగాణ  సెంటిమెంట్ చెదిరి పోయిన నేపద్యంలో, తెలంగాణ ఉద్యమంతో ముడిపడిన, అనేక కులాలు, ఇప్పడు అధికార తెరాసకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు సిద్దమవుతున్నాయని చెప్పు కొచ్చారు. అయినా, తెరాస సింగల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని పేర్కొనారు. మిత్ర పక్షం ఎంఐ ఎంతో కలిసినా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ రాదని, తిమల ఒక నివేదికలో పేర్కొన్నారు. 
అదే విధంగా రెడ్డి సామాజిక వర్గం, ఇప్పడు మరోసారి కాంగ్రెస్ వైపు మొగ్గు  చూపుతోంది.

నిజానికి 1940ల నుంచి కూడా రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. బ్రాహ్మణ, మాల సామాజిక వర్గాలను కలుపుకుని కాంగ్రెస్’కు దన్నుగా నిలిచింది. ఇప్పుదు కూడా  రెడ్డి సామాజిక వర్గం ఓటులో 99 శాతం కాంగ్రెస్ వైపే మొగ్గుచుపుతున్నారు. తెరాసకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తారని, ఇతర పార్టీలలో ఉన్న రెడ్డి సామజిక వర్గాన్ని పక్కన పెడితే, సాధారణ ఓటర్లు ప్రధానంగా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. అదే విధంగా, తమకు పట్టున్న ప్రాంతలలో కమ్మ సామాజిక వర్గం,ఇప్పటికీ టీడీపీ వైపే మొగ్గు చూపుతోంది. టీడీపీ  సమస్థాగతంగా నిలబడితే, కమ్మ సామాజిక వర్గం టీడీపీకి ఓటేసేందుకు సిద్దంగా వుందని అయన విశ్లేషించారు. 

ఇక మరో కీలక సామజిక వర్గం  మున్నూరు  కాపుల విషయానికి వస్తే, సంఖ్యపరంగా చూస్తే, చాల బలమైన సామాజిక వర్గం. ఆ బలంతోనే మున్నూరు కాపులకు అన్ని పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. పదవులు ఇస్తున్నాయి.అయితే మున్నూరు కాపులు ఒక వ్యవస్థీకృత రాజకీయ శక్తిగా నిలిచే పరిస్థితి ఇంకా రాలేదు ఈసారి ఈ సామజిక వర్గం ఓట్లు బీజేపీ, తెరాస సగం సగం పంచుకునే అవకాశం ఉందని ప్రొఫెసర్ తమ విశ్లేషణలో పేర్కొన్నారు. 

అలాగే, సంప్రదాయంగా కాంగ్రెస్ పార్టీని  కొమ్ము కాస్తారని పేరున్న పద్మశాలీలు గడచిన రెండు ఎన్నికలో తెరాస వైపు మొగ్గు చూపినా,  ఈ సారి మళ్ళీ, కాంగ్రెస్ కే జై కొడతారని ఆయన వివరించారు. ప్రధానంగా కల్లు వ్యాపారంలో ఉన్న గౌడ సామాజిక వర్గ  కుడా ఈసారి తెరాసకు వ్యతిరేకంగా ఓటు వేయాలనే నిర్ణయానికి వచ్చింది. నిజానికి కుల వృత్తుల పై ఆధార పడే వర్గాలు అన్నీ,తెరాస ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. 

యాదవ సామాజిక వర్గం ఓటు బలమున్న సామాజిక వర్గం. అలాగే, రాజకీయంగానూ పట్టున్న సామజిక వర్గం. అయితే, నాయకులు పదవులు పుచ్చుకోవదమే కానీ, తమ సామాజిక వర్గం అభివృద్ధికి పని చేయడం లేదనే ఆరోపణ యాదవ్ నేతలపై వుంది. అందుకే ఆ వర్గం ఓటు ఎటుపడుతుందో ఉహించడం కష్టమని ప్రొఫెసర్ పేర్కొన్నారు. తెరాసతో ముదిరాజుల హనీమూన్ ముగిసింది, ఇప్పడు వారు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇక తెలంగాణ ఉద్యమంలో కీలక భూమికను పోషించిన ఇతర కులాలు, ఎంబీసీలు రాష్ట్ర జనాభాలో నాలుగో వంతున్నారు.

తెరాస ప్రభుత్వం వారి గోడు అసలు పట్టించుకోలేదనే తీవ్ర అసంతృప్తితో రగిలి పోతున్న అ వర్గం, తెరాసను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 15 శాతం వరకు ఉన్న సంచార జాతులు అంతే, తెరాసకు వ్యతిరేకంగా ఉన్నారు, మాలలు, కాంగ్రస్ వైపు మొగ్గు చుపుతున్నారు. ఇక తెలంగాణ ఉద్యమలో క్రియాశీల పాత్రను పోషించిన, మాదిగలు, బీఎస్పీ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే బీఎస్పీ, తెరాసతో  పొత్తు పెట్టుకుంటే, మాదిగల ఓటింగ్ సరళిలో మార్పు వచ్చే అవకాశం ఉందని ప్రొఫెసర్ తమ విశ్లేషణలో వివరించారు. ఆ రెండు పార్టీల మధ్య పొత్తుకు అవకాశం ఉందని పేర్కొన్నారు షెడ్యూలు తెగలు ఇప్పటికే పోడు భూముల విషయంగా తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడు తున్నారు. ముస్లిం ఓటు పాత నగరంలో సహజంగానే ఎంఐఎంకు పోతుంది. జిల్లాలలో  బీజేపెకి వ్యతిరేకంగా, పోలవుతుందని,  
ఇలా ఏలా  చూసినా కుల సమీకరాణాలు, తెరాసకు వ్యతిరేకంగా ఒకటవుతున్నాయి. అయితే ఇంకా ఎటూ తేల్చుకోని సామాజిక వర్గాలు అనేక ఉన్నాయి, ఎన్నికల ప్రకటన వచ్చిన  తర్వాత కానీ, ఈ సామాజిక వర్గాలు ఒక నిర్ణయానికి రాక పోవచ్చును. ఎన్నికల పై డబ్బు ప్రభావం ఎటూ ఉంటుంది. పట్టణ ప్రాంతాల ఉద్యోగులలో, అసంతృప్తి  వుంది. సకాలంలో జీతాలు, పెన్షన్లురాని, ప్రభుత్వ ఉద్యోగాలోనే కాదు, ప్రైవేటు ఉద్యోగులలో కూడా తెరాస ప్రభుత్వం పట్ల వివధ కారణాల వలన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విశ్వవిద్యాలయ విద్యార్ధులు, నిరుద్యోగ యువత  ఆందోళన బాట పట్టారు. తెరాస ప్రభుత్వం, మంత్రులు ప్రజాస్వామ్య విలువలను పాతరేసే తీరు పట్ల  మేథావి వర్గం మండిపడుతోంది.  

ఇలా ఎలా చూసినా, కులాల వారీగా సేకరించిన సమాచారం ప్రకారం చూసినా ప్రభుత్వ వ్యతిరేక వ్యక్తమవుతోంది. సో.. మరో సారి తెరాస గెలవదు. ఆ అవకాశమే లేదు. అయితే, బీఎస్పీ వంటి చిన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తెరాస పరిరిస్థితి కొంత మెరగయ్యే అవకాశం ఉండవచ్చును. అయితే, తెరాస సింగల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా, కేవలం ఎంఐఎం మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు . పార్టీ ఫిరాయింపులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. మరో వంక,బీజేపీ ఎదుగుదలకు కొన్నిఅవరోధాలు ఉన్నా, అవ్యవస్తీకృత  సామాజిక వర్గాలను ఆకట్టుకుని సంస్థాగతంగా  ఆ వర్గాలకు చేరువ కావడంతో పాటుగా ఉత్తర ప్రదేశ్’లోలాగా వెనకబడిన కులాలో మరింత వెనకబడిన కులాలను కలుపుకు పోగలిగే స్థాయిని బట్టే పార్టీ భవిష్యత్ ఆధరపడి ఉంటుందని ప్రొఫెసర్ తిరుపతి  విశ్లేషించారు.

By
en-us Political News

  
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.