గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు.. అరెస్ట్ వారెంట్!?
Publish Date:Nov 21, 2024
Advertisement
భారత కుబేరుడు, వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై కేసు నమోదై, అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. అయితే ఆ కేసు, అరెస్టు వారెంట్ ఇండియాలో కాదు. అగ్రరాజ్యం అమెరికాలో. అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. 20 ఏళ్లలో ఏకంగా 2 బిలియన్ల డాలర్ల భారీ లాభం పొందే కాంట్రాక్టులను దక్కించుకునేందుకుగానూ భారత ప్రభుత్వ అధికారులకు రెండు వేల కోట్ల రూపాయలకు పైగా ముడుపులు ముట్టచెప్పడానికి అదానీ అంగీకరించారంటూ న్యూయార్క్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. లంచం, మోసపూరిత కుట్ర కింద అదానీపై కేసు నమోదైందని అమెరికా ప్రాసిక్యూటర్లు ధృవీకరించారు. గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు ,మేనల్లుడు సాగర్ అదానీ సహా ఏడుగురిపై కేసు నమోదైందని తెలిపారు. కాగా ఇప్పటికే వీరికి అరెస్టు వారంట్లు జారీ అయ్యాయని చెబుతున్నారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్‌లపై సెక్యూరిటీ ఫ్రాడ్ సహా మూడు అభియోగాలు నమోదయ్యాయి. అలాగే యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ సివిల్ కేసులో కూడా వీరిపై కేసు నమోదైంది. అదానీలు, అదానీ తమ అవినీతిని దాచిపెట్టి రుణ దాతలు, ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా 3 బిలియన్ డాలర్లకుపైగా రుణాలు, బాండ్లను సేకరించారని అమెరికా ప్రాసిక్యూటర్ల కథనం. అయితే అమెరికాలో తనపై కేసు నమోదు, అరెస్టు వారెంట్ జారీపై ఇప్పటి వరకూ అదానీ స్పందించలేదు. భారత్ లో అదానీ అత్యంత వేగంగా తన వ్యాపార సామ్రాజ్యన్ని విస్తరించడం వెనుక ప్రధాని మోడీ అండదండలున్నాయన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆయన వ్యాపార సామ్రాజ్యం అత్యంత వేగంగా విస్తరించడం వెనుక మతలబు ఉందంటూ అమెరికా పరిశోధనా సంస్థ హెడెన్ బర్గ్ గతంలోనే ఆరోపణలు చేసింది. అదానీ మనీలాండరింగ్, సెక్యూరిటీల ఫోర్జరీ వంటి నేరాలకు పాల్పడ్డారని గతంలోనేహిండెన్ బర్గ్ ఆరోపించింది. స్విస్ అధికారుల విచారణలో ఈ విషయం తేలడంలో ఆ దేశం అదానీ గ్రూప్‌కు చెందిన అనేక బ్యాంక్ అక్కౌంట్లను సీజ్ చేసిందని హిడెన్ బర్గ్ గతంలోనే పేర్కొంది. అయితే అప్పట్లో హిడెన్ బర్గ్ ఆరోపణలు అదానీ గ్రూప్ ఖండించింది. స్విస్ కోర్టు ప్రొసీడింగ్స్ తో ఎలాంటి సంబంధం లేదన్న అదానీ గ్రూప్, ఆ దేశంలోని తమ బ్యాంక్ అక్కౌంట్లేవీ సీజ్ కాలేదని వివరణ ఇచ్చింది. తమ గ్రూప్ మార్కెట్ విలువను పతనం చేయడానికీ, ప్రతిష్టను దెబ్బతీయడానికి హిండెన్ బర్గ్ ప్రయత్నిస్తున్నదని విమర్శించింది.
http://www.teluguone.com/news/content/case-on-gautham-adani-39-188719.html