జూబ్లీహిల్స్ హైప్రొఫైల్ రేప్ కేసులో పోలీసుల తీరు విడ్డూరంగా ఉంది. మొగుడు తిట్టినందుకు కాదు..తోడికోడలు నవ్వినందుకు అన్నట్లు అత్యాచారానికి పాల్పడిన నిందితులను కాపాడేందుకు, కేసును తప్పుదోవ పట్టించేందుకు శతధా ప్రయత్నించిన హైదరాబాద్ పోలీసులు ఆ అత్యాచారం విషయంలో పోలీసుల తీరును తప్పుపడుతూ వాస్తవాలను వెల్లడించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందరనావుపై మాత్రం ఆఘమేఘాలపై కేసు నమోదు చేశారు.
జూబ్లిహిల్స్ లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార సంఘటన కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విధితమే. నింధితులను అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలికపై అత్యాచార సంఘటనకు సంబంధించి కొన్ని ఫొటోలను, ఒక వీడియోను బయట పెట్టారు.
బెంజ్ కారులో జరిగిన దృశ్యాలను రఘునందన్ మీడియా ఎదుట బహిర్గతం చేశారు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు పోలసుల వైఫల్యంపై విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే వీడియోలను బహిర్గతం చేసినందుకుగాను అబిడ్స్ పోలీసులు ఐపీసీ 228(ఏ) సెక్షన్ కింద రఘునందన్ రావుపై కేసు నమోదు చేశారు. బాలిక వీడియోలను బహిర్గతం చేయటంలో కీలకంగా వ్యవహారించిన సుభాన్ అనే వ్యక్తికి ఇప్పటికే సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
సుప్రింకోర్టు ఆదేశాల మేరకు అఘాయిత్యానికి గురైన బాధితుల వివరాలు బయట పెడితే నేరం కనుకనే బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతుంటే.. తాను చూపించిన వీడియోలో ఎక్కడ బాధితురాలి ముఖం కనిపించలేదని ఎమ్మెల్యే చెబుతున్నారు. రఘునందనరావు మీడియాసమావేశం తరువాతనే పోలీసులు ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారన్న విషయం మాత్రం ఎవరూ కాదనలేరు.
ఇప్పటికీ ఈ కేసులో తెరవెనుక సూత్రధారులు, పాత్రధారులు ఎవరున్నారనే విషయాలపై పోలీసులు నోరు మెదపడం లేదు. ఆ దిశగా దర్యాప్తు సాగుతున్న దాఖలాలూ లేవు. ఎమ్మెల్యేపై ఆఘమేఘాలపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను విచారించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే మీడియా సమావేశంలో బాధితురాలి వివరాలు వెల్లడించి ఉంటే ఆయనపై కచ్చితంగా చర్యలు తీసుకోవలసిందే.. దానిని ఎవరూ కాదనరు. కానీ అంత కంటే ముందు అత్యాచారానికి పాల్పడిని నిందితులను అరెస్టు చేసి వారిపై చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/case-against-bjp-mla-for-revealing-rape-victim-details-25-137181.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.