సోలంకీపై గృహహింస కేసు.. మోదీ ఇలాఖాలో కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం..

Publish Date:Mar 30, 2022

Advertisement

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతోంది. ఈ సంవత్సరం (2022) చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. గత (2017)లో జరిగిన ఎన్నికలో బీజేపీ అతికష్టం మీద అత్తెసరు మెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంది. అయితే ఈ సారి కాంగ్రెస్ పార్టీ నుంచి మరింత గట్టి పోటీ ఎదుర్కుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. మరో వంక ఉత్తర ప్రదేశ్ సహ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో, అంతటా  ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలో సత్తా చాటు కునేందుకు  వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఎన్నికల వ్యూహహకర్త ప్రశాంత్ కిశోర్’తోనూ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు అందుతున్నాయి. 

అయితే, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి, కేంద్ర మాజీ మంత్రి, భరత్ సింగ్ సోలంకీ భార్య రేష్మా పటేల్ చేసిన వ్యాఖ్యలు, సోలంకీ వ్యక్తిగత ఇమేజినే కాకుండా, కాంగ్రెస్ పార్టీ ఇమేజిని కూడా దెబ్బతీసేలా ఉందని పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. సోలంకీ పార్టీని ఎన్నికలకు సిద్దం చేసేపనిలో నిమగ్నమైన సమయంలోనే, ఆయన భార్య రేష్మా ఆయనపై గృహ హింస కేసు పెట్టారు. అంతే కాకుండా, ఆయనకు మరో మహిళా నాయకురాలితో అక్రమ సంబంధం ఉందని, ఆ కారణంగా సోలంకీ తనను చిత్రహింసలు పెట్టడమే కాకుండా ఇంటి నుంచి గెంటివేశారని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఆనంద్ బోర్సాద్ కోర్టులో పిటిషన్’లో దాఖలు చేశారు. ఇప్పుడు గుజరాత్ రాజకీయాల్లో ఇదే  హాట్ టాపిక్ అయ్యింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు విచారణ చెయ్యడం మరింత కలకలం రేపింది.  
నిజానికి సోలంకీ భార్య గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యనకు వచ్చిన సమయంలోనే సోలంకీ వ్యవహారం మొత్తాన్ని బహిరంగ లేఖ ద్వారా ఆయన (రాహుల్ గాంధీ) దృష్టికి తీసుకెళ్ళారు. అయినా, రేష్మా పటేల్  లేఖను రాహుల్ గాంధీ పట్టించుకోలేదు. ఇప్పుడు, ఆమె ఏకంగా భర్త సోలంకీ పై గృహ హింస కేసు పెట్టడంతో కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది. 

భగత్ సింగ్ సోలంకీ ఆషామాషీ నాయకుడు కాదు, మూడు తరాలుగా అయన కుటుంబం కాంగ్రెస్ పార్టీలో కీలక భూమికను పోషించింది. కేంద్ర మాజీ మంత్రిగా భరత్ సింగ్ సోలంకీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా, కేంద్ర మంత్రిగా గతంలో గతంలో ఆయన  చక్రం తిప్పాడు. రెండుసార్లు గుజరాత్ పీసీసీ అద్యక్షుడిగా పని చేశారు. భరత్ సింగ్ సోలంకీ తండ్రి మాధవ్ సింగ్ సోలంకి గుజరాత్’కు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా, కేంద్ర విదేశాంగా మంత్రిగా పని చేశారు. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో భగత్ సింగ్ సోలంకీ పేరు కూడా ఉందని సమాచారం. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో భగత్ సింగ్ సోలంకీ ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయింది. ఇప్పుడు ఎలాగైనా గుజరాత్’లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని భగత్ సింగ్ సోలంకీ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో సోలంకీ భార్య బాంబు పేల్చారు. అయితే భగత్ సింగ్ సోలంకీ పై ఆయన భార్య చేసిన ఆరోపణలను ఆయన ఇంతవరకు స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మౌనంగానే ఉన్నారు. అయితే, ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో, చూడవలసి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. గృహ హిసం కేసు నమోదు అయితే మాత్రం అది సోలంకీ రాజకీయ జీవితంపై న్ని విధాలా ప్రభావం చూపుతుందని అంటున్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీస్తుందని, పరిశీలకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.