అవినీతి అహంకారంతోనే కారు గ్యారేజీకి!

Publish Date:Dec 3, 2023

Advertisement

తెలంగాణలో కాంగిరేసు కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటేసి మరీ విజయపథంలో దూసుకుపోతోంది.  దాదాపు 70 స్థానాలలో కాంగ్రెస్ అధీక్యంలో కొనసాగుతున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అధికారంలోకి రావడం ఖాయమైంది. టిఆర్ఎస్ 29 స్థానాల్లో, బీజేపీ ఆరు స్థానాలలో ఆధిక్యతను ప్రదర్శిస్తుండగా.. మరికొన్ని స్థానాలలో హోరాహోరీ పోరు జరుగుతోంది. ఐదారు స్థానాలలో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా  హోరాహరీ పోరు సాగుతోంది.  హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల పోరులో తొలి ఫలితంలోనే మొదట కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టడంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు మొదలవగా.. స్థానాలు పెరిగే కొద్దీ సంబరాల జోరు కూడా పెరుగుతోంది. కాంగ్రెస్‌ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటికి డీపీజీ అంజనీకుమార్‌ వెళ్లారు. రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

మొత్తంగా చూస్తే తెలంగాణ హస్తగతం  కావడం, బీఆర్ఎస్ ఈ స్థాయిలో ఓటమి పాలవ్వడానికి కారణాలేంటన్నది పరిశీలిస్తే..  తెలంగాణ గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని బీఆర్ఎస్ సంప్రాదాయక ఓటు బ్యాంక్ ను తమ వైపునకు తిప్పుకోవడంతో కాంగ్రెస్ సఫలీకృతమైంది. అలాగే కేంద్ర నాయకత్వాన్ని పిలిపించి ప్రకటించిన ఆరు గ్యారెంటీల హామీ బాగా పని చేసింది. ఫలితంగా బీఆర్ఎస్ ను ఢీకొట్టే దిశగా బలంగా అడుగులు వేయగలిగింది. అలాగే తెలంగాణలో  కీలకమైన మైనార్టీల ఓట్లు మైనార్టీ డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ తన వైపునకు తిప్పుకోగలిగింది.  బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనే చర్చ బలంగా ప్రజలలోకి తీసుకెళ్లడంతో.. మైనార్టీలు బీఆర్ఎస్ వైపు వెళ్లలేదన్నది స్పష్టమైపోయింది.

 బీఆర్ఎస్ ఓటమిలో అతిముఖ్యమైనదిగా వినిపిస్తుంది తొమ్మిదిన్నరేళ్ళలో ప్రభుత్వ అవినీతి.. బీఆర్ఎస్ నేతల అహంకారపూరిత వైఖరి. ఔను.. ఏ ఛానెల్ డిబేట్లలో చూసినా.. సోషల్ మీడియాలో చూసినా.. ఏ నేతను కదిలించినా ఇదే మాట ముందుగా వినిపిస్తున్నది.   స్థానికంగా గ్రామ గ్రామాన బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ లాగా ప్రవర్తించారనే ఆరోపణలున్నాయి. తమ చేతిలో ఉన్న అధికారాన్ని ప్రజలపై పెత్తనం చేయడానికి ఉపయోగించడంతో ప్రజలలో ఈ స్థాయి వ్యతిరేకత వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సాక్షాత్తు కేసీఆర్ నుండి ఆ కుటుంబానికి చెందిన కేటీఆర్, కవిత.. మంత్రుల నుండి ఎమ్మెల్యే వరకూ అందరినోటా అహంకార పూరిత వ్యాఖ్యలే వినిపించేవని.. ప్రభుత్వం ఇచ్చిన హామీలను, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా.. అవే అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం తెలంగాణ ప్రజానీకం జీర్ణించుకోలేకపోయిందని అంటున్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొనే తెలంగాణ ప్రజలు క్లియర్ కట్ గా గులాబీ పార్టీని దూరం పెట్టినట్లు పరిశీలకులు చెప్పుకొస్తున్నారు.

ఇక బీఆర్ఎస్ ఓటమిలో మరో కారణం అవినీతి. పార్టీ పెద్దల నుండి గ్రామ స్థాయి నేత వరకూ అందరిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. సీఎంగా కేసీఆర్ పలువురు పారిశ్రామిక వేత్తలకు, కాంట్రాక్టర్లకు దోచి పెట్టారని తొలి నుండి ఆరోపణలుండగా.. బీసీ బంధు, దళిత బంధులో కూడా ఎక్కడిక్కడ స్థానిక నేతలు చేతి వాటం ప్రదర్శించారనే ప్రచారం జరిగింది. సంక్షేమ పథకాలు అందాలంటే బీఆర్ఎస్ నేతలకు వాటాలు ఇవ్వాల్సిందే అనేలా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.  దీనికి తోడు పలు ఆక్రమణలు, కోట్లకు పడగలెత్తిన కేసీఆర్ కుటుంబ సన్నిహితులు, కేసీఆర్ కుటుంబం అంతా రాజకీయాలలో పదవులు దక్కించుకోవడం, బంధువులకు దోచిపెట్టినట్లు ఆరోపణలుండడం కూడా బీఆర్ఎస్ పార్టీ కొంప ముంచినట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.