Publish Date:Jun 18, 2026
అమెరికాలోని జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రముఖ టెక్ స్టార్టప్ క్యాపిటల్ ఫ్యాక్టరీ' సీఈవో జాషువా బేర్ దుర్మరణం పాలయ్యారు. టెక్సాస్ రాష్ట్రం లారెడో నగరంలోని లూప్ 20 జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. మెక్సికో నుంచి టెక్సాస్‌లోని ఆస్టిన్ నగరానికి ఆరుగురు ప్రయాణికులతో బయలుదేరిన ఈ ప్రైవేట్ విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. విమానంలో ఇంధనం కూడా పూర్తిగా అయిపోయి పరిస్థితి చేయి దాటిపోతుండటంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడానికి లారెడో అంతర్జాతీయ విమానాశ్రయం వైపు విమానాన్ని మళ్లించేందుకు సిబ్బంది శతధా ప్రయత్నించారు.
అయితే రన్‌వేకు కొద్ది దూరంలో విమానం పూర్తిగా పైలట్ నియంత్రణ కోల్పోయింది. రెప్పపాటు కాలంలో లూప్ 20 రహదారిపైకి దూసుకొచ్చిన ఆ విమానం, అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాలను, రహదారిపై వెడుతున్న ఒక రహదారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు విమానం రెండు ముక్కలుగా విరిగిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో క్యాపిటల్ ఫ్యాక్టరీ అధినేత జాషువా బేర్ తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, విమానంలో ఉన్న మిగిలిన ఐదుగురు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
విమానం మంటల్లో చిక్కుకుని ఎప్పుడైనా పేలిపోయే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ, అటుగా వెళ్తున్న వాహనదారులు ప్రాణాలకు తెగించి విమానంలో చిక్కుకున్న ప్రయాణికును కాపాడారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/capital-factory-ceo-joshua-baer-killed-in-plane-crash-36-223336.html
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.
కోస్టుగార్డు, నేవీ నౌకలతో గాలింపు చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..!
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్