సముద్రంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.!

Publish Date:Jul 4, 2026

Advertisement

 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఉద్ధృతితో ఉత్తరాంధ్ర తీరం అల్లకల్లోలంగా మారింది.  విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన ఏడుగురు   మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు.    ఈ నెల 1వ తేదీన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ ఏడుగురు మత్స్యకారులు ఒకే బోటుపై సముద్రంలోకి వేటకు వెళ్లారు.   బంగాళాఖాతంలో వాతావరణం వేగంగా మారిపోవడం, అల్పపీడన తీవ్రత పెరగడంతో సముద్రంలో అలల ఉద్ధృతి  పెరిగింది. వాతావరణం అనుకూలించకపోవడాన్ని గమనించిన తీరంలోని వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే శనివారం ఉదయం వారిని మొబైల్ ఫోన్ల ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించారు.

ఆ సమయంలో మత్స్యకారులు స్పందిస్తూ, వాతావరణం బాలేదని, అందువల్ల శనివారం మధ్యాహ్నానికల్లా ఎలాగైనా సురక్షితంగా తీరానికి చేరుకుంటామని కుటుంబ సభ్యులకు చెప్పారు.

కానీ వారు చెప్పిన సమయానికి తిరిగి రాలేదు. వారికి ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు.  కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని  విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే..   భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు. ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు, పక్కపక్క ప్రాంతాల వారు ఇద్దరు ఇలా  ఒకేసారి సముద్రంలో చిక్కుకుపోవడంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న మత్స్యశాఖ అధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం, వారి బోటును గుర్తించడం కోసం కోస్ట్‌గార్డ్, స్థానిక నావికా దళాల సహాయంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. 

Missing Fishermen, Visakhapatnam Fishing Harbour, Bay of Bengal Low Pressure, North Andhra Fishermen,

By
en-us Political News

  
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక గమనంతో సాగుతుంటాయి.
భారీ బ్యాంకు రుణాల మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది.
భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఆ బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు, గొడవలు సహజమే
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.