మొబైల్ లేకుండా వుండలేమా?
Publish Date:Jul 4, 2022

Advertisement
పూర్వం ఫోన్ వుంటే మహాగొప్ప. తెలిసినవారెవరికైనా ఫోన్ కాల్ వస్తే ఆ యింటికి పరిగెట్టాలి. కొన్నాళ్లకు దాదాపు ప్రతీ ఇంట్లో పోన్ వచ్చేసింది. కాలక్రమంలో మొబైల్ ఫోన్ వచ్చి అందరికీ ఆత్మీయం అయి కూర్చుంది. చేతిలో మొబైల్ వుంటే లోకమంతా అరచేతిలో వున్నట్టే అంటూ యాడ్స్ తో యువతను విప రీతంగా ఆకట్టుకోవడంలో మొబైల్ కంపెనీలు లాభార్జన బాటలో వున్నాయి. ఇపుడు రోజుకో కొత్త రకం ఐ ఫోన్‌లు చూస్తున్నాం. ఆటలు, పాటలు, సినిమాలు, సీరియళ్లు ఒకటేమిటి అంతా దానితోనే సాగిపోతోంది. ప్రస్తుతం 93 ఏళ్ల మార్టిన్ 1973లో మోటోరోలా డైనా టిఎసి 8000 ఎక్స్ అనే వైర్‌లెస్ సెల్యూలర్ డివైజ్‌ను కనుగొన్నారు. తర్వాత కాలక్రమంలో అదే మొబైల్ ఫోన్, ప్రస్తుతం ఐ ఫోన్ గా అనేక పేర్లతో, అనేక కంపె నీలో తయారుచేస్తున్నాయి. చూడ్డానికి చేతిలో ఇమిడిపోయేంత బుజ్జి ఫోన్. కానీ అందులో లోకంలో ఏది కావాల న్నా సినిమాలు, వెబ్‌సీరీస్‌లు, షోలో, ఆటపాటలు.. అన్నీ చూడగల్గుతున్నాం. ప్రస్తుతం చేతిలో మొబైల్ లేకుండా ఒక్క పనీ కావడం లేదన్నది ఎంతో నిజం. కానీ దానితో వుండే సౌకర్యం బాగానే వుండ వచ్చు గాని దాని వల్ల జీవితంలో కొంత ఆనందాన్ని కూడా కోల్పోతున్నామని మార్టిన్ కూపర్ అంటు న్నా రు. నిజానికి ఆయన కనుగొన్న సమయంలో ఇంతటి విపరీతాన్ని ఆయన వూహించి వుండక పోవచ్చు. టెన్త్ క్లాస్ విద్యార్ధి కూడా ఐఫోన్ వాడకం గమనిస్తున్నాం. అంత ఖరీదయిన ఫోన్‌తో విద్యార్ధులు కాలం వృధా చేస్తున్నారన్న ఆరోపణలు అందరి నుంచి వినవస్తున్నాయి. సాంకేతిక అభవృద్ధితో లాభనష్టాలు బేరీజు వేయడం మొబైల్ రాకతో మరీ ఎక్కువయింది. కాలంతో పాటు ముందడుగు వేయాలంటే ఇలాంటి పరికరాలను అందుకోవాల్సిందేనని యువత అభిప్రాయం. కానీ ఇంటి పనులు, ఆఫీసు పనులు, ఇతర త్రా ముఖ్యమయిన పనులన్నీ మొబైల్ రాకతో వెనకడిపోయాయనే విమర్శా వుంది. రోజులో అత్యధిక సమయం మొబైల్‌తోనే గడుస్తున్నది. ఈ రకమైన విపరీత వాడకం క్రమేపీ పిల్లల్లో ముఖ్యంగా విద్యార్ధుల్లో చదువు మీద ఆసక్తి తగ్గుతోందని, సహజ జ్ఞాపకశక్తి దెబ్బతింటోందని విద్యావేత్తల అభిప్రాయం. మొబైల్ వాడకం తగ్గించుకుంటే జీవితం సుఖంగా వుంటుందని అంటారు మొబైల్ సృష్టికర్త 93 ఏళ్ల మార్టిన్ కూపర్. ఆయన మాటను కాస్తంత పట్టించుకుందామా? నెలలో దాదాపు 140 గంటలు మొబైల్‌తోనే జనం గడిపేస్తున్నారని ఒక అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది. ఇక నుంచి మొబైల్ ఆచీ తూచీ వాడ టం అలవర్చుకుందాం. మొబైల్‌ను కేవలం ఒక పరికరంగానే చూడాలి, దాన్ని మూడో చేయిగా భావించి, దాని మీదే సమస్తం ఆధారపడి వుందనే భావనకు లోనయి జీవితంలో ప్రశాంతతను కొంత కోల్పోతున్నా మన్న మాటల్ని నిజం చేయవద్దు. మొబైల్‌ను స్విచ్ ఆఫ్ చేసి కొంత సమయం వీలయినంత సమయం గడపడానికి మళ్లీ ప్రయత్నించండి అని మార్టిన్ అంటున్నారు.
ఇహ ఇప్పుడు లోకమంతా ఐఫోన్ మయం. అది క్షణం లేకుండా బతకడమే కష్టతరమయింది. యువత దానికి దాసోహం అంటున్నారు. కానీ మొబైల్‌ను కనుగొన్న మార్టిన్ కూపర్ మాత్రం మొబైల్‌ను ఎంత తక్కువ వాడితే జీవితంలో అంత ఆనందం పొందవచ్చనే అంటున్నారు.
http://www.teluguone.com/news/content/cant-we-live-without-mobile-39-139035.html












