బీజేపీ సర్ప యాగాన్ని కేసీఆర్ అడ్డుకుంటారా?

Publish Date:Jul 14, 2022

Advertisement

రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి. అందుకే రాజకీయ శతృ మిత్ర సంబంధాలు, ఎప్పుడూ ఒకేలా ఉండవు, మారి పోతుంటాయి. బీజేపీ విషయాన్నే తీసుకుంటే, ఒకప్పడు కమల దళం సారథ్యంలో ఏర్పడిన ఎన్డీఎ కూటమిలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న,మిత్ర పక్షాలు చాలా వరకు ఇప్పుడు ఆ కూటమిలో లేవు. అవి ఇప్పడు బీజేపీ మిత్ర పక్షాలు కాదు. ఒకప్పుడు అటల్ బిహరీ వాజ్ పేయి 24 పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించారు. పోరాపచాలు వచ్చిన అయిదేళ్ళు సర్కార్’ను నడిపించారు. అలాగే, 2014లో బీజేపీ ఒంటరిగా మెజారిటీ సాధించినా, మోడీ ఫస్ట్ కాబినెట్’లో మిత్ర పక్షాలకు స్థానం కల్పించారు. సంకీర్ణ ధర్మాన్ని పాటించారు. నిజమే, ఇప్పటికీ, మోడీ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వమే, కానీ, కేంద్ర మంత్రివర్గంలో బీజేపీయేతర పార్టీలకు చెందిన మంత్రులు, ఇద్దరు ముగ్గరు కంటే లేరు. 

కేంద్ర మంత్రివర్గంలోనే కాదు, ఎన్డీఎలో మిగిలిన పార్టీలను కూడా వేళ్ల మీద లెక్క పెట్టవచ్చును.ఒకప్పుడు, బీజేపీకి అత్యంత విశ్వసనీయ మిత్ర పక్షంగా ఉన్న తెలుగుదేశం మొదలు భావసారుప్యత ఉన్న శివసేన, అకాలీ దళ్ సహా అనేక పార్టీలు మిత్ర బంధాన్ని తెంచుకుని బయటకు వెళ్లి పోయాయి, కాదు, చాలా వరకు పార్టీలకు మోడ్ షా జోడీ, పొమ్మన కుండ పొగబెట్టి బయటకు పంపారని అంటారు.2014ఎన్నికల తర్వాత రెండేళ్ళకో ఏమో, మొదలైన కమల దళం మిత్ర పక్షాలను సమిధలుగా చేసే సర్ప యాగం 2019 ఎన్నికల నాటికే చాలావరకు పూర్తయింది. 

ఇక 2019 ఎన్నికల్లో, బీజేపీ సొంత బలం మరింతగా పెరిగి 303 కు చేరిన నేపధ్యంలో, మోడీ షా జోడీ మిత్ర పక్షాలను మెల్ల మెల్లగ సాగనంపే వ్యూహానికి మరింతగా పదును పెట్టారు. 2019 ఎన్నికల్లో, శివసేన, రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీ లోక్ జన శక్తి, అకాలీ దళ్, అన్న డీఎంకే, జేడీ(యు)తో పాటుగా అప్నా దళ్, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ వంటి చిన్నాచితక పార్టీలు సహా మొత్తం తొమ్మిది పార్టీలు ఎండీఎ కూటమిలో ఉన్నాయి. ఎన్నికలో పోటీ చేసి, గెలిచాయి. అయితే ఆ తర్వాత రెండు సంవత్సరాలకే ప్రధాన మిత్ర పక్షాలు. శివసేన, అకాలీ దళ్, ఎల్జీపీ  ఇలా ఒకొక్క పార్టీ  బయటకు వెళ్లి పోయాయి. 

అలా వెళ్ళిపోయిన పార్టీలను అయినా, బీజేపీ వదిలేసిందా అంటే లేదు. ఎల్జీపీని రెండు ముక్కలు చేసింది. ఒక వర్గాన్ని చేరదీసి రెండవ వర్గాన్ని నిర్వీర్యం చేసింది. ఇప్పుడు ఎల్జీపీ అస్తిత్వం కోల్పోయింది. రేపో మాపో బీజ్పీలో విలీనం అయ్యేదుకు సిద్ధంగా ఉంది.మహారాష్ట్రలో శివసేన పరిస్థితి ఏమిటో చూస్తూనే ఉన్నాం.బీజేపీ ప్లాన్ సంపూర్ణం అయితే, శివసేన సైతం త్వరలోనే  చరిత్రగా మిగిలిపోతుంది. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే. మెల్టింగ్’ మొదలైంది. మరో రెండు మూడు నెలల్లో జరిగే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత శివసేన చరిత్ర ముగింపుకు చేరుతుందని, అందులో సందేహం లేదని అంటున్నారు. 

అలాగే, బీహార్ ముఖ్యమంత్రి, జేడీయు నేత నితీష్ కుమార్’ ను సొంత పార్టీలోనే వంత్రిని చేయడంలో బీజేపీ చాలా వరకు సక్సెస్ అయిందనే అంటున్నారు. పార్టీ సీనియర్ నాయకులను బీజేపీ తమ వైపు తిప్పుకుని, నితీష్ కుమార్’ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిన్న మొన్నటి వరకు కేంద్ర మంత్రి వర్ఫ్గంలో ఉన్న జేడీయు  ఆర్సీపీ సింగ్’ను బీజేపీలో చేర్చుకునేందుకు రంగం సిద్దమైన నేపధ్యంలో, నితీష్ కుమార్, ఆయనకు రెండవసారి రాజ్యసభ టికెట్ ఇవ్వలేదు. రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో సింగ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. నితీష్, సింగ్ మధ్య దూరం మరింత పెరిగింది. త్వరలో సింగ్’ బీహార్ షిండే కాబోతున్నారని తెలుస్తోంది. 

అయితే,  బీజేపీ టార్గెట్ మిత్రపక్షాలేనా అంటే కాదు ... అదివేరే కథ. కమల దళం అన్ని పార్టీలను సమదృష్టితోనే చూస్తోంది. అందుకే .. ఇప్పడు తెలంగాణలో కలకలం మొదలైంది. అందుకే రెండున్నర గంటల ప్రెస్ మీట్’లో ముఖ్యమంత్రి కేసేఆర్’ రెండు వందల సార్లు, షిండే పేరు తలచుకున్నారు. తమకు తాము ధైర్యం చెప్పుకున్నారు. కానీ, ప్రస్తుతం హ్యాండ్, మాంచి రైజింగ్’ లో ఉన్నా మోడీ, షా జోడీని కేసీఆర్ తట్టుకోగలరా? కమల దళం సర్పయాగాన్ని అపగలరా? అంటే, అది ఇప్పుడే చెప్పలేమని, పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు అయితేనే కానీ, క్లారిటీ రాదని అంటున్నారు.

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.