ఎకరాలకు ఎకరాల భూమి పోగేసిన కేసీఆర్ కుటుంబం.. అసెంబ్లీ వేదికగా బయటపెట్టిన రేవంత్.!

Publish Date:Sep 16, 2026

Advertisement

తెలంగాణ రాజకీయాలు మరో సారి హీటెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూముల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి కన్నెర్ర చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని  సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూముల బాగోతంపై  30 రోజుల్లోగా పూర్తిస్థాయిలో విచారణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కల్వకుంట్ల కుటుంబం భారీగా ఆస్తులను కూడబెట్టిందని, రాష్ట్రంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని వారి అధీనంలోకి తెచ్చుకున్నారని సీఎం తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కుటుంబానికి చెందిన స్థిరాస్తుల వివరాలను సర్వే నంబర్లతో సహా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా చదివి వినిపించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. నిబంధనల ప్రకారం కేసీఆర్ దంపతుల పేరు మీద కేవలం 27 ఎకరాలు మాత్రమే ఉండాల్సి ఉండగా..  ప్రస్తుతం వారి వద్ద  67 ఎకరాల భూమి ఉన్నట్లు రేవంత్ పేర్కొన్నారు. అంతేకాకుండా కేటీఆర్ కుటుంబానికి సంబంధించి నలుగురి పేర్ల మీద మొత్తంగా 123 ఎకరాల భూములు ఉన్నాయని లెక్కలతో సహా వివరించారు. కేటీఆర్ పేరు మీద 49.5 ఎకరాలు, ఆయన భార్య శైలిమ పేరు మీద 17.5 ఎకరాలు, అలేఖ్య పేరు మీద 9.38 ఎకరాలు, అలాగే హిమాన్ష్ పేరు మీద 46.3 ఎకరాల భూమి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఉద్యమాన్ని, ధరణి పోอร์టల్‌ను అడ్డం పెట్టుకుని వేల కోట్ల విలువైన ఆస్తులను దోచుకున్నారని ఆరోపించారు.

మొత్తంగా దాదాపు 340 ఎకరాల ప్రభుత్వ భూమి కేవలం కేసీఆర్ ఫామ్‌హౌస్ అధీనంలోనే ఉందనీ, ఈ ఫామ్‌హౌస్ భూముల అసలు నిజాలు తేల్చాలని జిల్లా కలెక్టర్‌ను  ఆదేశించారు. ఈ విచారణలో ఆ భూములు పూర్తిగా ప్రభుత్వానివేనని తేలితే, ఆ భూములన్నింటినీ స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు పంచుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రెవెన్యూ అధికారులు తక్షణమే కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసి విచారణ వేగవంతం చేయాలన్నారు. ఒకవేళ నిర్దేశిత 30 రోజుల్లోగా విచారణ పూర్తి చేయకపోతే బాధ్యులైన అధికారులపై  చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఈ తాజా పరిణామంతో తెలంగాణలో భూ ఆక్రమణల అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. 

కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే అధికారిక రికార్డుల ప్రకారం కల్వకుంట్ల కుటుంబ సభ్యుల పేరిట   440 ఎకరాల భూములు ఉన్నాయని సర్వే నంబర్ల వారీగా వివరించారు. తెలంగాణ రాష్ట్రం   వేలాది మంది అమరులు ప్రాణాలర్పించి, ఉద్యమకారులు సర్వస్వం కోల్పోతే.. కల్వకుంట్ల కుటుంబం మాత్రం పాలన ముసుగులో భూములను పోగేసుకుందని ఆరోపించారు. 

రేవంత్ అసెంబ్లీ వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్ లో కేసీఆర్ దంపతుల పేరిట 67 ఎకరాలు, కేటీఆర్ కుటుంబం పేరిట  123 ఎకరాల భూమి ఉంది.  ఇందులో కేటీఆర్ పేరిట 49 ఎకరాలు, ఆయన కుమారుడు హిమాన్షు పేరిట 46 ఎకరాలు, కుమార్తె అలేఖ్య పేరిట 9 ఎకరాలు, భార్య శైలిమ పేరిట మరో 17 ఎకరాలు ఉన్నాయి. ఇక మాజీ మంత్రి హరీశ్ రావు పేరిట 30 ఎకరాలు, ఎమ్మెల్సీ కవిత పేరిట 35 ఎకరాలు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు పేరిట 79 ఎకరాల భూములు అధికారిక రికార్డుల్లోనే స్పష్టంగా ఉన్నాయి.

సభ ముందు ఉంచిన ఈ 440 ఎకరాలు కేవలం అధికారిక పత్రాల్లో నమోదైన లెక్కలు మాత్రమేనన్న రేవంత్ రెడ్డి.. తెరవెనుక బినామీల పేర్ల మీద ఇంకా వేల ఎకరాల విలువైన భూములు దాగి ఉన్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ను, రెవెన్యూ యంత్రాంగాన్ని ఆయుధాలుగా మార్చుకుని అసైన్డ్, ప్రభుత్వ, పేదల భూములను చేజిక్కించుకున్నారని విమర్శించారు. దశాబ్ద కాలంలో ఈ భూములు ఏ విధంగా సమకూరాయి, మార్కెట్ విలువలను ఎలా ప్రభావితం చేశారు, ప్రభుత్వ భూములు ఏమైనా వీటిలో కలిసిపోయాయా అనే కోణాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపిస్తామని చెప్పారు.  ఒకవైపు పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఇళ్ల స్థలాలు దక్కక అల్లాడుతుంటే.. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండి ఒకే కుటుంబం వందలాది ఎకరాలను కబ్జా తరహాలో కూడబెట్టుకోవడం ప్రజాద్రోహమేనని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

[KCR Farmhouse, Cm Revanth reddy, Erravelli Earmhouse Lands, KCR Family Assets, Telugu One]

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.