బిల్కిస్ బానో రేపిస్టుల రెమిషన్ రద్దు చేయాలి!

Publish Date:Aug 22, 2022

Advertisement

బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో రేపిస్టుల విడుదల పట్ల వ్యతిరేకత రోజు రోజుకూ పెరుగుతోంది. బిల్కిస్ బనో సామూహిక అత్యాచారం కేసులో నేరస్థులను విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు ఆరు వేల మంది సుప్రీం కోర్టుకు లేఖ రాశారు. వారి రెమిషన్ ను రద్దు చేసి తక్షణమే జైలుకు పంపాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.  రేప్ కేసులో నిందితులను రెమిషన్ పేరు మీద విడుదల చేయడమంటే అత్యాచారం నేరానికి పాల్పడిన వారి పట్ల లిబరల్ గా వ్యవహరించాలన్న సంకేతాన్నిఇచ్చినట్లేనని వారు అంటున్నారు.  గుజరాత్ లో 2002 లో బిల్కిస్ బానో అనే మహిళపై సామూహిక అత్యాచారంచేసి, ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురిని అత్యంత పాశవికంగా ఖతం చేసిన  11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుద‌ల చేయడం పట్ల దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసి పడుతున్నాయి. ఆ 11 మంది దోషులను విడుదల చేస్తూ ఇచ్చిన  ఉత్తర్వులను తక్షణమే వెనక్కు తీసుకుని వారిని తిరిగి జైలుకు పంపాలని కోరుతూ   ఆరు వేలమంది పౌరులు, మహిళా కార్యకర్తలు, పౌర, మానవహక్కుల కార్యకర్తలు సుప్రీం కోర్టుకు లేఖ రాశారు.

 సామూహిక అత్యాచారం, సామూహిక హత్యలకు పాల్పడిన 11 మంది కరుడుగట్టిన దోషులను విడుదల చేయడం అత్యాచార బాధితులందరిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.  వ్యవస్థపై,న్యాయంపై నమ్మకం కలిగిఉన్న ప్రతి ఒక్కరిపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని వారా లేఖలో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు కు లేఖ రాసినవారిలో సామాజిక‌ కార్యకర్తలు సయ్యద్ హమీద్, జఫరుల్-ఇస్లాం ఖాన్, రూప్ రేఖ, దేవకీ జైన్, ఉమా చక్రవర్తి, సుభాషిణి అలీ, కవితా కృష్ణన్, మైమూనా మొల్లా, హసీనాఖాన్, రచన ముద్రబోయిన, షబ్నం హష్మీ తదితరులున్నారు.

సహేలీ ఉమెన్స్ రిసోర్స్ సెంటర్, గమన మహిళా సమూహ, బేబాక్ కలెక్టివ్, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్, ఉత్తరాఖండ్ మహిళా మంచ్, ఫోరమ్ అగైనెస్ట్ అప్రెషన్ ఆఫ్ ఉమెన్, ప్రగతిశీల మహిళా మంచ్, పర్చమ్ కలెక్టివ్, జాగృతి ఆదివాసీ దళిత్ సంగట‌న్, అమూమత్ సొసైటీ, డబ్ల్యూఓమ్ తదితర హక్కుల సంఘాలు కూడా ఈ లేఖపై సంతకాలు చేశాయి. మహిళలకు న్యాయం పట్ల విశ్వాసం పెంపొందించాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. తక్షణమే రేపిస్టుల రెమిషన్ రద్దు చేయాలని కోరారు. బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో జీవిత ఖైదు పడిన  పదకొండు మంది నేరస్తులు ఆగస్టు 15న గోద్రా సబ్ జైలు నుండి బయటికి వచ్చారు. గుజరాత్ ప్రభుత్వం తన రెమిషన్ విధానం ప్రకారం వారిని విడుదల చేయడానికి అనుమతించింది. కాగా వాళ్ళ విడుదలకు  సిఫారసు చేసిన 10 మంది సభ్యుల కమిటీలో ఐదుగురు బీజేపీ నేతలే కావడం గమనార్హం.

ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు  జనవరి 21, 2008న బిల్కిస్ బానో పై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురి  హత్య   ఆరోపణలపై 11 మందికి జీవిత ఖైదు విధించింది. ఆ తర్వాత బాంబే హైకోర్టు వారి శిక్షను సమర్థించింది. అప్పటికి బిల్కిస్ బానో ఐదు నెలల గర్భిణి, గోద్రా రైలు దహనం తర్వాత గుజరాత్ లో చెలరేగిన హింసాకాండ నుంచి తప్పించుకుని పారిపోతూ సామూహిక అత్యాచారానికి గురైంది. చనిపోయిన వారిలో ఆమె 3 ఏళ్ల కూతురు కూడా ఉంది.

By
en-us Political News

  
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.