శరీరం బరువు గురించి యోగా ఏమి చెబుతోంది?

Publish Date:Jan 13, 2023

Advertisement

శరీరం బరువు నిరంతరం అడుక్కి త్రొక్కేస్తూ వుంటుంది. అంత శరీర భారాన్ని  చిన్న పాదాలు రెండు మొయ్యవలసివస్తోంది. కనుక నిట్టనిటారుగా  నిలబడితే సరిగా నిలబడలేక తూలిపోయే పరిస్థితి వస్తుంది. మరి ఎలా నిలబడాలి??  కాలి పిక్కల్లోని కండరాలు,  తొడల మీద కండరాలు మనిషి పై భాగపు బరువును మోయాలి. అలా కాకుండా కేవలం పాదాల మీద బరువు మోస్తే..  పిరుదులో, మోకాళ్ళో, కాలికండలో సడలిపోయి తుళ్లి పడిపోతాము.

మనిషి శరీరంలో బరువు మొయ్యలేక పాదాలు   వీగిపోతున్నప్పుడు శరీరంలో ఉన్న పిక్కలు, నడుము భాగంలో  కండరాలు  బిగిసిపోయి, ఎలాగో మిమ్మల్ని నిలబెట్టాలని ప్రయత్నిస్తాయి  అప్పుడే మనిషి శరీరం ఊగిపోతుంది. అలా కాకుండా శరీరాన్ని ముందుగానే నడుము, పిక్కలు కండరాల సహాయంతో బ్యాలెన్స్ చేయడం అలవాటైతే ఇలాంటి సమస్యే ఉండదు.

మనం సాధారణంగా వెల్లకిలా నేలమీద పడుకున్నాము అనుకోండి!  అప్పుడు  బరువంతా  వీపు మీదనే మోపుకుంటారు కానీ పిక్కల మీద కాదు కదా.. కాబట్టి ఆ స్థితిలో  కండరాలు సాగవలసిన అవసరం లేదు. అందుకే  పిక్కలకు బయటవున్న కండరాలైనా,  తొడలకు ముందున్న కండరాలైనా, పొట్టకండరాలైనా, వీపు కండరాలైనా వాటిని గురుత్వ వ్యతిరేక కండరాలని అంటున్నారు.  మనిషి శరీరం మొత్తంలో ఉన్న కండరాలన్నిటిలోనూ బిగువును ఎక్కువగా కలిగి ఉన్న కండరాలివే.

ఈ కండరాలు సహజంగా ఎక్కువగా శరీరంలో పనిచేస్తూ ఉంటాయి. ఈ కండరాలు గంట గంటకి గురుత్వాన్ని ఎదుర్కోవటం అందరికీ కష్టంగానే ఉంటుంది. నిలబడ్డప్పుడు అయితే ఇక చెప్పనవసరం లేదు..  మనిషిలో ఛాతీలోని కండరాలు, మెడకి ఇటూ అటూ ఉన్న కండరాలూ ఎక్కువ వాడుతూ ఉంటాం. అందుకని అవి  బాగా మెత్తబడి పోతూంటాయి. గురుత్వ వ్యతిరేక కండరాలు పుష్టిగా ఉంటేటట్లు అందరూ జాగ్రత్త పడాలి. అప్పుడే అవి గుండెకు బాగా తోడ్పడగలుగుతాయి. నిలబడ్డప్పుడు గురుత్వం కాళ్ళల్లోకి, పాదాలలోకి ప్రసరిస్తుంది. అప్పుడే  గుండె నుంచి రక్తం ఎక్కువగా తోడుతుంది. ఆ రక్తం పాదాలు, కాళ్ళ నుంచి వెనుదిరిగి గుండె, ఊపిరితిత్తులు చేరేటప్పుడు గురుత్వమే నిరోధిస్తుంది.

 అప్పుడు  గురుత్వ వ్యతిరేక కండరాలు బిగుసుకొని గురుత్వం వల్ల  గుండెల్లోంచి రక్తాన్ని పూర్తిగా  కాళ్ళల్లోకి దిగిపోకుండా నిరోధించి, అక్కడున్న రక్తం  ఊపిరితిత్తుల్లోకి, గుండెల్లోకి ప్రవహించేలా చూస్తాయి.  కదలకుండా చాలాసేపు నిలబడి నట్లయితే  కాళ్ళల్లో కండరాలు సూక్ష్మరక్తనాళాలను పిండివేసి, కొయ్యబారిపోతాయి. రక్తాన్ని తిరిగి ఊపిరితిత్తుల్లోకి, గుండెల్లోకి చేరకుండా నిరోధించాయన్నమాట! అప్పుడు  గుండె ఓవర్ గా పని చేయవలసి  వస్తుంది. అదే సమయంలో కాళ్ళు పీక్కు పోతాయి. నానా బాధా పడిపోతారు.

అందుకే అడుగు మీద అడుగు వేసుకొంటూ ఎంతదూరం నడిచినా కలగని బాధ కొద్దిసేపు నిశ్చలంగా నిలబడటం వల్ల కలుగుతుందన్న మాట!

అలాంటప్పుడు ప్రతిరోజూ ఎన్నిగంటలు నిశ్చలంగా మనం నిలబడుతున్నామో ఆలోచించుకోవాలి. వృధాగా అలా నిలబడటం వల్ల దేనిని కోల్పోతున్నామో గ్రహించాలి. పర్యవసానంగా  శరీర సౌష్టవం, దానితో బాటు  శరీరం దాని కంఫర్ట్  తొలగిపోతున్నాయి! మనిషిలో  చెలరేగే నీరసం, నిస్త్రాణాలు  ఈసురోమని అనిపించేటట్లు చేస్తాయి. ఇలాంటి అనుభూతి కలిగినంత సేపు మనిషి తనను తాను ఎప్పుడూ ఉత్తేజవంతుడిగా ఉంచుకోలేడు. ఈ విషయం తెలుసుకున్నవాడు ఉత్తముడు అనుకోవచ్చు.

                                   ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
చాలామంది రాత్రి వేళల్లో హాయిగా నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కాళ్ల పిక్కలు పట్టేయడం (Leg Cramps at Night) వల్ల తీవ్రమైన నొప్పితో మేల్కొంటూ ఉంటారు. కండరాలు గట్టిగా బిగుసుకుపోయి, కాళ్లు కదల్చలేనంతగా వచ్చే ఈ నొప్పిని ఆయుర్వేదంలో..
వేడి, విరేచనాలు లేదా వాంతులు వంటివి శరీరంలోని నీరు , ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను త్వరగా దెబ్బతీస్తాయి. ఇలాంటి పరిస్థితులలో ఓఆర్ఎస్ తాగడం చాలా ముఖ్యం. చాలా నీరసంగా ఉన్నప్పుడు, ఆహారం సరిగా తీసుకోలేనప్పుడు...
ప్రతి మనిషి ఇతర మనిషికి చాలా  విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటారు. కొందరు చాలా శాంతంగా ఉంటారు, మరికొందరు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ చాలా చలాకీగా ఉంటారు. ఇంకొందరు చాలా చిన్న విషయాలకే తొందరగా కోపం
భారతీయులకు టీ, కాఫీ ఒక పెద్ద ఎమోషన్. గతంలో కంటే ప్రస్తుతకాలంలో  టీ తాగేవారి సంఖ్య చాలా పెరిగింది.  ఏదైనా పని చురుగ్గా చేయాలంటే చాలామంది మొదటగా టీ తాగుతారు.  ఇక పని మధ్యలో కూడా టీ తాగుతూ ఉత్సాహం తెచ్చుకుంటారు...
బలమైన రోగనిరోధక వ్యవస్థ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. అయితే రోజురోజుకూ జీవనశైలి పేలవంగా మారడం..
ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగగానే కాలి మడమలో సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది కొందరికి.  ఇలా లేవగానే ఆ నొప్పితో కొన్ని అడుగులు వేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ఈ నొప్పిని సీరియస్ గా తీసుకోరు.  కొద్దిసేపు అలా నడవగానే అదే తగ్గిపోతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు....
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం..
నోటి ఆరోగ్యం అనేది మన సంపూర్ణ ఆరోగ్యానికి ముఖద్వారం లాంటిది. చాలా మంది పళ్ళను తెల్లగా, శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందని అనుకుంటారు, కానీ పళ్ళ కంటే వాటిని పట్టి ఉంచే చిగుళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధులు..
ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘ఐబీఎస్’ (Irritable Bowel Syndrome - IBS) ఒకటి. దీనినే తెలుగులో ‘పేగుల్లో గడబిడ’ లేదా జీర్ణకోశ సమస్య అని అంటారు. కొంతమందికి ఆహారం తీసుకోగానే మోషన్స్‌కు వెళ్లాల్సి.....
వేసవిలో ఎండలో తిరిగి అలసటతో  ఇంటికి తిరిగి రాగానే చాలా మందికి ఫ్రిజ్‌లోంచి చల్లటి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. తీవ్రమైన ఎండ, చెమటల తర్వాత చల్లటి నీరు తాగితే చాలా రిలాక్స్ గా ఉపశమనంగా అనిపిస్తుంది....
మారుతున్న కాలం, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘సైనస్’ (Sinusitis) ఒకటి. సాధారణ జలుబులా ప్రారంభమై...
వేసవి కాలంలో దాదాపు ప్రతి ఇంట్లో కూలర్‌ను ఉపయోగిస్తారు, ఏసీ పెట్టించుకోలేని మధ్యతరగతి,  దిగువ తరగతి వారికి కూలర్ వాడకం ఎంతో ఉపయోగకరంగా..
నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు – ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ (టిఫిన్) మానేయడం. ఆఫీసులకో, కాలేజీలకో వెళ్లే తొందరలోనో.. లేదా బరువు తగ్గిపోతామనే అపోహతోనో చాలా మంది ఉదయపు ఆహారాన్ని పూర్తిగా స్కిప్ చేస్తుంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.