జారుడు బండపై కాంగ్రెస్.. రేవంత్ గట్టెక్కించగలరా?

Publish Date:Nov 21, 2022

Advertisement

తెలంగాణలో కాంగ్రెస్ పతనం నుంచి పతనానికి దిగజారుతోందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకోవాలి కానీ.. అదే రాష్ట్ర ఆవిర్బావం నుంచీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగం భోట్లు అన్నట్లుగా తయారంది. 
తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయని పైకి కనిపిస్తున్నా, ఇప్పటికిప్పుడు తెరాసకు వచ్చిన ఇబ్బందేమీ లేని పరిస్ధితే ఉంది. రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవాలని   ప్రయత్నాలు చేస్తున్నా అధికారం దక్కించుకునే స్థాయికి ఇప్పట్లో వచ్చే పరిస్థితి అయితే లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఆ పార్టీకి సరైన అభ్యర్థి దొరకడమే గగనమన్న పరిస్థితే ఇప్పటికీ ఉంది. పట్టణ ప్రాంతాల్లో బాగానే పుంజుకున్నా.. అధి వచ్చే ఎన్నికలలో అధికారాంలోకి తీసుకువస్తుందా అన్న ప్రశ్నకు లేదనే జవాబే వస్తుందని కమలం వర్గాలే అంతర్గత చర్చల్లో చెప్పుకుంటున్నాయి. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో విజయం సాధించినా, మునుగోడు ఉప ఎన్నికలో తెరాసకు దీటుగా పోటీ ఇచ్చినా అది బీజేపీ బలం అని ఆ పార్టీ నాయకత్వమే ధీమాగా చెప్పలేని పరిస్థితి. అయితే రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అంటే బీజేపీయే అనే పరిస్థితి అయతే వచ్చింది. అందుకు కాంగ్రెస్ బలహీనతలు, వైఫల్యాలే కారణం. క్షేత్ర స్థాయిలో కార్యకర్తల బలం, బలగం ఉండి కూడా ఎన్నికలలో చతికిల బడుతున్న కాంగ్రెస్ రాష్ట్రంలో సమీప భవిష్యత్ లో పుంజుకుంటుందా అంటే కష్టమేనని పరిశీలకులు విశ్లేషిస్తు్నారు. అన్నిటికీ మించి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ నాయకత్వ లోపం కాంగ్రెస్ ను ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ కుదేలును చేసేస్తోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్  పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ కార్యకర్తలలో జోష్ పెరిగిందనడంలో సందేహం లేదు.

అయితే దానిని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుని.. ప్రజలకు చేరవ కావడానికి మార్గదర్శనం చేయాల్సిన నాయకత్వం విఫలమౌతోంది. నిజానికి రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు తెలంగాణలో పుంజుకోవడానికి ఉన్న అవకాశాలను వినియోగించుకుని బలోపేతం కావడంలో ఆ పార్టీ వైఫల్యానికి ప్రధాన కారణం ఆ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే.  కాంగ్రెస్ గురించి తరచూ పెద్దలు చెప్పే మాట ఒకటి ఉంది. ఆ పార్టీని ఎవరూ ఓడించలేరు.. కానీ ఆ పార్టీయే తనను తాను ఓడించుకుంటుంది అని. రాష్ట్రంలో సరిగ్గా అదే జరుగుతోంది.  

 ఆ గొడవలే తెలంగాణలో ప్రజలకు పార్టీని దూరం చేస్తుంది. రేవంత్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పార్టీ క్యాడర్ లో కాస్త జోష్ కనిపించినా, సీనియర్ నేతలు తమ వైఖరితో ఆ జోష్ ను బలవంతంగా అణిచేస్తున్నారు.  దానికి ఉదాహరణే తాజాగా జరిగిన మునుగోడు ఉపఎన్నికలలో ఘోర ఓటమి. ఇప్పటికే పలుమార్లు యాత్రలు, పోరులు తలపెట్టిన అధ్యక్షుడు రేవంత్ కొంతవరకు ప్రజలలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా.. ఆ పార్టీ నేతలు సహాయ నిరాకరణతో ఫలితం ఉండటం లేదు.  ప్రజా సమస్యలపై పోరాటాల ద్వారా ప్రజలలోకి వెళ్లాలని రేవంత్ చేస్తున్న ప్రతి ప్రయత్నాన్నీ విఫలం చేయడానికే అన్నట్లుగా సీనియర్లు వ్యవహరిస్తున్నారు. వీహెచ్, జగ్గారెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే.. కాంగ్రెస్ లోని ప్రతి సీనియర్ పేరూ చెప్పాల్సి ఉంటుంది. సీనియర్లు సహకరించకున్నా  రేవంత్ ఇప్పుడు మరో పోరుకు రెడీ అయ్యారు. ఈసారి రైతు సమస్యలపై   ఫోకస్ పెట్టారు. ధరణి పోర్టల్, ధాన్యం కొనుగోలు, పోడు భూముల సమస్యలపైన కార్యాచరణ సిద్ధం చేస్తూ పార్టీ నేతలను కలుపుకుపోవాలని సంకల్పించారు. 

ముందుగా ఇందిరాపార్కు వద్ద రెండు రోజులపాటు నిరసన దీక్ష చేపట్టి, రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాలలో ప్రజల సమస్యలపైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి తర్వాత గవర్నర్ కు వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించారు. కార్యాచరణ ఓకే కానీ.. ఇది ఎంతవరకు సక్సస్ అవుతుంది? సీనియర్లు ఏ మేరకు సహకరిస్తారు అన్న సందేహాలు పార్టీ క్యాడర్ లోనే వ్యక్తమౌతున్నాయంటే పరిస్థితి ఏమిటో వేరే చెప్పకోనవరం లేదు. రైతు సమస్యలపై కార్యాచరణపై చర్చించేందుకు గాంధీ భవన్ లో సమావేశం కోసం  రేవంత్ పార్టీలో సీనియర్ నేతలకు ఆహ్వానాలు పంపిస్తేనే.. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు  మాత్రమే హాజరయ్యారు. జగ్గారెడ్డి డుమ్మా కొట్టారు. ఈ సమన్వయ లోపమే కాంగ్రెస్ పార్టీకి పుంజుకోవడానికి అవరోధంగా మారింది. దీనిని అధిగమించి వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని ఏకతాటిపైకి రేవంత్ తీసుకురాగలరా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. విభేదాలు పక్కన పెట్టి అందరూ కలిసి నడిస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ కు భవిష్యత్ ఇప్పటికిప్పుడైతే కాంగ్రెస్ జారుడు బండపై ఉంది. రేవంత్ గట్టెక్కించగలరా అన్నది చూడాలి.

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.