నీట్ వివాదంపై మోదీ స్పందన.. జన్ జెడ్ ఆగ్రహాన్నిని చల్లార్చగలదా?

Publish Date:Jul 23, 2026

Advertisement

 ఢిల్లీ వేదికగా నీట్  లీకేజీ వ్యవహారానికి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతాపార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనకు దేశ వ్యాప్తంగా యువత నుంచి విశేష స్పందన లభిస్తున్నది.     లీకేజీకి బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని యువత డిమాండ్ చేస్తున్నారు.  ఈ నిరసనలకు రోజు రోజుకూ మద్దతు పెరుగుతుండటంతో.. ఇంత కాలంగా మౌనంగా ఉన్న ప్రధాని మోడీ అనివార్యంగా స్పందించాల్సి వచ్చింది. 

నీట్ పరీక్షల వివాదం చెలరేగిన తరువాత ఈ అంశంపై తొలి సారిగా ప్రధాని మోడీ   సోషల్ మీడియా వేదికగా..  మన దేశ యువత సంక్షేమం, వారి సమగ్ర భవిష్యత్తు కంటే ప్రభుత్వానికి మరేదీ ముఖ్యం కాదు పేర్కొన్నారు. పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం  కఠినంగా వ్యవహరిస్తుందనీ,  విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వారిపై తక్షణమే   చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే సంబంధిత  అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.  

 పేపర్ లీకేజీలకు పాల్పడే నేరస్థులకు తీవ్రమైన శిక్షలు పడేలా చేయడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను  ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిదన్న మోడీ,  విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటానికి, వ్యవస్థపై మళ్లీ నమ్మకాన్ని పునరుద్ధరించడానికి వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలలో ఇది కీలకమైన ముందడుగని తన సోషల్ మీడియా ప్రకటనలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏ   విద్యార్థికీ అన్యాయం జరగకుండా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తామని భరోసా ఇచ్చారు. అదే సమయంలో  ఆందోళనకారులకు, వారికి సంఘీభావంగా నిలుస్తున్న రాజకీయ పార్టీలకూ   పరోక్ష హెచ్చరిక చేశారు.  మన యువత ప్రకాశవంతమైన భవిష్యత్తుకు హాని తలపెట్టడానికి, ఆటంకం కలిగించడానికి ప్రయత్నించే వారిని ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టదనీ, నిరసనల వెనుక ఏవైనా రాజకీయ ప్రయోజనాలు లేదా ఉద్దేశపూర్వక కుట్రలు ఉంటే వాటిని సహించేది లేదని మోడీ పేర్కొన్నారు.  

అయితే మోడీ స్పందన ఆందోళనకారుల, ముఖ్యంగా యువత ఆగ్రహాగ్నిని చల్లారుస్తుందా అంటే అనుమానమే అన్న సమాధానమే వస్తున్నది. యువత ప్రధానంగా లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తున్నది. అయితే మోడీ తన స్పందనలో ఆ డిమాండ్ ను అసలు పట్టించుకున్నట్లే కనిపించలేదు.  

NEET Row, PM Narendra Modi Reaction, NEET Paper Leak, Dharmendra Pradhan Resignation Demand

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
హైదరాబాదు నగర పరిసరాల్లో ఆర్మీకి చెందిన భూములపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రక్షణ శాఖ అధికారులు హైడ్రా కమిషనర్‌ను ఆశ్రయించారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ప్రక్షాళన, విముక్తి, భద్రత అనే మూడు అంశాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ జనరేషన్‌కి ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడమే నేరాలకు కారణమా..!
టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు దిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..
ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో తీవ్ర చలననాన్ని రేపింది.
వరంగల్‌లో మీడియా రిపోర్టర్లతో నిర్వహించిన చిట్‌చాట్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
తన అనుచరులు, స్థానికులతో కలసి ప్రత్యేక వేదికపై కూర్చుని ఈ మౌన నిరసన చేపట్టారు. ఏలాంటి ఉపన్యాసాలు, నినాదాలు లేకుండా కేవలం మౌనంతోనే ఆయన నిరసన వ్యక్తం చేశారు. దేశ రాజథానిలో వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేతులు మారిన ప్రతీసారీ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల అంశం మళ్లీ రాజకీయ తెరపైకి వస్తుంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన ప్రాపర్టీని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం వేయడాన్ని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బండ్ల గణేష్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి విదితమే. అయితే బండ్ల గణేష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్ధించింది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఢిల్లీ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో తాజాగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.