మాచా టీ.. బరువు తగ్గడంలో మ్యాజిక్ చేస్తందా?

Publish Date:Jul 10, 2026

Advertisement

టీ లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో బ్లాక్ టీ మాత్రమే కాకుండా..  గ్రీన్ టీ తో పాటు కుంకుమ పువ్వు  టీ,  కార్శీరీ ఖవ్వా టీ,  జాస్మిన్ టీ.. ఇలా చాలా రకాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు బరువు తగ్గడంలో సహాయపడతాయని చెబుతారు.  ఇవన్నీ మొన్నటి వరకు ట్రెండ్ అయినవే. అయితే ఇప్పుడు మరొక కొత్త టీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.  పైగా బరువు తగ్గడం కోసం సెలబ్రిటీలు గ్రీన్ టీకి స్వస్తి చెప్పి ఈ కొత్త రకం టీ ను ఉపయోగిస్తున్నారని చెబుతారు. అసలు ఈ మాచా టీ ఏమిటి? దీన్నితాగడం వల్ల బరువు ఎలా తగ్గుతారు? దీని గురించి వివరంగా తెలుసుకుంటే..

మచా టీ..

సాధారణ గ్రీన్ టీని కేవలం ఆకులను  మరిగించిన నీటిలో వేడయం  ద్వారా తయారుచేస్తారు, అయితే మాచా అనేది మొత్తం ఆకులను పొడిగా తయారు చేసి దాన్ని  నీటిలో కలిపి తయారు చేసే టీ... ఈ కారణంగానే గ్రీన్ టీ కంటే మాచా ఎక్కువ ప్రయోజనకరమైనదిగా ఉంటందని చెబుతారు.

సెలబ్రిటీలకు ఫేవరేట్ ఎందుకంటే..

మాచా గురించి అందరికీ తెలియడానికి కారణం.. ఈ టీను సెలబ్రిటీల నుండి సోషల్ మీడియాలో ఎంతో మంది దీన్ని తమ ఆరోగ్యం కోసం తాగుతున్నారు.  ఎందుకంటే మాచాలో కేటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా EGCG ఉంటాయి, ఇవి శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. మాచా  శరీరం కేలరీలను బర్న్ చేసే  సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని అనేక నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా, మాచాలో కెఫీన్ , ఎల్-థియానైన్ ఉంటాయి, ఇవి మనసును ప్రశాంతపరిచి శక్తిని అందిస్తాయి. అందుకే ఇప్పుడు చాలా మంది ఉదయం పూట టీ , కాఫీకి బదులుగా మాచా తాగడానికి ఇష్టపడుతున్నారు.

మాచా బరువు తగ్గడానికి సహాయపడుతుందా?

 బరువు తగ్గడానికి మాచా నిజంగా సహాయపడుతుందా అని  చాలామంది సందేహపడుతూ ఉంటారు.  అయితే మాచా అనేది అకస్మాత్తుగా బరువును తగ్గించే  మ్యాజిక్ డ్రింక్ ఏమీ కాదని ఆహార నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మాచా తాగినా లేదా బరువు తగ్గించే మరే ఇతర పానీయం తాగినా, అవి బరువు తగ్గడంలో మాత్రమే సహాయపడగలవు. కేవలం వాటిని తాగడం ద్వారా బరువు తగ్గేంత బలమైన ప్రభావం వాటికుండదు. అంటే.. ఆహారంపై శ్రద్ధ పెట్టకుండా , వ్యాయామం చేయకుండా కేవలం ఈ పానీయాలపై మాత్రమే ఆధారపడటం వల్ల బరువుపై ఎటువంటి ప్రభావం ఉండదని అంటున్నారు.

                                                *రూపశ్రీ.

By
en-us Political News

  
మెనోపాజ్ (Menopause) వచ్చిన తర్వాత మళ్లీ బ్లీడింగ్ రావడం సాధారణ విషయం కాదు. చాలా మంది మహిళలు దీనిని చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు...
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అన్ని విటమిన్లు , ఖనిజాలు సరైన మోతాదులో అవసరం. శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్లలో  విటమిన్ బి12 ఒకటి, ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటులో, సరైన నాడీ పనితీరులో..
థైరాయిడ్ సమస్యలు ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్యల్లో ఒకటి. అయితే, థైరాయిడ్ రావడానికి మన ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణమా..
భారతీయుల భోజనంలో అన్నం చాలా ప్రధానమైనది. అన్నం తినడం వల్ల వచ్చే సాటిసిఫాక్షన్ వేరే ఏ విధంగా రాదని చాలామంది అంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మూడు పూటలా అన్నం తినాలన్నా చక్కగా తినేస్తారు. కానీ ప్రస్తుతం డయాబెటిస్, అధిక బరువు వంటి సమస్యలతో అన్నం అంటే దూరం జరిగే వారు చాలామంది ఉన్నారు. ..
బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు, TIA హెచ్చరికలు, గోల్డెన్ పీరియడ్‌లో చికిత్స, నివారణ మార్గాలను ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. అనిరుధ్ దేశ్‌ముఖ్ ఈ వీడియోలో వివరించారు...
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కాల్షియం,  ప్రోటీన్ కూడా ఉంటుంది.  భారతీయులు భోజనం చివర పెరుగుతో తింటే తప్ప వారికి తృప్తి ఉండదు. వేసవి కాలంలో పెరుగును ఇష్టంగా తింటారు.
శరీరంలో వేడి, పాదాల్లో మంట, కళ్లలో మంట, నోటి పూత, గ్యాస్, అసిడిటీ ఎందుకు వస్తాయి? పిత్త దోషం లక్షణాలు, కారణాలు, ఆహారం, ఆయుర్వేద చిట్కాలను డా. చి. మధుసూదన్ శర్మ ఈ వీడియోలో వివరించారు.
పురుషుల ఆరోగ్యం విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేసే సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రారంభ దశలోనే గుర్తిస్తే చాలా రకాల క్యాన్సర్లను విజయవంతంగా చికిత్స చేయవచ్చు...
భారతదేశంలో టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అలవాటుగా , రోజును మొదలుపెట్టడానికి మంచి ఎనర్జీ డ్రింక్ గా కూడా భావిస్తారు. ఉదయం లేవగానే టీ తాగడం, పనిలో బ్రేక్  సమయంలో టీ తాగడం..
మనం తినే ఆహారాన్ని ఎంత ఎక్కువగా ఉడికిస్తే అంత మంచిదని చాలామంది భావిస్తుంటారు. కానీ అధికంగా ఉడికించడం వల్ల కొన్ని పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్,
పెళ్లయ్యాక ప్రతి భార్యాభర్త పిల్లలను కనడంపై శ్రద్ద పెడతారు. పిల్లలను కనడం,  అమ్మ నాన్న అనిపించుకోవడం జీవితంలో ఒక మధురమైన అనుభూతిగా భావిస్తారు. అయితే నేటికాలంలో ఆడవారు మాత్రమే కాకుండా...
నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అందువల్ల, వైద్యులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయమని చెబుతుంటారు.   గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి  చాలామంది..
ప్రోటీన్ శరీరానికి అవసరమైన పదార్థం. శరీరంలో కండరాల నిర్మాణానికి, శక్తికి,కణాల అభివృద్దికి, ఎముకల నిర్మాణానికి ఇలా చాలా విషయాలకు ప్రోటీన్ అవసరం అవుతుంది. శరీరానికి ప్రోటీన్ కోసం చాలా మంది గుడ్లు, పాలు, పాల పదార్థాలు అయిన పనీర్ వంటివి తీసుకుంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.