30 రోజులు అన్నానికి బదులు జొన్న రొట్టెలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
Publish Date:Jul 8, 2026
Advertisement
భారతీయుల భోజనంలో అన్నం చాలా ప్రధానమైనది. అన్నం తినడం వల్ల వచ్చే సాటిసిఫాక్షన్ వేరే ఏ విధంగా రాదని చాలామంది అంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మూడు పూటలా అన్నం తినాలన్నా చక్కగా తినేస్తారు. కానీ ప్రస్తుతం డయాబెటిస్, అధిక బరువు వంటి సమస్యలతో అన్నం అంటే దూరం జరిగే వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారు ఆహారంలో రొట్టెలు తీసుకోవడం మంచిదని అనుకుంటారు. చపాతీలు, సజ్జ, జొన్న రొట్టెలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ముఖ్యంగా జొన్నరొట్టెలు శరీరానికి చక్కని పోషణ ఇస్తాయి. అంతేకాదు.. 30 రోజులు అన్నానికి బదులుగా జొన్న రొట్టెలు తింటే ఆరోగ్య పరంగా అద్బుతమైన ఫలితాలు చూస్తారు. 30రోజులు జొన్న రొట్టెలు తింటే ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. 30రోజులు అన్నానికి బదులు జొన్న రొట్టెలు తింటే కలిగే ఫలితాలు.. భారతీయులు ఉపయోగించే తృణదాన్యాలలో జొన్నలు చాలా శ్రేష్టమైనవి. జొన్నలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ కారణంగా అన్నానికి బదులు జొన్న రొట్టెలు తినడం వల్ల చాలాసేపటి వరకు ఆకలి అవ్వదు. ఈ కారణంగా పదే పదే ఏదో ఒకటి తినడం అనే అలవాటు కూడా తగ్గుతుంది. దీనివల్ల బరువు తగ్గడం కూడా సులువు అవుతుంది. రోజూ అన్నానికి బదులు జొన్నరొట్టెలు తినేవారు బరువు సులువుగా తగ్గుతారు. డయాబెటిస్ ఉన్న వారికి జొన్నలు గొప్ప వరం అని చెప్పవచ్చు. అన్నంతో పోలిస్తే జొన్నరొట్టెలలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల జొన్నరొట్టెలు తింటే షుగర్ లెవెల్స్ నిలకడగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు అన్నం, చపాతీ బదులు రోజూ జొన్నరొట్టెలు తింటే బ్లడ్ షుగర్ చాలా కంట్రోల్ అవుతాయి. జొన్నలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల ఆహారం జీర్ణం కావడంలో ఎలా ఇబ్బందులు ఉండవు. మలబద్దకంతో ఇబ్బంది పడేవారు రోజూ జొన్నరొట్టెలు తీసుకుంటే మలబద్దకం సమస్య తొగ్గిపోతుంది. జీర్ణాశయం స్థితి మెరుగవుతుంది. జొన్నరొట్టెలలో ఉండే గ్లైసెమిక్ సూచీ చాలా తక్కువ. ఇది రక్తంలో గ్లూకోజ్ ను చాలా నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఈ కారణంగా నెమ్మదిగా అరుగుతుంది. దీనివల్ల చాలాసేపటి వరకు ఆకలి వేయకుండా ఉండటమే కాదు.. చాలా సేపు ఎనర్జీగా కూడా ఉంచుతుంది. అన్నం అయితే తొందరగా అరిగిపోతుంది. అందుకే జొన్నరొట్టెలు తింటే ఎక్కువ సేపు ఎనర్జీగా ఉండవచ్చు. పూరీ, బేకరీ ఫుడ్స్, కేక్స్, ఆయిల్ ఫుడ్స్ వంటివి తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అయితే చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు ఏ ఆహారం తినాలన్నా చాలా భయపడుతూ ఉంటారు. కానీ రోజూ జొన్న రొట్టెలు తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జొన్నరొట్టెలు శరీరానికి చలువ చేస్తాయి, బలాన్ని ఇస్తాయి, ఎక్కువ సేపు శరీరానికి శక్తిని ఇస్తాయి, రోజూ కనీసం ఒక్కపూట అయినా జొన్న రొట్టెలు తింటే శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అందుకే కనీసం రోజులో ఒక్క పూట అయినా జొన్న రొట్టెను ఆహారంలో తీసుకోవడం మంచి అలవాటని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. *రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/can-jowar-roti-transform-your-health-in-just-30-days-34-225387.html





