Publish Date:May 11, 2026
తమిళనాడు సీఎం విజయ్‌పై మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ మొదటి విమర్శ సంధించారు. విజయ్ పాలనను ఆరు నెలల వరకూ చూస్తామనీ.. ఆ తర్వాతే మాట్లాడ్తామని స్టాలిన్ ఇప్పటికే ప్రకటించిన స్టాలిన్.. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత విజయ్ మాట్లాడుతూ తమ ముందు ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లిందని , లోతుపాతులు తెలుసుకోవాల్సి వుందని అన్నారు. ఆచరణ సాధ్యం కాని మాటలు మాట్లాడనని విజయ్ అన్నారు. తానెవరినీ మోసం చేయనని కూడా చెప్పారు. దీనిపై స్టాలిన్ స్పందించారు. తన ప్రభుత్వ అప్పులపై విజయ్ విమర్శలు గుప్పించి, హామీల అమలు నుంచి తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు విజయ్ ఆరోపణలపై స్టాలిన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. మోసపూరిత ప్రకటనలతో ప్రజల్ని తప్పుదారి పట్టించొద్దని హితవు చెబుతూనే.. ఉచిత విద్యుత్, మహిళల భద్రత, మాదక ద్రవ్యాల రవాణా అడ్డుకునేందుకు మొదటి సంతకం చేసిన విజయ్‌ని స్టాలిన్ అభినందించారు.
పది లక్షల కోట్లు అప్పు చేసి, ఖజానాను ఖాళీ చేశారన్న విజయ్ విమర్శల్ని స్టాలిన్ తీవ్ర తప్పు పట్టారు. ఫిబ్రవరి బడ్జెట్‌లోనే అప్పులు, అలాగే ఆర్థిక స్థితి గురించి స్పష్టంగా చెప్పామని గుర్తు చేసిన స్టాలిన్.. ఓటేసిన ప్రజలను తప్పుదోవ పట్టించేలా , ప్రజల్ని మోసం చేసేందుకు ప్రయత్నించవద్దని విజయ్‌కి హితవు చెప్పారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, సంక్షేమ పథకాల్ని అమలు చేశామని గుర్తు చేశారు. ప్రచారం, పాలన ఒక్కటి కాదని విజయ్‌కి స్టాలిన్ ఉపదేశాలు చేశారు. అలాగే హామీలు నెరవేర్చడంలో సవాళ్లు ఏమిటో త్వరలో అర్థమవుతాయని సుతిమెత్తగా హెచ్చరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/campaigning-and-governance-25-219406.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్