బోద్దింకల లిజనింగ్ టూర్.!
Publish Date:Aug 4, 2026
Advertisement
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళన విజయవంతమైన తరువాత కాక్రోచ్ జనతా పార్టీ తన రాజకీయ, సామాజిక పోరాటాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లేందుకు రెడీ అయిపోయింది. నీట్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ ఆందోళనలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనడంతో.. వారిలోఆ చైతన్యాన్ని మరింత పెంచాలన్న లక్ష్యంతో కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వం ముందుకు సాగుతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువత, విద్యార్థుల ఆశయాలు, ఆకాంక్షలు, ఆందోళనలు, అవసరాలను నేరుగా తెలుసుకోవడమే లక్ష్యంగా దేశవ్యాప్త పర్యటనకు కాక్రోచ్ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది. లిజనింగ్ టూర్ పేర చేపట్టనున్న ఈ పర్యటన ద్వారా ప్రతి రాష్ట్రంలోని యువతతో నేరుగా మమేకమయ్యేందుకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఈ పర్యటనకు సంబంధించిన కార్యాచరణను ఖరారు కోసం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో బుధ, గురువారాల్లో ( ఆగస్టు5, 6) సమావేశాన్ని నిర్వహించబోతున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పేర్కొంది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నాయకత్వంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ ముఖ్య అధికార ప్రతినిధులు, సంస్థాగత నాయకులు పాల్గొంటారు. గతంలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నీట్ వ్యతిరేక ఆందోళనలో సుమారు 50 మంది వాలంటీర్లు రాత్రింబవళ్లు శ్రమించి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ 50 మంది ప్రధాన వాలంటీర్లు, ఇతర భాగస్వాములతో క్షుణ్ణంగా చర్చించిన తరువాత దేశవ్యాప్త పర్యటనపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ఆ పోస్టులో పేర్కొంది. నీట్ పేపర్ లీక్ ఘటనపై రెండు నెలల పాటు సాగిన ఉధృత ఆందోళనల ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందన్నకాక్రోచ్ జనతా పార్టీ.. ఈ విజయం విద్యార్థులు, యువతలో కొత్త ఆశలను చిగురింపచేసిందని పేర్కొంది. విద్యార్థులు, యువత ఐక్యంగా కదిలితే.. ఎలాంటి శక్తిమంతమైన వ్యవస్థనైనా ప్రశ్నించవచ్చని ఈ ఉద్యమం నిరూపించిందని పేర్కొంది. లిజనింగ్ టూర్ పై కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్.. యువత ఐక్యంగా నిలబడడం వల్లే అహంకార ప్రభుత్వానికి ఓటమి ఎదురైందన్నారు. అందుకే యువతకు ఉన్న అంచనాలు, వారి సమస్యలకు తగ్గట్టుగా అర్థవంతమైన కార్యాచరణగా మార్చేందుకు లిజనింగ్ టూర్ ప్లాన్ చేసినట్లు వివరించారు. Cockroach Janata Party, CJP Nationwide Listening Tour, NEET Controversy Protests, Abhijit Dipke CJP, Sourav Das CJP Statement, NEET Paper Leak Controversy
http://www.teluguone.com/news/content/cacroach-janatha-party-listining-tour-36-227931.html





