బోద్దింకల లిజనింగ్ టూర్.!

Publish Date:Aug 4, 2026

Advertisement

 నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళన విజయవంతమైన తరువాత   కాక్రోచ్ జనతా పార్టీ   తన రాజకీయ, సామాజిక పోరాటాన్ని మరో  మెట్టు పైకి తీసుకెళ్లేందుకు రెడీ అయిపోయింది.  నీట్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ ఆందోళనలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనడంతో.. వారిలోఆ చైతన్యాన్ని మరింత పెంచాలన్న లక్ష్యంతో  కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వం ముందుకు సాగుతోంది.  దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువత, విద్యార్థుల ఆశయాలు, ఆకాంక్షలు,  ఆందోళనలు,  అవసరాలను నేరుగా తెలుసుకోవడమే  లక్ష్యంగా దేశవ్యాప్త  పర్యటనకు కాక్రోచ్ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది.  లిజనింగ్ టూర్ పేర చేపట్టనున్న  ఈ పర్యటన ద్వారా ప్రతి రాష్ట్రంలోని యువతతో నేరుగా మమేకమయ్యేందుకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్నది. 

ఈ  పర్యటనకు సంబంధించిన  కార్యాచరణను ఖరారు  కోసం మహారాష్ట్రలోని  ఛత్రపతి శంభాజీ నగర్‌లో బుధ, గురువారాల్లో ( ఆగస్టు5, 6)   సమావేశాన్ని నిర్వహించబోతున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పేర్కొంది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నాయకత్వంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ ముఖ్య అధికార ప్రతినిధులు, సంస్థాగత నాయకులు పాల్గొంటారు. గతంలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నీట్ వ్యతిరేక ఆందోళనలో సుమారు 50 మంది వాలంటీర్లు రాత్రింబవళ్లు శ్రమించి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ 50 మంది ప్రధాన వాలంటీర్లు, ఇతర భాగస్వాములతో క్షుణ్ణంగా చర్చించిన తరువాత    దేశవ్యాప్త పర్యటనపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ఆ పోస్టులో పేర్కొంది. 

నీట్ పేపర్ లీక్ ఘటనపై  రెండు నెలల పాటు సాగిన ఉధృత ఆందోళనల ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందన్నకాక్రోచ్ జనతా పార్టీ.. ఈ  విజయం విద్యార్థులు, యువతలో కొత్త ఆశలను చిగురింపచేసిందని పేర్కొంది.   విద్యార్థులు, యువత  ఐక్యంగా కదిలితే.. ఎలాంటి శక్తిమంతమైన వ్యవస్థనైనా ప్రశ్నించవచ్చని ఈ ఉద్యమం నిరూపించిందని పేర్కొంది. 

లిజనింగ్ టూర్ పై కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్.. యువత ఐక్యంగా నిలబడడం వల్లే  అహంకార ప్రభుత్వానికి ఓటమి ఎదురైందన్నారు.  అందుకే  యువతకు ఉన్న అంచనాలు, వారి సమస్యలకు తగ్గట్టుగా అర్థవంతమైన కార్యాచరణగా మార్చేందుకు లిజనింగ్ టూర్ ప్లాన్ చేసినట్లు వివరించారు. 

 Cockroach Janata Party, CJP Nationwide Listening Tour, NEET Controversy Protests, Abhijit Dipke CJP, Sourav Das CJP Statement, NEET Paper Leak Controversy

By
en-us Political News

  
ప్రజాస్వామ్యంలో నాయకుడు ప్రజల కష్టాలను ఆలకించడానికి, కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వడానికి క్షేత్రస్థాయిలోకి రావడం సహజం
లిఫ్ట్‌లోకి అడుగు పెట్టగానే గాలిల్లో కలిసిపోయిన ప్రాణాలు..!
హైదరాబాద్ నగరం మరోసారి ఘోర హత్యోదంతంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
మంత్రి లోకేష్‌తో ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు భేటీ..!
పిల్లల ప్రాణాలను తీస్తున్న ఇసుక ఈగలు..అసలేంటీ మహమ్మారి..?
నేలతల్లి గర్భంలో కోటానుకోట్ల రూపాయల విలువైన బాక్సైట్ సంపద నిద్రాణమై ఉంది.
కాల్పులు జరిపి ఆత్మహత్య చేసుకున్న ఏపీ అధికారి..ఇద్దరు మృతి..!
రెండు కాళ్లు విరిగిన రోగిపై లైంగిక వేధింపులు.. !
ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత అజెండాల కోసం వినియోగించడం తగదని హెచ్చరించింది. పిటిషనర్ పేర్కొంటున్న బాధితులు, అభ్యర్థులు నేరుగా కోర్టు ముందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించింది.
మైనర్ బాలికను బాస్కెట్‌ బాల్ టోర్నమెంట్ల సందర్భంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు, సంజ్ఞలతో వేధించినట్లు వచ్చిన ఫిర్యాదుపై మాదాపూర్ పోలీసులు బాస్కెట్‌బాల్ కోచ్ పృథ్వీశ్వర్ రెడ్డిపై పోక్సో కేసు
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది
చూడటానికి ఆకర్షణీయంగా.. చేతిలోకి తీసుకుంటే బరువుగా.. నాణ్యమైన బ్రాండెడ్ మసాలాల్లా కనిపిస్తున్నాయి..
ఢిల్లీ పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు వ్యాపార వర్గాల్లో, సామాజిక వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నిరసన ప్రాంగణంలో లభ్యమైన ఖాళీ ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ల ఆధారంగా పోలీసులు స్థానిక రెస్టారెంట్లు, కేఫ్ యజమానులను విచారణ పేరిట వేధింపులకు గురి చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.