Publish Date:Jun 15, 2022
దేశంలో ఇక త్వరలోనే 5జి సేవలు అందుబాటులోకి రానున్నాయి. బుధవారం జరిగిన కేబినెట్ సమా వేశంలో 5జీ స్పెక్ట్రమ్ వేలానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇరవయ్యేళ్ల చెల్లుబాటు కాల పరిమితి తో 72 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ను జూలై నెలాఖరునాటికి వేలం వేయడానికి ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ నిర్ణయించింది. ఇది 4జీ కంటే పది రెట్ల వేగంతో పని చేస్తుంది.
5జీ వేలానికి కేంద్ర కేబినెట్ ఆమెదం తెలిపినట్టు బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన తెలి పింది. ప్రభుత్వం డిజిట్ ఇండియా, స్టార్టప్ ఇండియా,మేక్ ఇన్ ఇండియా వంటి విధానపరమైన నిర్ణయా లను అమలుచేస్తున్న నేపథ్యంలో డిజిటల్ అనుసంధానం కీలకంగా మారింది. 5జి టెక్నాలజీ ఆధారిత సేవలను అందజేయడం కోసం మిడ్, హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఉప యోగించుకుంటారని ఆశిస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుత 4G సర్వీసుల ద్వారా సాధ్యమవుతున్న దాని కన్నా 10 రెట్లు ఎక్కువ వేగం, సామర్థ్యంతో సేవలందించడానికి ఉపయోగించు కోవచ్చు.
ఈ రోజుల్లో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ అంతర్భాగంగా మారిపోయిందని, 2015 నుంచి దేశవ్యాప్తంగా 4జీ సేవ లను అత్యంత వేగంగా విస్తరించడంతో దీని ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు. 2014లో పది కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్కై్రబర్లు వుంటే, ప్రస్తుతం ఆ సంఖ్య 80 కోట్లకు పెరిగిందని తెలిపారు. అయితే ప్రస్తు త్వం ఈ నిర్ణయంతో ఇప్పటి వ్యాపారాలు, వ్యాపారస్తులకు ఎంతో లబ్ది చేకూరవచ్చు. కొత్త వ్యాపార సంస్థ లు కూడా అదనపు ఆదాయాన్ని పొందడానికి ప్రబుత్వం నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని అం టున్నారు.
ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో ప్రకటించిన టెలికాం రంగ సంస్కరణలు ఈ వేలానికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ఆటోమోటివ్, హెల్త్‌కేర్, వ్యవసాయం, ఇంధనం తదితర రంగాల్లో యంత్రం నుంచి యం త్రానికి కమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేధాశక్తి వంటి ఇండస్ట్రీ 4.0 అప్లికేషన్ లో సరికొత్త కల్పనల ప్రభంజనం పుంజుకుంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cabinet-approves-5g-spectrum-auction-25-137739.html
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.