టీమ్ ఇండియాకి బౌలింగ్ ప్రధాన అస్త్రం జస్ప్రీత్ బుమ్రా. వన్డేలైనా, టీ-20లైనా అతను తప్పకుండా ఉండాల్సిందే. అంతగా బౌలింగ్ విభాగం అతని మీద ఆధారపడిందనే అనాలి. అయితే ఎవ్వరూ ఆట్టే కాలం వరుస సిరీస్‌ల్లో అంతే అద్భుతంగా రాణించలేరు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలూ తలెత్తుతాయి. ముఖ్యం పేసర్లకు ఇలాంటి ఇబ్బంది వస్తుంది. బుమ్రా కూడా ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతు న్నాడు. ఈ కారణంగానే ఆసియా కప్ పోటీలకు జట్టులోకి ఎంపిక కాలేదు. ఇప్పుడు వాస్తవానికి ఈ టోర్నీలో కీలకపాత్ర వహించాల్సింది.
కానీ శారీరకంగా ఫిట్నెస్ దృష్ట్యా అతనికి విశ్రాంతినీయడమే మేలని బిసిసిఐ భావించింది. అతన్ని జట్టులోకి తీసుకుని మరింత ఇబ్బంది పెట్టడం మంచిది కాదని బిసిసిఐ భావి స్తోంది. విశ్రాంతి అనంతరం అతను ఇక టీ 20 ప్రపంచకప్ పోటీల్లోనే టీమ్ ఇండియాలోకి రావచ్చు. బుమ్రా చివరిగా ఇంగ్లండ్‌పైవన్డే సిరీస్ ఆడాడు.
విశ్రాంతి దృష్ట్యా వెస్టిండీస్‌పై టీ20 సిరీస్‌లో ఆడించ లేదు. బుమ్రాకు ఇలాంటి సమస్య గతంలోనూ తలెత్తి కొంతకాలం జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలి సిందే. అయితే స్వదేశంలో కీలకమైన ఆస్ట్రేలి యా, దక్షిణాఫ్రికాపై సిరీస్‌ల నేపథ్యంలో ఫిట్‌గా ఉం చేందుకుగానూ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ అందుబాటులో ఉండమని బుమ్రాను కోరవ చ్చు. అవకాశాలున్నాయి. కొన్నేళ్లక్రితం కూడా బుమ్రా ఇదే తరహా సమస్యతో బాధపడ్డాడు. ఎక్కువకాలం క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.
ఇదిలా ఉండగా, టీ20 వరల్డ్ కప్‌కు ముందు కీలకమైన ఆసియా టీ20 కప్‌లో ఆడబోయే భారత జట్టుకు బీసీసీఐ సోమవారం ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జట్టులోకి పునరాగ మనం చేసిన కేఎల్ రాహుల్ వైస్‌కెప్టెన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక కొంత విశ్రాంతి తర్వాత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ జట్టులో తిరిగి చోటు దక్కించుకున్నాడు. యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ఆరంభమవనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bumra-not-in-squad-for-asiacup-39-141555.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!