శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ల కలకలం
Publish Date:Apr 8, 2026
Advertisement
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో బుల్లెట్ల కలకలం రేగింది. శంషాబాద్ నుంచి గువహటి వెళ్లేం దుకు వచ్చిన కర్ణాటకకు చెందిన ఓ రాజకీయ నాయకుడి వద్ద భద్రతా సిబ్బంది ఐదు లైవ్ బుల్లెట్ల ను స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో సాధారణ భద్రతా తనిఖీల సమయం లో స్కానింగ్‌లో బుల్లెట్లు బయటపడటంతో అధికా రులు వెంటనే అప్రమత్తమ య్యారు. ఆయుధాలకు సంబంధించిన సరైన అను మతులు, పత్రాలు చూపించ లేకపోవడంతో సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకు న్నారు.తరువాత విచారణ కోసం అతడిని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, బుల్లెట్లు ఎలా వచ్చాయి? ఆయుధం ఎక్కడ ఉంది? అనే అంశా లపై దర్యాప్తు కొనసాగిస్తు న్నారు.ఈ సంఘటనతో విమానాశ్రయంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భద్రతా నిబంధ నలు కఠినంగా అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
http://www.teluguone.com/news/content/bullets-in-shamshabad-airport-36-216923.html





