దొంగ తాళాలతో వెళతాడు, ఆర్ధిక నేరస్తుల్ని వెంటాడుతుంది ఈడీ, నోయిడాలో బుల్డోజర్ మాత్రం త్యాగి వెంటబడింది. నోయిడా గ్రాండ్ ఓమాక్స్ సొసైటీలోని సెక్టర్ 93 బి .బిజెపీ కిసాన్ మోర్చా సభ్యుడు శ్రీకాంత్ త్యాగీ నివాసం. ఆయన చాలా రోజుల నుంచి కనిపించడం లేదు. ఆయన తన ప్రాంతంలోనే ఒక మహిళను బెదిరించడమే కాకుండా గొడవపడ్డాడు. ఏకంగా హౌసింగ్ సొసైటీలో పెద్ద దుమారం లేచింది. ఇంతకీ ఇంత గొడవ, ఆయన కనపడకుండా పోవడానికి కారణం సూదిలోంచి దారం లాంటి సంగతి. త్యాగి తన నివాసం ఆవరణలో ఏదో మొక్క నాటాలనుకున్నాడు. కానీ సొసైటీ నిబంధనలకు విరుద్ధమంటూ పక్క ఫ్లాట్ మహిళ హెచ్చరించింది. అంతే అసలే బీజేపీ నాయకుడినన్న ఆవేశంలో త్యాగి ఏకంగా గొడ వకు దిగాడు. చిలికి చిలికి గాలివానై అది కాస్తా పోలీసు కేసు అయింది. త్యాగి తన పరిమితులను మించి ప్రవర్తించాడని అక్కడి వారి ఆరోపణ. పైగా ఆమెను బెదిరించడం వారు సహించ లేకపోయారు. తాను రాజకీయనాయకుడినన్న ధీమాతోనే అలా దురుసుగా ప్రవర్తిస్తుంటారన్న ఆరోప ణలు ముందునుంచే ఉన్నాయి.
పైగా తనకు పెద్ద పెద్ద వారితో సంబంధాలున్నాయని తన జోలికి వస్తే పరిస్థితులు సరిగా ఉండవని అంటూ బీజేపీ సీనియర్ నేతలతో తానున్న ఫోటోలు చూపించి జనాన్నిభయపెట్టడం బాగా అలవాటుగా మారింది. కాగా ఇటీవల తన నివాసం ప్రాంతంలోనే మహిళలతో గొడవపడి పోలీసు కేసు కావడంతో త్యాగి ఎటో వెళిపోయారు. అసలీ సంగతి తెలిసిన బీజేపీ వర్గాలు కూడా ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా మానేశారు. దీనికి తోడు ఆయన నివాసమే అక్రమ నిర్మాణం అనే ఆరోపణలూ ఉన్నాయి. దీనికి సంబం ధించిన కేసులో నోయిడా ఫేజ్2 ఇన్ఛార్జ్ సుజిత్ ఉపాధ్యాయా పాత్ర కూడా ఉందని ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. త్యాగి నివాసాన్ని నోయిడా పురపాలక సంస్థ కూల గొట్టాలన్నఆదేశాలూ జారీ చేసింది. ఆ ఆదేశాల మాట విన్నప్పటి నుంచే ఆయన కనపడకుండా పోయారు. ఆయన్ను కనిపిస్తే అరెస్టు చేయాలని జాతీయ మహిళా కమిషన్ కూడా డిమాండ్ చేస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bulldozer-rolling-for-tyagi-39-141506.html
తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియ జేసింది. ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. మండే ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓటమి భయం వెంటాడుతోంది. ఇన్నాళ్లూ తనకు అనుకూలమైన అధికారులతో ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులు చేయించిన జగన్ కు ఈసీ వరుసగా షాకిలిస్తోంది. ఎన్నికల నియమావళిలో భాగంగా అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులపై ఈసీ బదిలీ వేటు వేస్తోంది.
కంగనా రనౌత్.. సినీమాల గురించి తెలిసిన వారెవరికీ ఈ పేరును కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. నటిగా ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహించింది. హీరోయిన్ గానే కాదు, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనే ఆమె నటన విమర్శలకు ప్రశంసలు సైతం పొందింది.
మరో సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఐదు రోజులు మాత్రమే ఉండటంతో ఉద్యో గుల కోసం పోస్టల్ బ్యాలెట్ సౌలభ్యం ఉంది. ఈ నెల 9 వరకు గడువు విధించినట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు.
భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో మరచిపోలేని తిరుగుబాటు స్వరం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. చిన్నవయసులోనే మహోజ్వల శక్తిగా మారి భరతమాత దాస్యశృంఖలాల విముక్తి కోసం పోరాడిన మన్యం వీరుడు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్ర్యం వస్తుందని నమ్మి, తన ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు.
కీలెరిగి వాత పెట్టినట్లుగా చిరంజీవి జగన్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఎన్డీయే కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారు. అసలే బలహీనంగా ఉన్న జగన్ కు చిరంజీవి తెలుగుదేశం కూటమికి బాహాటంగా మద్దతు ఇవ్వడం మరింత బలహీనం చేస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకూ చిరంజీవి ప్రత్యక్షంగా తన రాజకీయ మొగ్గు ఎటువైపు అన్నది ప్రకటించలేదు. కానీ మిత్రులు అంటూ అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, అలాగే జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ లకు ఓటు వేయండి అంటూ ఆయన ఒక వీడియో సందేహం ద్వారా ప్రజలకు పిలుపు నిచ్చారు.
దేశంలోనే పేరుపొందిన పారిశ్రామిక ప్రాంతం శ్రీ సిటీ ఇక్కడే ఉంది. అక్కడ కూడా సమస్యల కుప్పగా మారిపోయింది. ఎవరూ పట్టించుకునే వారు లేకపోవడంతో, ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. మరో వైపు, ఒకప్పటి టీడీపీ కంచుకోటగా వున్న సూళ్లూరుపేటలో సంచలన విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికలలో ఇప్పటి వరకూ సినీ పరిశ్రమ నుంచి ఎవరూ తమ మద్దతు ఫలానా పార్టీకి, ఫలానా అభ్యర్థికి అంటూ బాహాటంగా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరి ఆ పార్టీకి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
మళ్ళీ జగన్ అధికారంలోకి రావడం అనేది అసంభవం. అయినప్పటికీ ఇంకా చాలా కొద్దిమంది జగన్ మాయలో వుండే అవకాశం వుంది. వాళ్ళు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడేమో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక ప్రముఖులను ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేయడం సాధారణమైపోయింది.
జగన్ నోట ఓటమి మాట వచ్చేసింది. ఔను ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతాయా అన్న అనుమానం కలుగుతోంది. తనను అడ్డుకోవడానికి వాళ్లు సొమ్ములు నిలిపివేస్తున్నారు. అధికారులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు అంటూ జగన్ మాట్లాడారు.
వీళ్ళకి అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వున్నప్పుడు బెయిల్ కోసం జగన్ ఎవరి కాళ్ళ బేరానికి వెళ్ళాడో, గత పదేళ్ళుగా ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నాడో అందరికీ తెలిసిందే. కనీసం కోర్టు హియరింగ్కి కూడా హాజరు కాకుండా హాయిగా తిరుగుతున్నాడు.
ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అడ్డు ఎవరు వచ్చినా వారిని టార్గెట్ చేయడం ఆనవాయితీ. స్వంత బాబాయి వివేకానందరెడ్డి హత్య చేసినట్టు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్వంత బాబాయిని హత్య చేయించిన ఘనుడు జగన్ అని చెల్లెలు వైఎస్ షర్మిల విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఆమెను చిక్కులు తెచ్చి పెట్టింది.