పులివెందులలో తుస్సు మన్న వైసీపీ నిరసనలు.!
Publish Date:Aug 12, 2026
Advertisement
వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీ నిరసనలు తుస్సుమన్నాయి. నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి. జగన్ కు పెట్టని కోట అయిన పులివెందులతో వైసీపీ నిరసనలకు జనం నుంచి స్పందన కరవైంది. అలాగే డీఎస్సీ అభ్యర్థులూ ఈ నిరసనలను పట్టించుకోలేదు. దీంతో జన సమీకరణ కోసం వైసీపీ స్థానిక నేతలు నానా తంటాలూ పడ్డారు. పులివెందులలోని ప్రైవేట్ కాలేజీల విద్యార్థులను బలవంతంగా నిరసన ర్యాలీలకు తరలించారు. ప్రైవేటు కళాశాలల్లో చదువుకునే విద్యార్థులను రాజకీయ ఆందోళనల్లోకి లాగడంపై తెలుగుదేశం పార్టీ ఖండించింది. పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఈ విషయంపై మాట్లాడుతూ... వైసీపీ నిర్వహించిన మెగా డీఎస్సీ వ్యతిరేక నిరసనల కోసం ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ర్యాలీలకు పంపడాన్ని తప్పుపట్టారు. పార్టీ శ్రేణులతో కలిసి సదరు ప్రైవేటు కాలేజీ వద్దకు చేరుకున్న బీటెక్ రవి, కాలేజీ యాజమాన్యాన్ని నేరుగా నిలదీశారు. రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ చేపట్టిన నిరసనల్లో ఒకవేళ లాఠీచార్జ్ లేదా ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగి విద్యార్థులకు ఏమైనా ప్రమాదం జరిగితే ఆ బాధ్యత ఎవరిదని నిలదీశారు. BTech Ravi Pulivendula, YSRCP DSC 2025 protest, Pulivendula TDP viral video, AP DSC controversy 2025, BTech Ravi warning private college, Kadapa Pulivendula politics
విద్యార్థులను రాజకీయ నిరసనలకు పంపినందుకు యాజమాన్యం తక్షణమే క్షమాపణలు చెప్పాలని, విద్యార్థులను ఆందోళనలకు తీసుకురావాలని ఒత్తిడి చేసిన వైర్‌సీపీ నేతలపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ 2025కి అనుకూలంగా కాలేజీ ఫ్యాకల్టీతో కలిసి ర్యాలీ నిర్వహించాలన్నారు. వైసీపీకి తిరుగులేని ప్రాబల్యం ఉన్న పులివెందులలో, ఎంపీ అవినాష్ రెడ్డి పర్యవేక్షించే పరిధిలో టీడీపీ నేత బీటెక్ రవి ఈ స్థాయిలో నిలదీయడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
http://www.teluguone.com/news/content/btech-ravi-pulivendula-25-228745.html





