కర్నాటకలో బీఆర్ఎస్ పోటీ చేస్తుంది.. కానీ

Publish Date:Apr 7, 2023

Advertisement

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నిండా నెలరోజులు కుడా సమయం లేదు.  మే 10 పోలింగ్, మే 13 కౌంటింగ్ పూర్తవుతాయి. నిజానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను కేవలం ఆ రాష్ట్రానికే పరిమితమైన ఎన్నికలుగా చూసేందుకు లేదు. ఒక విధంగా 2024 సార్వత్రిక ఎన్నికల చిత్రానికి కర్ణాటక ఎన్నికలు ‘ట్రైలర్’ అనవచ్చునని పరిశీలకులు అంటున్నారు. 

ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చావో రేవో అన్న రీతిలో తలపడేందుకు సిద్ధమయ్యాయి. నిజానికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ముక్కోణపు పోటీ ఉంటుందని భావించినా, ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాత సమీకరణలు చకచకా మారిపోయాయి. బీజేపీ, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటున్న నేపథ్యంలో తృతీయ శక్తిగా చక్రం తిప్పే జేడీఎస్ కూడా చప్పబడినట్లు వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి భరోసాతో ముందుకు సాగుతోంది. నిజానికి కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అందరికంటే ముందు సగానికి పైగా నియోజక వర్గాలకు అభ్యర్ధులను ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం 124 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ..  తాజాగా మరో 42 మందితో రెండో జాబితా ప్రకటించింది. దీంతో మొత్తం 224 స్తలకు గానూ, 166 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది.  

అయితే మాజీ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి రేసులో  నేను ఉన్నాను..నేను ఉన్నాను ..అని ఒకటికి రెండుసార్లు  బహిరంగంగా ప్రకటించుకున్న, సిద్ద్రరామయ్యకు ఆయన కోరుకున్నా కోలార్  నియోజక వర్గం టికెట్ దక్కలేదు.  

కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలోనే మాజీ సీఎం సిద్ధరామయ్యతో పాటు పీసీసీ అధ్యక్షుడు, మరో ముఖ్యమంత్రి పోటీదారు డీకే శివకుమార్ పోటీ చేసే నియోజకవర్గాల్ని ఖరారు చేసింది. ఈ క్రమంలో సిద్ధరామయ్యకు వరుణ సీటు కేటాయించింది. అయితే వరుణ కంటే కూడా కోలార్ లో ఈసారి పోటీ చేయాలని సిద్ధూ భావించారు. కానీ చివరి నిమిషంలో ఆయనకు షాక్ తప్పలేదు. ప్రస్తుతానికి అయితే ఆయన కూల్ గా ఉన్నా, ఆఖరి క్షణంలో ఏమి చేస్తారనేది చెప్పలేమని, పార్టీ కేటాయించిన వరుణ నియోజక వర్గంతో పాటు తాను కోరుకున్న కోలార్  నియోజక వర్గంలో  పోటీ చేసందుకు అంగీకరించక పోతే, సిద్దూ  పోటీ నుంచి పూర్తిగా తప్పుకుంటారని ఆయన అనుచరులు అంటున్నారు. అలాగే  సిద్దరామయ్య ను ముఖ్యమంత్రి రేసు నుంచి తప్పించేందుకే ఆయన్ని ఓడిపోయే నియోజక వర్గం నుంచి బరిలో దించుతున్నారా అనే అనుమానాలనూ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్దూ అసంతృప్తి వ్యక్త పరిచినా, అలక పూని ఎన్నికలకు దూరంగా ఉన్నా  కాంగ్రెస్ పార్టీకి కష్టమే అంటున్నారు.

అలాగే  కర్ణాటక నుంచి జాతీయ రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టాలని భావించిన బీఆర్ఎస్ కూడా ఇంకా ఎటూ తేల్చుకోలేదని తెలుస్తోంది. పార్టీ పేరున పోటీ చేసి ఓడి పొతే, ఆ ప్రభావం ఇటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై, అటు లోక్ సభ ఎన్నికలపై కూడా ఉంటుందని  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్  వెనకా ముందు అవుతున్నారని అంటున్నారు. అందుకే ఆయన ఫోకస్ మహారాష్ట్ర వైపు తిప్పారని, అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు. 
అయితే  తెలంగాణ భవన్ లో మరో మాట కూడా వినిపిస్తోంది. బీఆర్ఎస్ ఎంపిక చేసిన నియోజక వర్గాల్లో బలమైన స్వతంత్ర అభ్యర్ధులను నిలబెట్టే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ నేతల ‘లీకు’ ల ద్వారా తెలుస్తోంది. ఇందుకోసం బీఆర్ఎస్... నేతలు కొందరు  రాష్ట్ర సరిహద్దు నియోజక వర్గాలలో పర్యటించి అభ్యర్ధులను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలలోని టికెట్ రాని అసంతృప్తులను చేరే దీసి, గెలిచిన తర్వాత బీఆర్ఎస్ లో చేరే షరతుపై ఆర్థిక సహయం అందించే అలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, కేసీఆర్ అంతిమంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చెప్పలేమని, బీఆర్ఎస్ నేతలు చెపుతున్నాయి.

By
en-us Political News

  
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.