షేక్ ‘హ్యాండ్’ కు బీఆర్ఎస్ రెడీ కానీ..?!

Publish Date:Mar 10, 2023

Advertisement

తానే మారెనా.. తీరే మారెనా.. దారీ తెన్ను లేనే లేక ఈ తీరాయెనా.. అన్నట్లుగా ఉంది కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ పరిస్థితి. నిన్న మొన్నటి దాకా ఇష్టారీతిన నోరు పారేసుకుని విమర్శించిన కాంగ్రెస్ తోనే చేతులు కలిపేందుకు తహతహలాడాల్సి వస్తోంది. ఔను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు?  రాష్ట్రంలో అధికారం నిలుపుకునే వ్యూహంలో భాగంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో చెలిమి  కోరుకుంటుటున్నారు? ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కాంగ్రెస్ పార్టీని పొగుడుతూ చేసిన ప్రసంగం,  అలాగే, అంతకు ముందు విలేకరుల సమవేశంలో  కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కితాబునిస్తూ చేసిన వాఖ్యాలను గమనిస్తే  కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో చెలిమి కోరుకుంటున్నారనే అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.

నిజమే...  రాజకీయాలలో తాత్కాలిక ప్రయోజనాలే కానీ, శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఇప్పుడు తెలంగాణలో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నిన్న మొన్నటిదాకా అనధికార మిత్ర పక్షాలుగా చెలామణి అయ్యాయి. మోడీ ప్రభుత్వం తెచ్చిన వివాదస్పద వ్యవసాయ చట్టాలు మొదలు పెద్ద నోట్ల రద్దు చట్టం వరకు,  కాంగ్రెస్ సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ  వ్యతిరేకించిన అనేక చట్టాలకు  బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. మోడీకి జై కొట్టింది. పెద్దల సభలో  స్నేహ ధర్మాన్ని చక్కగా పోషించింది.  సరే ఆ తర్వాత ఇద్దరి మధ్య సంబంధాలు చెడిన తర్వాత అవే వ్యవసాయ చట్టాలను బీఆర్ఎస్ వ్యతిరేకించింది. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళన చేసింది. అది వేరే విషయం. 

అదలా ఉంటే, ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత వరకు గులాబి పార్టీ ముఖ్య నాయకులు చేస్తున్న ప్రకటనలు గమనిస్తే  బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.   రాష్ట్రంలో రాజకీయ అవసరాలతో పాటుగా, జాతీయ స్థాయిలో కేంద్ర  దర్యాప్తు సంస్థల దాడి నుంచి రక్షణ పొందేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని కూటమికి దగ్గరయ్యే ప్రయత్నాలకు బీఆర్ఎస్ నాయకత్వం సుముఖంగా ఉందనే సంకేతాలు స్పష్ట మవుతున్నాయని అంటున్నారు. 

కాగా తాజగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణ, అరెస్ట్ కు సిద్దమవుతున్న ముఖ్యమంత్రి కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత   గురువారం(మార్చి 9) ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన వాఖ్యలు బీఆర్ఎస్ కాంగ్రెస్ తో చెలిమి కోరుకుంటున్న సంకేతాలను మరింత స్పష్టం చేశాయని అంటున్నారు. 

ఈ సందర్భంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ జంతర్‌ మంతర్‌లో నిర్వహించదలచిన దీక్షకు సోనియా గాంధీని ఆహ్వానించారా అన్న విలేకరుల ప్రశ్నకు కవిత..  సోనియా గాంధీ చాలా పెద్ద నాయకురాలు.. నేను చాలా చిన్న నాయకురాలిని.  అంతే కాదు,   సోనియా మెడలో ఒక మెచ్చుకోలు హారం కూడా వేశారు. 2010లో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఎ సంకీర్ణ ప్రభుత్వం రాజ్యసభలో మహిళా బిల్లు పెట్టడంలో సోనియా కీలక పాత్ర పోషించారని,  ఆమె ధైర్యానికి దేశ మహిళల తరఫున ‘సెల్యూట్‌ ’ చేస్తున్నానని కవిత వ్యాఖ్యానించారు.

అలాగే,  బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీ-టీమ్‌ అని కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణల్పి స్పందిస్తూ, ప్రస్తుతం దేశంలో ఒక పెద్ద ప్రాంతీయ పార్టీగా మాత్రమే మిగిలిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలతో కలవాలని సూచించారు. సరే ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ పార్టీ భ్రమల్లోంచి బయటకు రావాలని అంటూ ఒకటి రెండు చిన్న చిన్న చురకలు కూడా అంటించినా,  మొత్తంగా చూస్తే,  బీఆర్ఎస్ నాయకత్వం హస్తంతో దోస్తీనే కోరుకుంటోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 
అయితే  కొసమెరుపు ఏమంటే, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో తలపెట్టిన దీక్షకు కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధులు హాజరయ్యే అవకాశాలు లేవని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ తెలిపారు.

దీక్షకు ప్రతినిధులను పంపాలంటూ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను ఆహ్వానించినట్లు కవిత ప్రకటించినా..  ఉద్దేశపూర్వకంగానే ఈ దీక్షకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ నిర్ణయించిందని  ఆయన తెలిపారు.  ఒక పార్టీ ఎమ్మెల్సీ చేసే దీక్షకు తాము వెళితే తప్పుడు సంకేతాలు వెళతాయని ఆయన పేర్కొన్నారు.  జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే..  కాలం కలిసి రానప్పుడు తాడే పామై కాటేస్తుందన్న సామెత  ప్రస్తుతం బీఆర్ఎస్ ఉన్న పరిస్థితికి అద్దం పట్టినట్లుగా సరిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.