కేసీఆర్ నాయకత్వంలోని బారత రాష్ట్ర సమితి ఎన్సీపీలో విలీనం కాబోతోంది. ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. నిజంగా నిజం. మహారాష్ట్రలోని బీఆర్ఎస్ శాఖ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో విలీనం కాబోతోంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత బీఆర్ఎస్ జాతీయ పార్టీగా రూపాంతరం చెందిందన్న మాట ఆ పార్టీ అధినాయకత్వమే మరిచిపోయింది.
టీఆర్ఎస్ నుంచి పార్టీని బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామనుకున్న ఆ పార్టీ అధినేత ఆశలు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలవ్వడంతో ఆవిరైపోయాయి. ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణ నుంచి బీఆర్ఎస్ కనీసం ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయం కోసం ఆ పార్టీ కన్న కలలు అంతకు ముందే గల్లంతయ్యాయి. దీంతో ఆ పార్టీ జాతీయ రాజకీయాల వైపు చూడటమే మానేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రలలో పార్టీ కార్యకలాపాలను ఆర్భాటంగా ప్రకటించి ఆయా రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షుల నియామకం కూడా చేపట్టేశారు.
అయితే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలు కావడంతో ఆయా రాష్ట్రాలలో పార్టీ శాఖల విస్తరణకు మంగళం పాడేశారు. అంతే కాకుండా ఓటమి అవమాన భారంతో కేసీఆర్ పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ నేతలు, క్యాడర్ కు కూడా అందుబాటులోకి రావడంలేదు. దీంతో ఇతర రాష్ట్రాలలో బీఆర్ఎస్ పార్టీ నామమాత్రంగా మిగిలిపోయింది. ఏపీలో ఆ పార్టీ అనవాలు కూడా కనిపించడం లేదు. ఇక ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ మహారాష్ట్ర శాఖ ఎన్సీపీలో విలీనం కావడానికి రెడీ అయిపోయింది.
త్వరలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ రావు మంగళవారం (అక్టోబర్ 1) ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో బీఆర్ఎస్ మహారాష్ట్ర నేతలందరూ ఉణ్నారు. దీంతో బీఆర్ఎస్ ఎన్సీపీలో విలీనం కావడం ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. అయితే ఈ విషయంలో శషబిషలకేం తావు లేదనీ, తాము ఎన్సీపీలో విలీనం కానున్నామని బీఆర్ఎస్ మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ రావు కుండబద్దలు కొట్టేశారు. ఈ నెల 6న పూణెలో ఎన్సీపీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో తామంతా ఎన్సీపీ తీర్థం పుచుకుంటామని చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brs-to-merge-in-ncp-39-186005.html
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
Publish Date:Oct 31, 2026
రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ప్రశాంతంగా సాగేనా.?