ఫిబ్రవరి17న సంచలన ప్రకటన?.. ముందస్తా?.. కేటీఆర్ పదోన్నతా?

Publish Date:Feb 9, 2023

Advertisement

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయో లేదో కానీ, ముందస్తు ఎండలు, ముందస్తు విద్యుత్ కోతలు అయితే వచ్చేశాయి. అలాగే ముందస్తు ఎన్నిక వాతావరణ కూడా ముందుగానే తలుపులు తడుతోంది. ఓ వంక ప్రతిపక్ష పార్టీలు పాదయాత్రలు, పబ్లిక్ మీటింగ్స్ తో ప్రజల మధ్యకు వెళుతుంటే, అధికార బీఆర్ఎస్ అసెంబ్లీని వేదిక చేసుకుని ఎన్నికల ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా ఐటీ మంత్రి కేటీఆర్  తన వాగ్దాటితో విపక్షాలను గుక్క తిప్పుకోకుండా ఏకి పారేస్తున్నారు.

చివరకు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా మాజీ మిత్రుని వాగ్ధటిని మెచ్చుకున్నారంటే  కేటీఆర్ ఏ స్థాయిలో దూకుడు పెంచారో వేరే చెప్పనక్కరలేదు. ఒక విధంగా అసెంబ్లీలో డీఫ్యాక్టో ముఖ్యమంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నకేటీఆర్  అటు కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, ఇటు కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలను ఒకే రీతిన ఏకి పారేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీని టార్గెట్ చేస్తూ కేటీఆర్ చేస్తున్న విమర్శలు ఎన్నికల ప్రసంగాల హీటును దాటేశాయి. అందుకే మంత్రి కేటీఆర్ దూకుడు చూస్తే ముందస్తు ఎన్నికలకు సంకేతమా అనే అనుమానాలకు తావిచ్చేలా ఉందని అంటున్నారు. ముందస్తుకు రంగం సిద్డంవుతుందా, లేక కేటీఆర్ పదోన్నతికి సన్నాహాలు జరుగ్తున్నాయా అనే అనుమానాలు సైతం వ్యక్త్రమవుతున్నాయి.

అసెంబ్లీ లోపలే కాదు, బయట కూడా ఇటు ప్రభుత్వ, అటు పార్టీ వ్యవహరాలలోనూ కేటీఆర్ దూకుడు పెంచారు. ఒక విధంగా ఆయన ‘కొత్త చెప్పుల్లో’ కాలుపెట్టేందుకు సిద్డం అవుతున్నారా అనే అనుమనాలు కూడా  వ్యక్తమౌతున్నాయి.  ఈనెల 17న సచివాలయం ప్రారంభోత్సవం తర్వాత సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించనున్న సభకు భారీ జనసమీకరణ చేయాలని గ్రేటర్‌ నేతలకు మంత్రి కేటీ రామారావు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 10వేల మంది హాజరయ్యేలా చూడాలని నేతలకు సూచించారు. నిజానికి, సచివాలయం ప్రారంభోత్సవం అధికారిక కార్యక్రమం, కానీ, సచివాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, బీఆర్ఎస్ సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ భారీ సభ ను విజయ వంతం చేసే బాధ్యతను కేటీఆర్ తీసుకున్నారు.  

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేసమయ్యారు. ఈనెల (ఫిబ్రవరి) 17న సచివాలయం ప్రారంభోత్సవం తర్వాత సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న సభకు భారీ జనసమీకరణ చేయాలని గ్రేటర్‌ నేతలకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈనెల 13న గ్రేటర్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలన్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఇతర జిల్లాలకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇన్‌ఛార్జిలుగా నియమించనున్నట్టు కేటీఆర్‌ తెలిపారు. ఈనెల 13 నుంచి 17వరకు ఇన్‌ఛార్జిలు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లోనే ఉండి జనసమీకరణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టినందున అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్‌ సూచించారు. సచివాలయం ప్రారంభోత్సవం, పరేడ్‌గ్రౌండ్‌ సభను అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

అదలా ఉంటే, కేటీఆర్  లో కనిపిస్తున్న కొత్త ఉత్సాహం దేనికి సంకేతం అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే అదేమిటనే విషయంలో మాత్రం క్లారిటీ లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నాయకులు ఫిబ్రవరి 17  సంచలన ప్రకటన ఉంటుందని అంటున్నారు.

By
en-us Political News

  
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.