ఈ నెలలోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు: మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ ఆమోదం కోసమేనా.?

Publish Date:Oct 16, 2026

Advertisement

కేంద్రంలోని మోడీ సర్కార్ ఈ నెలలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక సమావేశాల్లో  మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు,   నియోజకవర్గాల పునర్విభజన బిల్లలను ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకోవాలని భావిస్తోంది.  

ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 

ఈ ఏడాది ఏప్రిల్ 17న లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో కేంద్రానికి అవసరమైన మద్దతు లభించలేదు. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండోంతుల మెజారిటీ దక్కకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేదు. దీంతో ఈ బిల్లుతో  అనుసంధానమైన ఇతర బిల్లులపై కేంద్రం ముందుకు వెళ్లలేదు.  

మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన చర్చలో అసలు సమస్య మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలా వద్దా అన్నదొక్కటే కాదు. ఆ రిజర్వేషన్లను ఏ విధానంలో అమలు చేయాలి? నియోజకవర్గాల సంఖ్యను ఎలా మార్చాలి? రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అన్న ప్రశ్నలు కూడా కీలకంగా మారాయి.

అన్నిటికీ మించి మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన చట్టం 2023లోనే ఆమోదం పొందింది. అయితే దాని అమలు జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలతో ముడిపడి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం ప్రతిపాదించిన మార్పులు మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచే అంశంతో కలిసి ఉంది.  


అదే వివాదానికీ కారణంగా మారింది. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంపై రాజకీయంగా దాదాపు అన్ని పార్టీలూ మద్దతు ఇస్తున్నప్పటికీ, ఆ రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అంటే..   నియోజకవర్గాల పేర్లు, సరిహద్దులు మార్చడం మాత్రమే కాదు..  ఏ రాష్ట్రానికి ఎన్ని లోక్‌సభ స్థానాలు ఉంటాయి? ఏ ప్రాంతానికి ఎంత రాజకీయ ప్రాతినిధ్యం దక్కుతుంది? వంటి అంశాలపై కూడా ప్రభావం పడుతుంది.  

అందుకే ఈ వ్యవహారం   జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.  ఈసారి బిల్లులకు మద్దతు కూడగట్టేందుకు కేంద్రం ప్రతిపక్ష పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా   డీఎంకేతో చర్చలు సాగుతున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.  మరికొన్ని చిన్న పార్టీల మద్దతును కూడా కూడగట్టేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి.. బిల్లులకు ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో?


[Special Session  Parliament,  Womens Reservation Bill, Delimitation Bill, Redrawing Constituencies, Central Government,  DMK, Discussions, Telugu One]

By
en-us Political News

  
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.