కారు సీన్ రివర్స్.. మౌత్ పబ్లిసిటీతో బీఆర్ఎస్ బెంబేలు!

Publish Date:Nov 13, 2023

Advertisement

సినిమాల విజయంలో  మౌత్ పబ్లిసిటీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాగే ఎన్నికలలో ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే విషయంలో కూడా మౌత్ పబ్లిసిటీ కీలక పాత్ర పోషిస్తుందనీ, గతంలో సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో  మౌత్ పబ్లిసిటీ ప్రాథాన్యత మరింత పెరిగిందనీ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో దాదాపు మీడియా అంతా ఏకపక్షంగా మారిపోయిన పరిస్థితులలో మౌత్ పబ్లిసిటీ ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న విషయంపై పరిశీలకులే కాదు పార్టీలు కూడా మౌత్ పబ్లిసిటీ మీదే ఆధారపడుతున్నాయి. 

మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇంతగా ప్రతి ఇంటికీ చేరువైన ఈ రోజులలో కూడా ఎన్నికలు, ఫలితాలు మౌత్ పబ్లిసిటీ మీద ఆధారపడి ఉండటం ఏమిటి వింతగా ఉందే అనిపించక మానదు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అలాగే ఉందని పరిశీలకులు అంటున్నారు. 

స్వాతంత్రోద్యమ సమయంలో  ఇప్పటిలా మీడియా పెద్దగా ప్రజలకు చేరువగాని సమయంలో ప్రజా ఉద్యమాల నిర్మాణంలో మౌత్ పబ్లిసిటీదే ప్రధాన పాత్రగా ఉండేది. మహాత్మాగాంధీ సహాయనిరాకరణ, విదేశీ వస్తు బహిష్కరణ, దండి  సత్యాగ్రహం వంటి ఉద్యమాలకు ఇచ్చిన పిలుపు ఈ మౌత్ పబ్లిసిటీ ద్వారానే జనాలకు చేరిందని చెబుతారు. అప్పట్లో మీడియా పాత్ర పరిమితం. అలాగే అక్షరాస్యత కూడా స్వల్పమే. చదువుకున్న కొద్ది మంది అందుబాటులో ఉన్న వార్తాపత్రికలను చదివి, ఆ విశేషాలను జనాలకు వివరించి చెప్పేవారు. అలా విన్న వారు మరి కొందరికి... విషయం ప్రజలందరికీ చేరేది. ఇందుకు అప్పట్లో వారం నుంచి పది రోజల సమయం పట్టేదని ఒక  అంచనా. అయితే ఇప్పడు మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా దాదాపుగా అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. అక్షరాస్యులు కూడా గణనీయంగా పెరిగారు. అయితే మీడియాపై విశ్వసనీయత మాత్రం ఏదో ఒక మేరకు సన్నగిల్లింది. అందులో సందేహం లేదు. తెలంగాణ విషయమే తీసుకుంటే..  రాష్ట్రంలో దాదాపు మీడియా అంతా అధికార పార్టీ ప్రచారానికే ఎక్కువ సమయం, స్థలం కేటాయిస్తున్న పరిస్థితి. ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత  ఇంచుమించు ప్రతి రోజూ మూడు బహిరంగ సభలలో ప్రసంగిస్తుండటంతో ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ.. ఆయన ప్రసంగానికి సంబంధించిన వార్తే హైలైట్ అవుతోంది. ఇతర పార్టీల ప్రచార కార్యక్రమాలకు కేటాయించే సమయం, స్థలం కూడా తక్కువ అయిపోతోంది. ఈ పరిస్థితుల్లో గ్రౌండ్ రియాలటీపై వాస్తవాలు జనాలకు ఈ మౌత్ పబ్లిసిటీ ద్వారానే తెలుస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఇక ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే కూడా వివిధ రాజకీయ పార్టీల తరఫున ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన సందర్భాలలో మీడియాలో ప్రచారం కంటే మౌత్ పబ్లిసిటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు చెబుతారు. మీడియా కంటే మౌత్ పబ్లిసిటీ చాలా బలంగా ప్రజలలోకి వెడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేసేవారు. 2019 ఎన్నికల సమయంలో ఆయన ఏపీలో వైసీపీ తరఫున పని చేసిన సంగతి విదితమే. అప్పట్లో పింక్ డైమండ్ మాయం, వివేకా హత్య, కోడికత్తి దాడి వంటి అంశాలను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మలచడంలో ఆయన మీడియా కంటే మౌత్ టాక్ ద్వారా వచ్చే ప్రచారంపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. అప్పట్లో అది సత్ఫలితాలను ఇచ్చింది కూడా.   

ఇక ప్రస్తుతానికి వస్తే తెలంగాణలో  వాస్తవ ప్రజాభిప్రాయం అంతా మౌత్ టాక్  ద్వారానే వెలుగులోనికి వస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో సామాజిక మాధ్యమం, మౌత్ టాక్ విపక్షాలకు ఒకింత మేలు చేస్తున్నాయనీ, అదే సమయంలో  ఎలక్ట్రానిక్ మీడియాలో సింహ బాగం అధికార పార్టీ వార్తల ప్రసారం, ప్రచారానికే పరిమితమైందన్న అభిప్రాయం బలంగా ఉందని చెబుతున్నారు. 

ఆటో, క్యాబ్ డ్రైవర్లు, జనం తరచుగా వెళ్లే బార్బర్ షాపులు, టీ స్టాల్స్, సామాన్యులు ప్రయాణించే సిటీ బస్సులు, మెట్రో రైళ్ల ద్వారా జనాభిప్రాయం ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ ఒక బలమైన మాధ్యమంగా మౌత్ టాక్ మారిపోయిందని అంటున్నారు. ఈఈ ప్రదేశాలలో అత్యధికంగా బీఆర్ఎస్ అవినీతి, పోలవరం ప్రాజెక్టు లోపాలు, మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు వంటి విషయాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నదనీ, అంతిమంగా ఈ చర్చ అధికార పార్టీకి వ్యతిరేక అభిప్రాయంగా బలపడుతున్న సందర్భాలే ఎక్కువగా ఉంటున్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.