బీఆర్ఎస్ ప్లీనరీ రద్దు.. పార్టీ శ్రేణుల్లో నిరాశ

Publish Date:Apr 27, 2026

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేడు తన ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. సాధారణంగా   ఆవిర్భావ దినోత్సవం రోజున   రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ప్లీనరీ నిర్వహించడం, కేడర్‌లో ఉత్సాహం నింపాలని ఏ పార్టీ అయినా భావిస్తుంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తమ సత్తా చాటడానికి ఘనంగా, అట్టహాసంగా జరుపుకుంటాయి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయితే.. ఆవిర్భావ దినోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహించి క్యాడర్ ను వచ్చే ఎన్నికల నాటికి సిద్ధం చేయడానికి అందివచ్చిన అవకాశంగా ఆవిర్భావ దినోత్సవాన్ని చూస్తుంది.

అయితే తెలంగాణలో మాత్రం ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అందుకు భిన్నంగా..  వేసవి తీవ్రతను సాకుగా చూపుతూ ప్లీనరీని రద్దు చేసింది. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.  పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీని రద్దు చేయడంపై పార్టీలోనే భిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.  

రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ  నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్  ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.  పైకి సామాజిక బాధ్యతతోనే ప్రజలు, కార్యకర్తల క్షేమాన్ని కాంక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తున్నా..  సాధారణంగా వేసవిలో కూడా సాయంత్రం వేళల్లో బహిరంగ సభలు నిర్వహించే సంప్రదాయం ఉందని, ఇటీవల జగిత్యాలలో జరిగిన సభే ఇందుకు నిదర్శనమనీ గుర్తు చేస్తున్నారు. ఆ సభకు పార్టీ అధినేత కేసీఆర్ కూడా హాజరైన విషయాన్ని  ప్రస్తావిస్తున్నారు. మొత్తంగా పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం రోజున బహిరంగ సభ జరపకపోవడం పట్ల పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ వ్యక్తం అవుతున్నది. 

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో  బీఆర్ఎస్ తన సత్తా చాటుకోవడానికి ప్లీనరీ కీలకమని అంటున్నారు.  ముఖ్యంగా  కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో అధినేత కేసీఆర్  క్యాడర్‌కు దిశా నిర్దేశం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని అంటున్నారు.  ఇలాంటి కీలక తరుణంలో కేసీఆర్ ప్రజల ముందుకు రాకపోవడం..   తన వాణిని వినిపించకపోవడం పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    తన సొంత కుమార్తె కవిత తనపై చేసిన  విమర్శలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే  కేసీఆర్ బహిరంగ సభ విషయంలో వెనక్కు తగ్గారన్న చర్చ కూడా రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.  

భారీ బహిరంగ సభకు బదులుగా తెలంగాణ భవన్‌లో కేవలం కీలక నేతలతో మాత్రమే ఇండోర్ సమావేశాన్ని నిర్వహించారు.   పార్టీ తన పూర్వ వైభవాన్ని చాటుకోవడానికి ఈ ఆవిర్భావ దినోత్సవం ఒక వేదికగా మారుతుందని ఆశించిన కార్యకర్తలకు ఈ నిర్ణయం   నిరాశను మిగిల్చింది. 

By
en-us Political News

  
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.