Publish Date:Apr 27, 2026
తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేడు తన ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. సాధారణంగా ఆవిర్భావ దినోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ప్లీనరీ నిర్వహించడం, కేడర్‌లో ఉత్సాహం నింపాలని ఏ పార్టీ అయినా భావిస్తుంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తమ సత్తా చాటడానికి ఘనంగా, అట్టహాసంగా జరుపుకుంటాయి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయితే.. ఆవిర్భావ దినోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహించి క్యాడర్ ను వచ్చే ఎన్నికల నాటికి సిద్ధం చేయడానికి అందివచ్చిన అవకాశంగా ఆవిర్భావ దినోత్సవాన్ని చూస్తుంది.
అయితే తెలంగాణలో మాత్రం ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అందుకు భిన్నంగా.. వేసవి తీవ్రతను సాకుగా చూపుతూ ప్లీనరీని రద్దు చేసింది. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీని రద్దు చేయడంపై పార్టీలోనే భిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి. పైకి సామాజిక బాధ్యతతోనే ప్రజలు, కార్యకర్తల క్షేమాన్ని కాంక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తున్నా.. సాధారణంగా వేసవిలో కూడా సాయంత్రం వేళల్లో బహిరంగ సభలు నిర్వహించే సంప్రదాయం ఉందని, ఇటీవల జగిత్యాలలో జరిగిన సభే ఇందుకు నిదర్శనమనీ గుర్తు చేస్తున్నారు. ఆ సభకు పార్టీ అధినేత కేసీఆర్ కూడా హాజరైన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మొత్తంగా పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం రోజున బహిరంగ సభ జరపకపోవడం పట్ల పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ వ్యక్తం అవుతున్నది.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ తన సత్తా చాటుకోవడానికి ప్లీనరీ కీలకమని అంటున్నారు. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో అధినేత కేసీఆర్ క్యాడర్‌కు దిశా నిర్దేశం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని అంటున్నారు. ఇలాంటి కీలక తరుణంలో కేసీఆర్ ప్రజల ముందుకు రాకపోవడం.. తన వాణిని వినిపించకపోవడం పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తన సొంత కుమార్తె కవిత తనపై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే కేసీఆర్ బహిరంగ సభ విషయంలో వెనక్కు తగ్గారన్న చర్చ కూడా రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
భారీ బహిరంగ సభకు బదులుగా తెలంగాణ భవన్లో కేవలం కీలక నేతలతో మాత్రమే ఇండోర్ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ తన పూర్వ వైభవాన్ని చాటుకోవడానికి ఈ ఆవిర్భావ దినోత్సవం ఒక వేదికగా మారుతుందని ఆశించిన కార్యకర్తలకు ఈ నిర్ణయం నిరాశను మిగిల్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brs-plenary-cancelled-39-218370.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.