పేరుకు జాతీయ పార్టీ.. తీరుకు ప్రాతీయం.. ఇదెక్కడి చోద్యం కేటీఆర్ సర్

Publish Date:Sep 27, 2023

Advertisement

తెలంగాణ రాష్ట్ర సమితికి ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమోషన్ ఇచ్చి భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ పార్టీని చేసేశారు.  ఇక తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ చరిత్ర గర్భంలో కలిసిపోయిందనీ, ఇక బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతుందనీ ఆర్భాటంగా ప్రకటించారు. ఓ రెండు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆవిర్భావ సభకు ఆహ్వానించారు. అయితే కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు మాత్రం ఇంకా బీఆర్ఎస్ ఉనికిని గుర్తించడం లేదని అనిపిస్తున్నది. తెలంగాణ ఎన్నికల వేళ అయన కేటీఆర్ తమ పార్టీని బీఆర్ఎస్ అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నట్లు కనిపించడం లేదు. ఎన్నికలలో ఏదో మేరకు ప్రయోజనం పొందాలంటే పార్టీ పేరులో తెలంగాణ ఉండి తీరాలన్నది ఆయన ఉద్దేశంగా కనిపిస్తున్నది. అందుకే ఆయన తమ పార్టీ ఇంకా టీఆర్ఎస్ అనే నమ్ముతున్నారు. భారత రాష్ట్ర సమితి అని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. తాను స్వయంగా భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడైనప్పటికీ.. కేటీఆర్ ఆ విషయాన్ని అంగీకరించడం లేదు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో తమ పార్టీ టీఆర్ఎస్ మాత్రమే అని అంటున్నారు. అదేదో ప్రైవేటు సంభాషణల్లో చెప్పడం కాదు.. బహిరంగంగానే విమల్ ఓన్లీ విమల్ అన్నట్లుగా  తెలంగాణ ఓన్లీ తెలంగాణ అని అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తెరాసను బీఆర్ఎస్ గా గుర్తించి నమోదు చేసిన తరువాత కూడా కేటీఆర్ తమది ఇంకా టీఆర్ఎస్ పార్టీయే అనడం పట్ల పార్టీ శ్రేణుల్లోనే కాదు, పరిశీలకులలో కూడా విస్మయం వ్యక్తం అవుతున్నది.  

ఇంతకీ విషయమేమిటంటే.. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఏపీలోనే కాదు.. దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలు అక్రమ అరెస్టును ఖండిస్తూ రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అలాగే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనూ ఐటీ ఉద్యోగులు భారీ ర్యాలీలు నిర్వహించారు. అయితే తెలంగాణ సర్కార్ మాత్రం ఆ ర్యాలీలపై ఉక్కుపాదం మోపింది. ఎక్కడో ఏపీలో జరిగిన రాజకీయ అరెస్టు విషయంలో ఇక్కడ ఆందోళనలు ఏమిటని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు మీడియా మీట్ పెట్టి మరీ చెప్పారు. తమది తెలంగాణ రాష్ట్రమనీ, ఇక్కడ వేరే రాష్ట్రాలలో జరిగిన అంశాలపై స్పందన ఎందుకు అంటూ ప్రశ్నించారు. ఐటీ ఉద్యోగులు చేశారని మరొకరు, వారు చేశారని ఇంకొకరు ఇలా నిరసన ప్రదర్శనలు చేసుకుంటే వెళ్లిపోతే శాంతి భద్రతల మాటేమిటని ప్రశ్నించారు. అదే సమయంలో ఆయనో లాజిక్ మిస్సయ్యారు. బీఆర్ఎస్ ఏపీ శాఖ ఒకటి ఉందనీ, దానికి ఏపీలో ఓ కార్యాలయం ఉందనీ మరిచిపోయారు. మీది తెలంగాణ మాత్రమే అయినప్పుడు అక్కడ పార్టీ కార్యవర్గం ఎందుకు? అక్కడి సమస్యలపై బీఆర్ఎస్ స్పందన ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. అలాగే మహారాష్ట్ర స్థానిక ఎన్నికలలో పోటీ గురించీ నిలదీస్తున్నారు. దేశ్ కీ నేతా కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ పోస్టర్లనీ, కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనలనూ గుర్తు చేస్తున్నారు. 

ఇక ఏపీ రాజకీయాలు మనకెందుకు అంటూ మీడియా సమావేశంలో ప్రశ్నించిన కేటీఆర్ ను నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఏపీలో బీఆర్ఎస్ నిర్వహించిన ఆందోళనలు ఎత్తి చూపారు. అలాగే తెలంగాణలోనే బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ చేసిన ప్రకటనలూ, ఆందోళనల్లో పాల్గొన్న ఉదంతాలను ఎత్తి చూపారు. రాజకీయాలకు అతీతంగా ఆందోళనకు దిగిన ఐటీ నేతలను అడ్డుకున్న కేటీఆర్ సొంత పార్టీ నేతలే.. చివరాఖరకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సహా పలువురు నాయకులు చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తున్నారని గుర్తు చేశారు. ఏకంగా ఏపీ వెళ్లి మరీ సంఘీభావం తెలిపి వస్తున్న బీఆర్ఎస్ నేతలూ ఉన్నారు. అయినా జాతీయ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడై ఉండి కూడా కేటీఆర్ సంకుచితంగా వేరే రాష్ట్రంలో ఏం జరిగితే మనకెందుకు అనడం ఏమిటని నిలదీస్తున్నారు.  

అయినా చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఉన్న ప్రతి చోటా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ పదేళ్ల కిందటి వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భాగం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలోనే హైదరాబాద్ అభివృద్ధి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే సైబరాబాద్ నిర్మాణం జరిగింది. అంతర్జాతీయ క్రీడోత్సవాలు జరిగాయి. ప్రపంచ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు నిర్మాణమయ్యాయి. ఐటీ హబ్ గా బెంగళూరును హైదరాబాద్ అధిగమించింది. ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలు హైదరాబాద్ కు వచ్చాయి. అన్నిటికీ మించి ఐటీ ఉద్యోగాల విషయంలో తెలుగువారి ఆధిపత్యానికి కారణం ఆయన దార్శనికతే అనడంలో సందేహానికి తావులేదు. స్వయంగా ఇదే కేటీఆర్ చంద్రబాబు దార్శనికత వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందనీ, ఆయన బాటలోనే తాను దానిని మరింత విస్తరిస్తున్నానని పలు సందర్భాలలో చెప్పారు. అటువంటి కేటీఆర్ ఇప్పుడు ఇలా చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ తెలంగాణలో నిరసనలు అంగీకరించబోమనీ, కావాలంటే ఏపీ వెళ్లి చేసుకోండనీ చెప్పడం బాధ్యతారాహిత్యమే కాదు, అప్రజాస్వామికమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

మొత్తం మీద ఏపీలో చంద్రబాబు అక్రమ అరెస్టు తెలంగాణలో బీఆర్ఎస్ కాళ్ల కింద భూమిని కదిలిస్తోందని, అందుకే కేటీఆర్ బాబు అరెస్టుపై తెలంగాణలో నిరసనలేంటని రుసరుసలాడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. త్వరలో రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే అన్ని స్థానాలలో పోటీ చేస్తుందని ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో  మెజారిటీ స్థానాలలో తెరాసకు నష్టం జరిగే అవకాశం ఉందన్న ఆందోళనతోనే కేటీఆర్ ప్రాంతీయ నినాదం అందుకున్నారనీ అంటున్నారు.

అయితే కేటీఆర్ ప్రాంతీయ నినాదం బీఆర్ఎస్ కు లాభం కంటే నష్టమే ఎక్కువ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. తెలంగాణ సెంటిమెంట్ అనేదే లేదనీ, ఇక అభివృద్ధి అజెండాతోనే ఎన్నికలకు వెడదామని ముఖ్యమంత్రి కేసీఆర్ విస్పష్టంగా చెప్పేసిన తరువాత నిజమైన అభివృద్ధి చంద్రబాబు హయాంలోనే జరిగింది కదా? అంటూ నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్నలు తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసేలా ఉన్నాయన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది. 

By
en-us Political News

  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.