మళ్ళీ ‘టీఆర్ఎస్’గా మార్చాలా? ఎల్లెళ్ళవయ్యా!

Publish Date:Apr 24, 2024

Advertisement

కేసీఆర్ తన పార్టీ పేరును ఏ దుర్ముహూర్తంలో ‘టీఆర్ఎస్’ నుంచి ‘బీఆర్ఎస్’ అని మార్చాడో అప్పటి నుంచి ఆయన కుటుంబాన్ని, ఆయన పార్టీని దరిద్రం బబుల్ గమ్ అతుక్కున్నట్టు అతుక్కుంది. ఆ దరిద్రం పుణ్యమా అని అటు అధికారం పోయింది. ఇటు ముద్దుల కూతురు తీహార్ జైల్లో పడింది. పదేళ్ళ కేసీఆర్ హయాంలో జరిగిన కుంభకోణాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. ఇంకా ముందు ముందు ఇంకెంత బ్యాండ్ పడనుందో ఆ భగవంతుడికే తెలియాలి.

తెలంగాణ ప్రజల్లో వున్న సెంటిమెంట్‌ని అడ్డం పెట్టుకుని, ఆంధ్ర ప్రజలను తిట్టిపోసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ నుంచి ‘భారత రాష్ట్ర సమితి’ అని మార్చడమే మామూలు విషయం కాదు.. పార్టీ పేరు బీఆర్ఎస్ అని మార్చిన సమయంలో పింక్ పిల్లకాయలంతా కేసీఆర్ ప్రధానమంత్రి కాబోతున్నారని కలలు కన్నారు. కేసీఆర్ కూడా ఆ ఊహల్లో ఊరేగారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పేరుతో హడావిడి చేశారు. ఇంతకాలం తాము తిట్టిపోసిన ఆంధ్రప్రదేశ్‌లో కూడా బిఆర్ఎస్ బ్రాంచ్ ఓపెన్ చేశారంటే వీళ్ళ తెంపరితనానికి, నిస్సిగ్గు వైఖరికి ఇంతకంటే వేరే ఉదాహరణ వుంటుందా? శరీరంలో వున్న సిగ్గుని చివరి బొట్టు వరకూ బయటకి కక్కేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ శాఖ ప్రారంభించాలన్న ఆలోచన రాదు. 2023 ఎన్నికల తర్వాత కేసీఆర్ కొంతకాలం ముఖ్యమంత్రిగా వుంటారు. ఆ తర్వాత 2024 పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో వున్న ఎంపీ సీట్లన్నీ గెలుచుకుని, ఏకంగా మోడీని పక్కకి నెట్టేసి కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారు... అప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుని తెలంగాణ ప్రజల్ని ఉద్ధరిస్తారు... ఇదీ బీఆర్ఎస్ వర్గాలు ఆరోజుల్లో కన్న పగటి కల. రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఆ కల కల్లగా మారిపోయింది. అప్పటి నుంచి బీఆర్ఎస్ వర్గాల్లో ‘పార్టీ పేరు మారిన తర్వాతే మనం మటాష్ అయిపోవడం ప్రారంభమైంది’ అనే అంతర్మథనం మొదలైంది. పార్టీ పేరు మార్చడం తప్పే అని చాలామంది పార్టీ నాయకులు కేసీఆర్ తిడతాడేమో అనే భయం కూడా లేకుండా బాహాటంగానే చెప్పారు. మరికొంతమంది అయితే, త్వరలో మా పార్టీ పేరు టీఆర్ఎస్‌గా మారబోతోంది అని ప్రకటించేశారు కూడా.

పార్టీ వర్గాల ఆకాంక్షలను అర్థం చేసుకోవడంతోపాటు తన మనసులో కూడా వున్న ‘బీఆర్ఎస్’ ప్రభావం ప్రేరేపించడంతో కేసీఆర్ ఎన్నికల సంఘాన్ని సంప్రదించారని తెలుస్తోంది. ఒక్కసారి పార్టీ పేరుని మార్చుకున్న తర్వాత పాత పేరును ఎన్నికల కమిషన్ ఐదేళ్ళపాటు ఫ్రీజ్ చేస్తుంది. ఐదేళ్ళపాటు ఆ పేరుని ఎవరికీ కేటాయించదు. మీరు మళ్ళీ మాకు టీఆర్ఎస్ పేరు కావాలంటే ఎలా సార్? ఇంత చిన్న లాజిక్ మీరు ఎలా మిస్సయ్యారు సార్... అనే అర్థం వచ్చేలా ఎన్నికల సంఘం అధికారుల నుంచి రియాక్షన్ వచ్చిందట. దాంతో బీఆర్ఎస్ అనే పేరును టీఆర్ఎస్‌గా మార్చాలనే ప్రయత్నాలు మానేశారట. ఇప్పటికిలా సర్దుకుపోయి పేరు మార్పు సంగతి ఐదేళ్ళ తర్వాత ఆలోచిద్దామని డిసైడ్ అయ్యారట.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా గెలుపు ధీమా కనిపించడం లేదు. కొద్ది నెలల క్రితం వరకూ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గడపగడపకూ అంటూ తన ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలలోకి పంపిన సమయంలోనే ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించినా జగన్ మాత్రం వైనాట్ 175 అన్న మాటను వదలలేదు.
ఏపీలో జగన్ ఖేల్ ఖతమ్ అయిపోయింది. ఇక తట్టా బుట్టా సర్దుకుని జైలుకు వెళ్ళే ఏర్పాట్లు చేసుకోవడమే
ఏపీలో ఎన్నిక‌ల వేళ న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్య‌ర్థి రోజాకు సొంత పార్టీ నేతల నుంచే ఎదురౌతున్న వ్యతిరేకత, నిరసనలు హాట్ టాపిక్ గా మారాయి. రెండు సార్లు వ‌రుస‌గా విజ‌యం సాధించిన ఆమె.. మూడోసారి విజ‌యంతో హ్యాట్రిక్ విజ‌యాన్ని న‌మోదు చేయాల‌ని ఆశపడుతున్నారు.
హెల్త్ ఇన్స్యూరెన్స్ పేరుతో ప్రీమియం లు వసూళ్ళకే పరిమితం అవుతూ క్లెయిమ్ ల విషయాలకు వచ్చేసరికి ఇలా వేధింపులకు గురి చేసి ఎగొట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్న TATA AIG GENERAL INSURANCE కంపెనీ వంటి సంస్థలపై, వాటి ఆగడాలకు చెక్ పెట్టేదెవ‌రు
కాపు సామాజిక వర్గంపై బలమైన ‘ముద్ర’ గడ సొంతం. అయితే అది ఇప్పుడు కాదు. ఒకప్పుడు. సొంత సామాజికవర్గంపై తన ఆధిపత్యం పోతుందా అన్న సందేహం ఇసుమంతైనా ఆయనలో కనిపించని రోజుల్లో కాపుజాతి కోసం అంటూ ఆయన ఉద్యమాలు చేశారు. కాపు రిజర్వేషన్ అంశాన్ని రాజకీయ పార్టీలు పట్టించుకోక తప్పని పరిస్థితి కల్పించారు. అయితే ఇదంతా గతం.
ఎపిలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే గడువు ఉంది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. కూటమి అభ్యర్థుల తరపున ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం చేయాలని  నిర్ణయించారు.  ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది.. పోలింగ్‌‌కు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి.
నగరిలో రోజా ఓటమే ధ్యేయంగా వైసీపీ స్థానిక నేతలు పని చేస్తున్నారా? వారికి మంత్రి పెద్దిరెడ్డి మద్దతు ఫుల్ గా ఉందా? అన్న అనుమానాలు చాలా కాలంగా ఉన్నాయి. ఆమెపై సొంత పార్టీ నేతలు గతంలో చేసిన అవినీతి ఆరోపణలు ఇందుకు నిదర్శనం.
యథారాజా తథా ప్రజా అన్నది నానుడి. కానీ వైసీపీ విషయంలో మాత్రం యథా అధినేత, తథా ఆ పార్టీ నాయకులు అని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల వేళ వైసీపీ అరాచకాలు రోజు రోజుకూ పెచ్చరిల్లుతున్నాయి.
హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థి  రోహిత్ వేముల దళితుడు కాదని,
మరో పది రోజుల్లో  తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో సంపన్న అభ్యర్థి ఎవరు అన్నది చర్చనీయాంశమైంది. 
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు.. అవమానాలు, అభినందనలు సర్వసాధారణమే. నాకు వాళ్లు గౌరవం ఇవ్వలేదు.. నన్ను వాళ్లు విమర్శించారంటూ.. వ్యక్తిగతంగా కక్ష పెంచుకుంటే సదరు నేతకు రాజకీయ భవిష్యత్తుతో పాటు.. మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అదే పరిస్థితి ప్రస్తుతం మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ఎదురవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.