ముందస్తు లేదంటూనే.. ఎన్నికల మూడ్ లోకి బీఆర్ఎస్!

Publish Date:Mar 14, 2023

Advertisement

రాజకీయ నాయకుల వ్యూహాలు చిత్రంగా ఉంటాయి. నోటితో ఒకటి చెబితే.. చేతలలో మరోటి చేస్తుంటారు. నోటితో ఔనన్నదానినే నొసటితో కాదంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటువంటి వ్యూహాలు, ఎత్తులలో సిద్ధహస్తడని రాజకీయ వర్గాలలో ఒక టాక్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ఇటీవలబీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశాలలో ముందస్తు ఎన్నికల ప్రశక్తే లేదని విస్పష్టంగా ప్రకటించారు.

ఆ వెంటనే పార్టీని మాత్రం ఎన్నికలకు సమాయత్తం చేయడం ప్రారంభించేశారు. రాష్ట్రంలో మరో సారి అధికారమే లక్ష్యంగా పార్టీని  ఎన్నికల మూడ్ లోకి తీసుకు వెళ్లి  పోయారు. ఎన్నికల వ్యూహరచనలో భాగంగా కేసీఆర్ పలు కార్యక్రమాలను ప్రకటించారు. ఆత్మీయ సమ్మేళనాలు, నియోజకవర్గాలకు ప్రత్యేక ఇన్చార్జీల నిమామకాలతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే కార్యక్రమాలను మొదలెట్టేశారు. షెడ్యూల్ ప్రకారమైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆరేడు నెలల సమయం ఉంది. ఇదేం పెద్ద ఎక్కువ సమయం కాదు. సాధారణంగా రాజకీయ పార్టీలన్నీఈ సమయం వచ్చే సరికే ఎన్నికల మూడ్ లోకి వెళ్లి పోతాయి. కానీ కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ కంటే రెండు మూడునెలల ముందే వస్తాయా అన్నట్లుగా తన ఎన్నికల సన్నాహకాల వేగాన్ని పెంచేశాయి.

గతంలో ఒక సారి సిట్టింగులందరికీ సీట్లు అని ప్రకటించేసి తరువాత తీరిగ్గా నాలుక కరుచుకున్న కేసీఆర్.. తూచ్ అందరికీ కాదు.. గెలుపు గుర్రాలకే అని సవరించుకున్నసంగతి తెలిసిందే. తాజాగా మరోసారి సిట్టింగులకే సీట్లు అంటూ ప్రకటించారు. అదే సమయంలో 99 శాతం మంది సిట్టింగులకు మాత్రమే అని చెప్పారు. ఇది సిట్టింగులలోనే కాకుండా, ఆశావహుల్లో కూడా జోష్ నింపుతుంది. ఇక ఆత్మీయ సమ్మేళనాలకు షెడ్యూల్ ప్రకటించడంతో క్యాడర్ కు విరామం లేని కార్యక్రమాలు ఉంటాయి. జనంలోకి వెళ్లడమే ప్రజాప్రతినిథుల నిత్యకృత్యంగా మారిపోతుంది. ఈ పరిస్థితి ఇటీవలి పరిణామాలతో ఒకింత నైరాశ్యంలోకి వెళ్లిన శ్రేణులను వెంటనే యాక్టివ్ అవ్వడానికి ఆత్మీయ సమ్మేళనాలు దోహదం చేస్తాయనడంలో సందేహం లేదు.

మరోవైపు ప్రభుత్వ పథకాలైన దళిత బంధు, గొర్ల పంపిణీ, సొంతింటి జాగా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాల అమలుకూ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. విరామం లేని కార్యక్రమాలతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా లీడర్లు, క్యాడర్ కు చేతి నిండా పని కల్పించాలన్నది ఆయన ఉద్దేశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    

By
en-us Political News

  
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అక్టోబర్ 13న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే అవకాశం ఉందన్న వార్తలు రాజకీయ, జలవనరుల వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
జాతీయ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
శ్రీవారికి జైపూర్ దంపతులు రూ.51.55 లక్షల ఆభరణాల కానుక.!
గోల్డ్ కొనాలన్న ఆశ.. బిడ్డను కోల్పోయిన విషాదం.!
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యకు హైదరాబాద్‌లో భూమి పేరుతో మోసం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.
దేశ రాజధాని దిల్లీలో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.
కన్నవారిని చూడాలని.. స్వస్థలానికి చేరుకోవాలని ఎన్నో ఆశలతో రైలు ఎక్కిన ఓ యువతి ప్రయాణం విషాదాంతమైంది.
దేశ రాజధాని దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.